యంగ్ హీరో సత్యదేవ్ నటించిన కొత్త సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. బ్యాంక్ టెక్నీ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రం.. పెద్దగా అంచనాల్లేకుండా థియేటర్లలో రిలీజై మోస్తరు కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు పెద్దగా హడావుడి లేకుండానే డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చేసింది.
(ఇదీ చదవండి: 'జీబ్రా' సినిమా రివ్యూ)
నవంబర్ 22న థియేటర్లలో రిలీజైన 'జీబ్రా' మూవీని డిసెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ చేస్తామని ఆహా ఓటీటీ ప్రకటించింది. కానీ ఆహా గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ చందాదారులు మాత్రం 48 గంటల ముందే చూడొచ్చని పేర్కొంది. అందుకు తగ్గట్లు ఇప్పుడు వాళ్ల కోసం స్ట్రీమింగ్ అవుతోంది.
'జీబ్రా' విషయానికొస్తే.. సూర్య (సత్యదేవ్).. హైదరాబాద్‌లోని ఓ బ్యాంక్‌లో సేల్స్ రిలేషన్‌షిప్ మేనేజర్. మరో బ్యాంకులో పనిచేసే స్వాతి (ప్రియా భవానీ శంకర్) ఇతడి లవర్. ఓ రోజు స్వాతి.. బ్యాంకులో పనిచేస్తూ చిన్న పొరపాటు చేస్తుంది. దీంతో సూర్య సాయం కోరుతుంది. సమస్య పరిష్కారం అవుతుంది కానీ అక్కడి నుంచే కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంతకీ అవేంటి? సూర్యతో పాటు అతడి ఫ్యామిలీని డాన్ ఆది (డాలీ ధనంజయ) ఎందుకు చంపాలనుకున్నాడనేదే స్టోరీ.
(ఇదీ చదవండి: రూ.10 టికెట్‌లో కూర్చుని 'పుష్ప 2' చూశా: నటి సంయుక్త)
Comments
Please login to add a commentAdd a comment