
గత వారం దీపావళి ప్రత్యేక ఎపిసోడ్‌లో హౌస్‌మేట్స్‌కు స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు నాగ్. పేరెంట్స్ మాట్లాడిన వీడియోలను కంటెస్టెంట్లకు చూపించాడు. అయితే కొందరికే ఆ అవకాశాన్ని ఇచ్చాడు. మరికొందరిని నిరాశపర్చాడు. వారి బాధను అర్థం చేసుకున్న బిగ్‌బాస్ వాళ్లందరికీ ఓ సర్‌ప్రైజ్ ప్లాన్ చేశాడు.

ముందు ఆటపట్టించి..
ఇంటి నుంచి వీడియో మెసేజ్‌లను ప్లే చేసి చూపించాడు. కానీ అంత ఈజీగా ఇవ్వలేదు. ముందుగా గార్డెన్ ఏరియాలో ఓ టెలిఫోన్ పెట్టి తనే కాల్ చేసి ఆటపట్టించి ఆ తర్వాత సర్‌ప్రైజ్ రివీల్ చేశాడు. ఏదైతేనేం.. ఇంటి నుంచి వచ్చిన వీడియోలు చూసి హౌస్‌మేట్స్ ఫుల్ ఖుషీ అయ్యారు.

అడగకుండానే..
తేజ, నబీల్, నయని కన్నీళ్లు పెట్టుకున్నారు. మొత్తానికి నేటి ఎపిసోడ్ ఫుల్ ఎమోషనల్‌గా సాగనుందని అర్థమవుతోంది. అడగందే అమ్మయినా అన్నం పెట్టదు.. కానీ మీరు అడగకుండానే అన్నీ పెడతారంటూ చివర్లో హరితేజ బిగ్‌బాస్‌కు థాంక్యూ చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment