ఆ వ్యక్తి ప్రేమిస్తున్నట్లు నన్ను నమ్మించాడు : నయనతార | Nayanthara Open About Her Love Breakup Story | Sakshi
Sakshi News home page

ఆ వ్యక్తి ప్రేమిస్తున్నట్లు నన్ను నమ్మించాడు : నయనతార

Nov 23 2024 4:51 PM | Updated on Nov 23 2024 5:13 PM

Nayanthara Open About Her Love Breakup Story

ప్రేమ విషయంలో తన ఊహాగానాలు తారుమారయ్యాయని హీరోయిన్‌ నయనతార భావోద్వేగానికి గురయ్యారు. ఇంతకీ విషయం ఏంటంటే... నయనతార వ్యక్తిగత జీవితం, సినీ జీవితం, పెళ్లి వంటి అంశాల ఆధారంగా ‘నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ డాక్యుమెంటరీ రూపొందిన సంగతి తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ఈ డాక్యుమెంటరీ ఈ నెల 18 నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. 

కాగా తన జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ డాక్యుమెంటరీ వేదికగా నయనతార పంచుకున్నారు. సినిమా సెట్స్‌లో నయనతార మొబైల్‌ ఫోన్‌ మోగితే, ఆమె చాలా డల్‌ అయిపోయేవారు అంటూ నాగార్జున ఈ డాక్యుమెంటరీలో మాట్లాడారు. 

(చదవండి: ‘నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ రివ్యూ)

ఈ విషయంపై నయనతార స్పందించారు. ‘‘నిజానికి ప్రేమ అనేది నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. నేనొక వ్యక్తిని మనస్ఫూర్తిగా నమ్మాను. తను నన్ను ప్రేమిస్తున్నాడని అనుకున్నాను. నన్ను అలా నమ్మించాడు. రిలేషన్‌షిప్‌లో అబ్బాయి – అమ్మాయిల మధ్య ఏదైనా జరిగితే, ఎక్కువగా అమ్మాయిల గురించే మాట్లాడుకుంటారు. తప్పంతా అమ్మాయిలదే అన్నట్లు వార్తలు రాస్తారు. ఎవరూ మగాళ్లను అడగరు’’ అంటూ ఒకింత భావోద్వేగంతో మాట్లాడారు నయనతార. అయితే తనని నమ్మించిన వ్యక్తి పేరుని మాత్రం నయనతార వెల్లడించలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement