నలుగురితో రిలేషన్‌ ..ఒక్కరు కనెక్ట్‌ కాలేదు: ‘స్పెషల్‌’ బ్యూటీ | Mumaith Khan Opens Up Her Breakup Story | Sakshi
Sakshi News home page

నలుగురితో ప్రేమాయణం.. ఒక్కరు కనెక్ట్‌ కాలేదు: ‘స్పెషల్‌’ బ్యూటీ

Published Tue, Feb 4 2025 3:25 PM | Last Updated on Tue, Feb 4 2025 3:51 PM

Mumaith Khan Opens Up Her Breakup Story

ఇండస్ట్రీలో కొన్ని పాత్రలు కొంతమంది నటులకే సెట్‌ అవుతాయి. ఆ పాత్రను చూడగానే పలానా నటుడు అయితేనే ఇలా చేయగలడు అనుకుంటాం. వారు తప్ప వేరేవాళ్లు ఆ పాత్రల్లో కనిపించినా.. అంతగా ఆకట్టుకోలేరు. అలాగే పాటలు, డ్యాన్స్‌ల విషయంలోనూ ఆడియన్స్‌ కొందరికే కనెక్ట్‌ అవుతారు. ఐటమ్‌ సాంగ్‌ అనగానే అందరికి గుర్తొచ్చే పేరు ముమైత్‌ ఖాన్‌(Mumaith Khan). గతంలో మన దగ్గర జయమాలిని, జ్యోతిలక్ష్మి, సిల్కి స్మిత లాంటి తారలు ప్రత్యేక పాటలతో అలరించినా.. కొన్నాళ్ల తర్వాత ఐటమ్‌ సాంగ్‌ హవా తగ్గిపోవడంతో వారంతా కనుమరుగైపోయారు. ఆ తర్వాత తెలుగులో అడపా దడపా స్పెసల్‌ సాంగ్స్‌ వచ్చినప్పుటికీ.. అంతగా ఆకట్టుకోలేదు.

ఇక అంతరించిన పోతున్న ఐటమ్‌ సాంగ్స్‌కి ఊపు తెచ్చిన నటి ముమైత్‌ ఖాన్‌.  పూరీ జగన్నాథ్ - సూపర్‌స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో వచ్చిన పొకిరీలో స్పెషల్‌ సాంగ్‌ ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే’ ఎంత హిట్టయిందో అందరికి తెలిసిందే. దానికి యాభై శాతం మణిశర్మ మ్యూజిక్‌ కారణం అయితే.. మరో యాభై శాతం ముమైత్‌ వేసిన స్టెప్పులే. అప్పట్లో ఏ ఈవెంట్‌లో చూసినా ఈ పాటే మారుమోగిపోయేది. ఆ ఒక్క పాటతో ముమైత్‌ ‘స్పెషల్‌ సాంగ్‌’ స్పెషలిస్ట్‌గా మారిపోయింది.

 పోకిరి తర్వాత యోగి, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, బుజ్జిగాడు, మగధీర, కెవ్వు కేక తదితర సినిమాల్లో ఐటమ్‌ సాంగ్‌కి తనదైన శైలీలో స్టెప్పులేసి అలరించింది. పలు చిత్రాల్లో కీలకపాత్రలు పోషించి నటిగానూ మంచి మార్కులు కొట్టేశారు ముమైత్ ఖాన్. ఆ తర్వాత ఉన్నట్టుండి వెండితెరపై దూరమయ్యారు.

కొన్నాళ్త తర్వాత బిగ్‌బాస్‌ రియాల్టీ షోలో మెరిసింది.ఆ తర్వాత సినిమాల్లో కానీ బయట ఎక్కడ గాని కనిపించలేదు. రీసెంట్ ఈ ఐటమ్‌ భామ వరుస ఇంటర్వ్యూలో ఇస్తూ తన గురించి ఆసక్తికర విషయాలు చెబుతోంది. తనకు ఆ మధ్య పెద్ద యాక్సిడెంట్ అయ్యిందని, కోలుకోవడానికి టైం పట్టడంతో ఇంటికే పరిమితమైనట్లు చెప్పింది. అలాగే ప్రేమ పెళ్లి గురించి మాట్లాడుతూ.. గతంలో నలుగురితో డేటింగ్‌ చేశానని.. వారిలో తనకు ఒక్కరు కూడా కనెక్ట్‌ కాకపోవడంతో బ్రేకప్‌ చెప్పానని చెప్పింది. ప్రస్తుతం ఒంటరిగా హాయిగా జీవితాన్ని గడుపుతున్నానని, భవిష్యత్తులో పెళ్లి అనేది రాసుంటే ఖచ్చితంగా చేసుకుంటానని ముమైత్ చెప్పింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement