ప్రభాస్‌తో నయనతార ‘స్పెషల్‌’ స్టెప్పులు..? | Nayanthara To Feature In Special Song For Prabhas The Raja Saab Movie | Sakshi
Sakshi News home page

ప్రభాస్‌తో ‘స్పెషల్‌’ స్టెప్పులకు నయనతార గ్రీన్‌ సిగ్నల్‌!

Published Sun, Nov 24 2024 11:44 AM | Last Updated on Sun, Nov 24 2024 1:49 PM

Nayanthara To Feature In Special Song For Prabhas The Raja Saab Movie

స్పెషల్‌ సాంగ్‌.. బడా హీరోల సినిమాల్లో ఇది మరింత స్పెషల్‌ అయిపోయింది. సినిమాలో స్టార్‌ హీరోయిన్లు ఒకరిద్దరు ఉన్నపటికీ.. స్పెషల్‌ సాంగ్‌కి వచ్చేసరికి కచ్చితంగా మరో స్టార్‌ హీరోయిన్‌ని తీసుకొస్తున్నారు. మార్కెట్‌ లెక్కలేసి మరీ ఐటమ్‌ సాంగ్‌పై ప్రత్యేక దృష్టిపెడతున్నారు. హీరో రేంజ్‌కి తగ్గట్లుగా స్టార్‌ హీరోయిన్‌తో స్పెషల్‌ డ్యాన్స్‌ చేయిస్తున్నారు. ఇప్పటికే పుష్ప 2 సినిమాలో శ్రీలీల స్పెషల్‌ సాంగ్‌ చేస్తుండగా..ఇప్పుడు  ప్రభాస్‌ కోసం మరో స్టార్‌ హీరోయిన్‌ ‘ప్రత్యేక’ స్టెప్పులేసేందుకు రెడీ అవుతోందట. ఆమే లేడీ సూపర్‌స్టార్‌ నయనతార.

ప్రస్తుతం ప్రభాస్‌ మారుతి దర్శకత్వంతో ‘ది రాజాసాబ్‌’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మాళవికా మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ధి కుమార్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రభాస్ ఇప్పటి వరకు చేయని రొమాంటిక్ హారర్ జానర్‌లో ఈ సినిమాను తెరకెక్కుతోంది. మారుతి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. క్యాస్టింగ్‌ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కావడం లేదు. 

ఇక ఈ సినిమాలో ఓ ఐటమ్‌ సాంగ్‌ కూడా ఉందట. దాని కోసం ఓ భారీ సెట్‌ కూడా ఏర్పాటు చేయబోతున్నారట. అయితే ఈ స్పెషల్‌ సాంగ్‌ని మరింత స్పెషల్‌ చేసేందుకు నయనతారని బరిలోకి దింపబోతున్నారట. ఇప్పటికే  ఈ పాట కోసం మారుతి నయనతారని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ పాట చేసేందుకు నయన్‌ కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. 

గతంలో మారుతి తెరకెక్కించిన బాబు బంగారం సినిమాలో నయనతార నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ  పరిచయంతోనే రాజాసాబ్‌తో స్టెప్పులేసేందుకు నయనతార గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందట. కాగా, ప్రభాస్‌, నయన్‌ కలిసి గతంలో యోగి అనే సినిమాలో నటించారు. మళ్లీ చాలా కాలం తర్వాత ప్రభాస్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటుంది నయనతార. వీరిద్దరి కలయికలో రాబోతున్న స్పెషల్‌ సాంగ్‌ ఎలా ఉంటుందో చూడాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement