రిలీజై రెండు వారాలవుతున్నా సరే ఇంకా 'పుష్ప 2' హవా కొనసాగుతోంది. మూవీలోని జాతర సీన్ అయితే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఎందుకంటే ఒకరిద్దరు మహిళలు.. ఏకంగా కూర్చున్న సీటులోనే పూనకాలతో ఊగిపోయిన ఒకటి రెండు వీడియోలు సోషల్ మీడియాలో మీరు చూసే ఉంటారు. ఇప్పుడు ఇలాంటి ఓ షాకింగ్ అనుభవం.. యువ నటికి ఎదురైంది. ఆ విషయాన్ని ఇన్ స్టాలో పంచుకుంది.
(ఇదీ చదవండి: మన సినిమా.. ఆస్కార్ రేసు నుంచి ఔట్)
తమిళ నటి, బిగ్‌బాస్ ఫేమ్ సంయుక్త షణ్ముగనాథన్.. రీసెంట్‌గా 'పుష్ప 2' సినిమా చూడటానికి వెళ్లింది. జాతర సీన్ వచ్చినప్పుడు ఈమె పక్కన కూర్చున్న మహిళ.. సామీ అని గట్టిగా అరిచిందట. దీంతో సంయుక్త తెగ భయపడిపోయింది. ఆమె భర్త ఏమో తనని కంట్రోల్ చేయాలని చూశాడు. భయమేసి.. పది రూపాయుల టికెట్‌కు వెళ్లి కూర్చున్నా అని సంయుక్త ఇన్ స్టాలో స్టోరీ పోస్ట్ చేసింది.
అయితే పూనకాలు రావడం, భయపడటం కాదు గానీ థియేటర్లలో ఇంకా రూ.10 టికెట్స్ ఉన్నాయా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. అది కూడా మాల్‌లో ఇంత తక్కువ రేటు ఏంటి? అని ఈమెని ట్రోలింగ్ చేస్తున్నారు. ఇదలా ఉంచితే 12 రోజుల్లో రూ.1450 కోట్లపైనే వసూళ్లని 'పుష్ప 2' సాధించింది. ఈ వీకెండ్, వచ్చే వారం క్రిస్మస్ పండగ కూడా ఈ సినిమాకు బాగా కలిసొచ్చే అవకాశముంది.
(ఇదీ చదవండి: 'కన్నప్ప' ఐదుసార్లు చూస్తా.. విష్ణుతో నెటిజన్ ట్వీట్ టాక్)
Comments
Please login to add a commentAdd a comment