Item Song Dancer
-
ఆ ఐటం సాంగ్స్‌కు డబ్బు తీసుకోలేదు: నోరా ఫతేహి
నోరా ఫతేహి.. ఐటం సాంగ్స్‌తో అల్లాడించే బ్యూటీని ఒకానొక సమయంలో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయట! అలాంటి దీన పరిస్థితిలోనూ రెండు ఐటం సాంగ్స్‌ను ఉచితంగా చేశానంటోంది అమ్మడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నోరా ఫతేహి మాట్లాడుతూ.. నేను ఫారిన్ వెళ్తున్న సమయంలో దిల్బర్, కమరియా పాటలు ఆఫర్ చేశారు. నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇదే మంచి సమయం అని భావించాను. డబ్బు అవసరం.. అయినా..మొదట కమరియా పాట షూటింగ్, రెండు వారాల తర్వాత దిల్బర్ సాంగ్ షూటింగ్లో పాల్గొన్నాను. ఈ రెండు సాంగ్స్‌కు నేను పారితోషికం అందుకోలేదు. ఫ్రీగానే చేశాను. నిజానికి అప్పుడు నాకు డబ్బు అవసరం చాలా ఉంది. తినడానికి, ఇంటి అద్దె కట్టడానికి డబ్బు లేదు. అయినా సరే మనీ కంటే ముందు నన్ను నేను నిరూపించుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చాను. అలాగే వాటిని ఐటం సాంగ్లా కాకుండా స్పెషల్ డ్యాన్స్ పర్ఫామెన్స్‌లా చూపించాలనుకున్నాను. కొరియోగ్రఫీపై ఎక్కువ ఫోకస్ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉండాలన్నాను. కొరియోగ్రఫీపైనే ఎక్కువ ఫోకస్ చేశాను. అలా దిల్బర్ సాంగ్‌లో నాతో పాటు స్టేజీపై ఉన్న డ్యాన్సర్లతో వారం రోజులపాటు ప్రాక్టీస్ చేయించాను. ఆ పాటకోసం నాకు చాలా చిన్న బ్లౌజ్ తీసుకొచ్చారు. అందంగా కనిపించాలి కానీ వల్గర్‌గా కాదని దాన్ని వేసుకోనన్నాను. దీంతో బ్లౌజు సైజు పెంచి తీసుకొచ్చారు అని నోరా ఫతేహి చెప్పుకొచ్చింది.చదవండి: బిగ్‌బాస్ 8: హౌస్‌మేట్స్‌కు దీపావళి సర్ప్రైజ్ -
ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే
ముమైత్‌ఖాన్. ఈ పేరు వింటే ఆరేళ్ల పిల్లల నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు ఖుషీ అయిపోతారు. ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటూ తెలుగు ప్రేక్షకులను.. మమ్మీ డాడీ యారుం వీటిల్ ఇల్లై అంటూ తమిళ తంబిల గుండెల్లో గుబులు పుట్టించిన శృంగార నర్తకి ముమైత్‌ఖాన్. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ అంటూ యావత్ భారతదేశ సినీ అభిమానులను ఉర్రూతలూగించిన మాస్ గ్లామరస్ డాన్సర్. కొన్ని చిత్రాల్లో నాయికగా కూడా నటించి అలరించిన ఈ ముద్దుగుమ్మ 200ల చిత్రాలకు పైగా ఐటమ్‌సాంగ్స్ చేశారు. తాను ఆడటానికే పుట్టానేమో నంటారు. డాన్స్‌కు అడిక్ట్ అయ్యానని చెప్పే ఈ బ్లాక్ బ్యూటీ తాను తొలిసారిగా రూపొందించిన మ్యూజిక్ ఆల్బమ్‌కు అడిక్షన్ అనే పేరును నిర్ణయించారు. ముమైత్‌ఖాన్ అనూహ్యంగా ఈ పాప్ మ్యూజిక్ ఆల్బమ్‌పై మొగ్గు చూపించడానికి ప్రపంచ ప్రసిద్ధి చెందిన గాయని షకీరానే స్ఫూర్తి అంటారు. ఈ గాయనీమణి రచయిత్రి మ్యూజిక్ ఆల్బమ్ చూసి తానూ అలాంటి ప్రయత్నం చేయాలనే కోరిక కలిగిందని చెప్పారు ముమైత్‌ఖాన్. ఆ ప్రయత్నంలో భాగమే ఈ అడిక్షన్ ఆల్బమ్ అన్నారు. 9 ఎక్స్ ఓ, ఎంటీవీ లాంటి అంతర్జాతీయ చానళ్లలో ఈ అడిక్షన్ మ్యూజిక్ ఆల్బమ్ పలుసార్లు ప్రచారమై ముమైత్‌ఖాన్‌ను ప్రపంచవ్యాప్తంగా పాపులర్ చేసిందట. అంతేకాదు తొలి ఏషియన్ మ్యూజిక్ ఆల్బమ్‌గా ఈ అడిక్షన్ గుర్తింపు పొందడం చాలా ఆనందంగా ఉందంటున్నారు ముమైత్‌ఖాన్. ఈ అడిక్షన్ ఆల్బమ్‌ను ముమైత్‌ఖాన్ బుధవారం చెన్నైలో ఆవిష్కరించారు. ఇందులోని పాటలకు ముమైత్‌ఖాన్ ఆడి పాడడం విశేషం.