ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే
ముమైత్‌ఖాన్. ఈ పేరు వింటే ఆరేళ్ల పిల్లల నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు ఖుషీ అయిపోతారు. ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటూ తెలుగు ప్రేక్షకులను.. మమ్మీ డాడీ యారుం వీటిల్ ఇల్లై అంటూ తమిళ తంబిల గుండెల్లో గుబులు పుట్టించిన శృంగార నర్తకి ముమైత్‌ఖాన్. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ అంటూ యావత్ భారతదేశ సినీ అభిమానులను ఉర్రూతలూగించిన మాస్ గ్లామరస్ డాన్సర్. కొన్ని చిత్రాల్లో నాయికగా కూడా నటించి అలరించిన ఈ ముద్దుగుమ్మ 200ల చిత్రాలకు పైగా ఐటమ్‌సాంగ్స్ చేశారు. తాను ఆడటానికే పుట్టానేమో నంటారు. డాన్స్‌కు అడిక్ట్ అయ్యానని చెప్పే ఈ బ్లాక్ బ్యూటీ తాను తొలిసారిగా రూపొందించిన మ్యూజిక్ ఆల్బమ్‌కు అడిక్షన్ అనే పేరును నిర్ణయించారు.
ముమైత్‌ఖాన్ అనూహ్యంగా ఈ పాప్ మ్యూజిక్ ఆల్బమ్‌పై మొగ్గు చూపించడానికి ప్రపంచ ప్రసిద్ధి చెందిన గాయని షకీరానే స్ఫూర్తి అంటారు. ఈ గాయనీమణి రచయిత్రి మ్యూజిక్ ఆల్బమ్ చూసి తానూ అలాంటి ప్రయత్నం చేయాలనే కోరిక కలిగిందని చెప్పారు ముమైత్‌ఖాన్. ఆ ప్రయత్నంలో భాగమే ఈ అడిక్షన్ ఆల్బమ్ అన్నారు. 9 ఎక్స్ ఓ, ఎంటీవీ లాంటి అంతర్జాతీయ చానళ్లలో ఈ అడిక్షన్ మ్యూజిక్ ఆల్బమ్ పలుసార్లు ప్రచారమై ముమైత్‌ఖాన్‌ను ప్రపంచవ్యాప్తంగా పాపులర్ చేసిందట. అంతేకాదు తొలి ఏషియన్ మ్యూజిక్ ఆల్బమ్‌గా ఈ అడిక్షన్ గుర్తింపు పొందడం చాలా ఆనందంగా ఉందంటున్నారు ముమైత్‌ఖాన్. ఈ అడిక్షన్ ఆల్బమ్‌ను ముమైత్‌ఖాన్ బుధవారం చెన్నైలో ఆవిష్కరించారు. ఇందులోని పాటలకు ముమైత్‌ఖాన్ ఆడి పాడడం విశేషం.