ఆ ఐటం సాంగ్స్‌కు డబ్బు తీసుకోలేదు: నోరా ఫతేహి | Nora Fatehi not Paid for Dilbar, Kamariya: Did not Have Money to Eat, Pay Rent | Sakshi
Sakshi News home page

Nora Fatehi: అద్దె కట్టేందుకు డబ్బుల్లేవు.. అయినా పైసా తీసుకోకుండా ఐటం సాంగ్స్‌!

Published Fri, Nov 1 2024 6:16 PM | Last Updated on Fri, Nov 1 2024 6:43 PM

Nora Fatehi not Paid for Dilbar, Kamariya: Did not Have Money to Eat, Pay Rent

నోరా ఫతేహి.. ఐటం సాంగ్స్‌తో అల్లాడించే బ్యూటీని ఒకానొక సమయంలో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయట! అలాంటి దీన పరిస్థితిలోనూ రెండు ఐటం సాంగ్స్‌ను ఉచితంగా చేశానంటోంది అమ్మడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నోరా ఫతేహి మాట్లాడుతూ.. నేను ఫారిన్‌ వెళ్తున్న సమయంలో దిల్‌బర్‌, కమరియా పాటలు ఆఫర్‌ చేశారు. నన్ను నేను ప్రూవ్‌ చేసుకోవడానికి ఇదే మంచి సమయం అని భావించాను. 

డబ్బు అవసరం.. అయినా..
మొదట కమరియా పాట షూటింగ్‌, రెండు వారాల తర్వాత దిల్‌బర్‌ సాంగ్‌ షూటింగ్‌లో పాల్గొన్నాను. ఈ రెండు సాంగ్స్‌కు నేను పారితోషికం అందుకోలేదు. ఫ్రీగానే చేశాను. నిజానికి అప్పుడు నాకు డబ్బు అవసరం చాలా ఉంది. తినడానికి, ఇంటి అద్దె కట్టడానికి డబ్బు లేదు. అయినా సరే మనీ కంటే ముందు నన్ను నేను నిరూపించుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చాను. అలాగే వాటిని ఐటం సాంగ్‌లా కాకుండా స్పెషల్‌ డ్యాన్స్‌ పర్ఫామెన్స్‌లా చూపించాలనుకున్నాను. 

కొరియోగ్రఫీపై ఎక్కువ ఫోకస్‌
ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉండాలన్నాను. కొరియోగ్రఫీపైనే ఎక్కువ ఫోకస్‌ చేశాను. అలా దిల్‌బర్‌ సాంగ్‌లో నాతో పాటు స్టేజీపై ఉన్న డ్యాన్సర్లతో వారం రోజులపాటు ప్రాక్టీస్‌ చేయించాను. ఆ పాటకోసం నాకు చాలా చిన్న బ్లౌజ్‌ తీసుకొచ్చారు. అందంగా కనిపించాలి కానీ వ‍ల్గర్‌గా కాదని దాన్ని వేసుకోనన్నాను. దీంతో బ్లౌజు సైజు పెంచి తీసుకొచ్చారు అని నోరా ఫతేహి చెప్పుకొచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement