లెక్క ప్రకారం ప్రభాస్ 'రాజాసాబ్' సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ కావాలి. కానీ గత కొన్నిరోజుల నుంచి వాయిదా అని రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అధికారికంగా ఏం చెప్పలేదు గానీ దాదాపు వాయిదా పడ్డట్లే. ఎందుకంటే యంగ్ హీరో సిద్ధు జొన్నల్లగడ్డ.. అదే తేదీకి తన కొత్త సినిమాని తీసుకొస్తున్నట్లు ప్రకటించడంతో ఈ క్లారిటీ వచ్చేసింది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సత్యదేవ్ కొత్త సినిమా)
'టిల్లు' సినిమాలతో ఫేమస్ అయిన సిద్ధు.. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో 'జాక్' మూవీ చేస్తున్నాడు. 'బేబి' వైష్ణవి చైతన్య హీరోయిన్. షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పుడు హఠాత్తుగా ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. 'రాజాసాబ్' వాయిదా గురించి వీళ్లకు క్లారిటీ ఉన్నట్లు ఉంది. అందుకే అంత కచ్చితంగా అదే డేట్ వేశారు.
'రాజాసాబ్' వాయిదాకు ప్రబాస్ గాయమే ప్రధాన కారణమని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం చీలమండ బెణికిందని న్యూస్ వచ్చింది. దీనికి సర్జరీ చేయించుకునేందుకు త్వరలో ఇటలీ వెళ్తున్నాడని, జనవరి చివరి వారంలో ప్రభాస్ తిరిగి స్వదేశానికి వస్తాడని తెలుస్తోంది. ఇది కూడా వాయిదాకు మరో కారణమని అంటున్నారు.
(ఇదీ చదవండి: రూ.10 టికెట్‌లో కూర్చుని 'పుష్ప 2' చూశా: నటి సంయుక్త)
Comments
Please login to add a commentAdd a comment