Nayanthara: Beyond The Fairy Tale
-
మరోసారి వివాదంలో నయనతార.. చంద్రముఖి నిర్మాతల నోటీసులు
హీరోయిన్ నయనతార (Nayanthara) మరోసారి వివాదంలో చిక్కుకుంది. తమ అనుమతి లేకుండా చంద్రముఖి సినిమాలోని సన్నివేశాలను తన డాక్యుమెంటరీలో వాడుకున్నందుకు నిర్మాతలు నయనతారకు నోటీసులు పంపించారు. హీరోయిన్, ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ తమకు రూ.5 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పగతోనే నోటీసులు పంపాడన్న నయన్కాగా తమ అనుమతి లేకుండా నానుమ్ రౌడీ దాన్ (నేనూ రౌడీనే) సినిమాలోని మూడు సెకన్ల క్లిప్స్‌ను తన డాక్యుమెంటరీ బియాండ్ ద ఫెయిరీ టేల్‌కు వాడుకున్నారంటూ ధనుష్ (Dhanush).. నయనతారకు నోటీసులు పంపించిన విషయం తెలిసిందే! తమపై కక్షగట్టే ధనుష్ నోటీసులు పంపించాడన్న నయనతార మరి ఇప్పుడెలా స్పందిస్తుందో చూడాలి!వివాదం ఎలా మొదలైందంటే?నయనతార జీవితంపై నెట్‌ఫ్లిక్స్ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ (Nayanthara: Beyond the Fairytale) అనే డాక్యుమెంటరీ తెరకెక్కింది. ఇందుకుగానూ కొన్ని సినిమా క్లిప్స్ వాడుకున్నారు. అందులో భాగంగా నేనూ రౌడీనే చిత్రంలోని మూడు సెకన్ల సన్నివేశం ఉపయోగించుకున్నారు. ఈ చిత్రానికి విఘ్నేశ్ శివన్ దర్శకుడు కాగా ధనుష్ నిర్మాత. ఈ సినిమా చేస్తున్న సమయంలో విఘ్నేశ్- నయన్ లవ్‌లో పడ్డారు. చాలాకాలంపాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట 2022లో పెళ్లి చేసుకున్నారు.(చదవండి: నేనూ మనిషినే.. ఏడ్చేసిన మాధవీలత)ధనుష్‌పై నయనతార ఆగ్రహంఈ విశేషాలను తన డాక్యుమెంటరీలో పొందుపరిచారు. అయితే నేనూ రౌడీనే సినిమా క్లిప్స్ తన అనుమతి లేకుండా వాడేయడంతో ధనుష్ రూ.10 కోట్లు నష్టపరిహారం డిమాండ్ చేశాడు. దీనిపై నయన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టింది. తండ్రి, అన్నయ్య అండతో నువ్వు నటుడిగా ఎదిగావు. నేనూ ఏ బ్యాక్‌గ్రౌండ్‌లో లేకుండా ఈ సినీప్రపంచంలో పోరాడి ఈ స్థాయిలో ఉన్నాను. నా నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ కోసం పలువురు సినీ ప్రముఖులు సాయం చేశారు. దీని రిలీజ్ కోసం నాతోపాటు నా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నా మనసు ముక్కలైందినీకు మాపై పగ ఉండొచ్చు. కానీ దానివల్ల ఈ ప్రాజెక్ట్ కోసం కష్టపడ్డవారి జీవితాలపైనే అది ప్రభావం చూపిస్తుంది. నా ఇతర సినిమా క్లిప్స్ వాడాం.. కానీ ఎంతో ప్రత్యేకమైన నేనూ రౌడీనే చిత్ర సన్నివేశాలు మాత్రం ఉపయోగించలేకపోయాం. ఈ సినిమా పాటలు మా డాక్యుమెంటరీకి బాగా సెట్టవుతాయి. కానీ ఎన్నిసార్లు అభ్యర్థించినా నువ్వు వాటిని వాడుకోవడానికి వీల్లేదనడం నా మనసును ముక్కలు చేసింది. బిజినెస్ లెక్కల పరంగా కాపీ రైట్ సమస్యలు వస్తాయని నువ్వు ఇలా చేసుంటావ్ అనుకోవచ్చు.ఇంత దిగజారుతావనుకోలేదుకానీ చాలాకాలంగా మాపై పెంచుకున్న ద్వేషాన్ని ఇలా చూపించడం వల్లే మేం బాధపడాల్సి వస్తోంది. నేనూ రౌడీనే షూటింగ్ టైంలో మేం మా ఫోన్లో తీసుకున్న వీడియోని ట్రైలర్లో 3 సెకన్లు ఉపయోగించినందుకు నువ్వు రూ.10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేయడం చాలా దారుణం. నువ్వు ఇంతలా దిగజారుతావ్ అనుకోలేదు. దీన్నిబట్టి నీ క్యారెక్టర్ ఏంటో అర్థమవుతోంది. నీ అభిమానుల ముందు, బయట ఎంతలా నటిస్తున్నావో తెలుస్తోంది. మాతో మాత్రం అలా ప్రవర్తించకు. సినిమా సెట్లో ఉన్న వాళ్లందరి జీవితాల్ని శాసించే హక్కు నిర్మాతకు ఉందా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది.చదవండి: నా కాపురంలో హన్సిక చిచ్చుపెడుతోంది.. పోలీసులకు నటి ఫిర్యాదు -
ఏ తప్పు చేయలేదు.. ఎందుకు భయపడాలి: నయనతార
తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదంటోంది నయనతార. ధనుష్ విషయంలో తాను చేసిన పనిని సమర్థించుకుంటుంది. ఆయనతో మాట్లాడానికి చాలా ప్రయత్నించానని..కుదరకపోవడంతో లేఖ రాయాల్సి వచ్చిందని చెప్పింది. ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్’ డాక్యూమెంటరీ విషయంలో ధనుష్, నయనతార మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. నయనతార జీవితాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్‌లో తన పర్మిషన్ తీసుకోకుండా ‘నానుమ్ రౌడీ దాన్’లోని సీన్‌ను వాడుకున్నారంటూ చిత్ర నిర్మాత ధనుష్ లీగల్ నోటీసులు పంపించాడు. మూడు సెకన్ల క్లిప్‌నకు రూ.10 కోట్లు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో నయనతార ధనుష్ క్యారెక్టర్ని తప్పుబడుతూ బహిరంగ లేఖను రాసింది. తాజాగా ఈ వివాదంపై నయనతార క్లారిటీ ఇచ్చింది. తాను లేఖను రాయడానికి గల కారణం ఏంటో తెలిపింది. (చదవండి: ఇక్కడితో ఆపేయండి..లేదంటే లీగల్ నోటీసులు పంపిస్తా.. సాయి పల్లవి మాస్ వార్నింగ్)ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ వివాదం గురించి మాట్లాడుతూ.. ‘ధనుష్ క్యారెక్టర్ని బయట ప్రపంచానికి తెలియజేయడానికే ఆ లేఖను రాశాను. ‘న్యాయమని నమ్మిన దాన్ని బయటపెట్టడానికి నేను ఎందుకు భయపడాలి? తప్పు చేస్తే భయపడాలి. పబ్లిసిటీ కోసం ఎదుటి వ్యక్తుల పేరు ప్రతిష్ఠలను దెబ్బతీసే మనిషిని కాదు నేను. నా డ్యాక్యుమెంటరీ ఫిల్మ్ పబ్లిసిటీ కోసమే ఇదంతా చేశారని చాలా మంది మాట్లాడుతుంటున్నారు. అందులో ఏమాత్రం నిజం లేదు. (చదవండి: పుష్పరాజ్ వసూళ్ల సునామీ.. ఆరు రోజుల్లోనే రప్ఫాడించాడు!)వీడియో క్లిప్స్‌కు సంబంధించిన ఎన్వోసీ కోసం ధనుష్‌ని కలిసేందుకు ప్రయత్నించాం. నేను, విఘ్నేష్ ఫోన్ చేశాం. కామన్ ఫ్రెండ్స్‌తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేశాం. కానీ ధనుష్ స్పందించలేదు. ఆయన మమ్మల్ని ఎందుకు ద్వేషిస్తున్నారో తెలియదు. ముందు నుంచి మేమిద్దరం ఏమీ శత్రువులం కాదు. ఆయన నాకు మంచి స్నేహితుడే. ఈ పదేళ్లలో ఏం జరిగిందో తెలియదు. ఆయనకు మాపై ఎందుకు కోపం వచ్చిందనే విషయం కూడా మాకు అర్థం కావడం లేదు. పక్కవాళ్ల మాటలు విని మమ్మల్ని అపార్థం చేసుకున్నారా? ఇలాంటివి క్లియర్ చేసుకునేందుకు ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించాను. అది కుదరలేదు’ అని నయనతార అన్నారు. -
అభిమానులకు నయనానందకరం
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హీరోయిన్ నయనతార జీవితంపై రూపొందిన ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీ గురించి తెలుసుకుందాం.తెర మీద కనపడే తారలపై ప్రేక్షకులకు మక్కువ ఎక్కువ. మరీ ముఖ్యంగా సినీ ప్రేక్షకులు ఈ తారలపై అపరిమిత అభిమానాన్ని పెంచుకుంటూ వారి వ్యక్తిగత జీవితాలను గురించి కూడా తెలుసుకోవాలని ఆరాటపడతుంటారు. ప్రస్తుత వినోద రంగంలో వాణిజ్య విప్లవమైన ఓటీటీ వేదికలు అడపాదడపా కొంతమంది కళాకారుల వ్యక్తిగత జీవితాలను డాక్యుమెంటరీ రూపంలో ప్రేక్షకులకు అందుబాటులోకి తెస్తున్నాయి.వీటికి సదరు నటీనటులకు ఓటీటీ సంస్థలు భారీ మొత్తంలో పారితోషికం ముట్టజెప్పి డాక్యుమెంటరీలు రూపొందిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా ప్రముఖ నటి నయనతార డాక్యుమెంటరీ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ రిలీజ్ అయింది. బెంగళూరు నగరంలో పుట్టిన నయనతార అనతి కాలంలోనే తన సినిమా కెరీర్లో అత్యున్నత స్థాయికి ఎదిగారని చెప్పవచ్చు. సౌత్ ఇండియా క్వీన్ అని ఫ్యాన్స్ పిలుచుకునే ఈ బ్యూటీ ప్రతిష్ఠాత్మక పత్రిక ఫోర్బ్స్‌లో ‘ఇండియాలో సెలబ్రిటీ 100 లిస్ట్’లో ప్రచురింపబడ్డ ఒకే ఒక్క దక్షిణాది నటి.అంతటి నటి డాక్యుమెంటరీ అంటే ఇక చెప్పేదేముంది అభిమానులకు పండగే. ఈ డాక్యుమెంటరీ మొత్తం నయనతార జీవితాన్ని చూసినట్టుగా కాదు, అనుభూతి పొందినట్టుగా ఉంటుంది. నయనతార పుట్టుక నుండి తన పెరుగుదల, చదువు ఆ తరువాత తన సినిమా ప్రస్థానం ఇవన్నీ ఎంతో చక్కగా చూపించారు. వీటితో పాటు నయనతార గురించి సినీ ప్రముఖులు, ఆమె ఆప్తుల అభిప్రాయాలతో కూడిన విశ్లేషణ ఇవ్వడం మరో హైలైట్. జీవితమంటే సాఫీగా సాగే ప్రయాణమే కాదు.ఒడిదుడుకులుంటాయి. సినిమా స్టార్ అయినా సాధారణ మనిషైనా ఎవ్వరికైనా జీవితం జీవితమే. అలాగే నయనతార ఎంత ఎత్తుకు ఎదిగినా తన జీవితంలో కూడా ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలెన్నో ఉన్నాయి. అవన్నీ కూడా తానే వివరిస్తూ తన సినిమా జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని ప్రేక్షకులకు సవివరంగా వివరించారు. నయనతార గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ డాక్యుమెంటరీ చూడాల్సిందే. ఏదేమైనప్పటికీ టైటిల్లో ఉన్నట్లు ఈ డాక్యుమెంటరీ అంతకు మించి... అందుకే ఇది నయనానందకరం.– ఇంటూరు హరికృష్ణ -
వివరణ ఇవ్వాలి.. నయనతారకి హైకోర్టు నోటీసు
నటి నయనతార, ఆమె భర్త–దర్శకుడు విఘ్నేశ్ శివన్ లకు చెన్నై హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే... నయనతార జీవితంలోని ముఖ్య సంఘటనల ఆధారంగా ‘నయనతార: బియాండ్ద ఫెయిరీ టేల్’ అనే డాక్యుమెంటరీ రూపొందిన విషయం తెలిసిందే. నయనతార పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ డాక్యుమెంటరీ స్ట్రీమ్ అవుతోంది. కాగా ఈ డాక్యుమెంటరీలో విజయ్ సేతుపతి, నయనతార జంటగా వండర్ బార్ ఫిలిమ్స్ పతాకంపై విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ధనుష్ నిర్మించిన ‘నానుమ్ రౌడీదాన్ ’ చిత్రంలోని సన్నివేశాలను ఉపయోగించారు. అయితే ఇలా వినియోగించడానికి ధనుష్ అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ధనుష్‌ని విమర్శిస్తూ నయనతార ఒక లేఖను విడుదల చేశారు. అది సినీ వర్గాల్లో చర్చకి దారి తీసింది. ఇక తన అనుమతి లేకుండా ‘నానుమ్ రౌడీదాన్ ’లోని క్లిప్పింగ్ వాడినందుకు నష్టపరిహారంగా రూ. 10 కోట్లు కోరుతూ నయనతారపై చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ బుధవారం న్యాయస్థానంలో విచారణకు వచ్చింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా నయనతార, విఘ్నేష్ శివన్ లకు నోటీసులు జారీ చేశారు. మరి... తదుపరి పరిణామాలేంటి? అనేది వేచి చూడాల్సిందే. – సాక్షి, తమిళ సినిమా -
ఆ వ్యక్తి ప్రేమిస్తున్నట్లు నన్ను నమ్మించాడు : నయనతార
ప్రేమ విషయంలో తన ఊహాగానాలు తారుమారయ్యాయని హీరోయిన్ నయనతార భావోద్వేగానికి గురయ్యారు. ఇంతకీ విషయం ఏంటంటే... నయనతార వ్యక్తిగత జీవితం, సినీ జీవితం, పెళ్లి వంటి అంశాల ఆధారంగా ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీ రూపొందిన సంగతి తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ఈ డాక్యుమెంటరీ ఈ నెల 18 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. కాగా తన జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ డాక్యుమెంటరీ వేదికగా నయనతార పంచుకున్నారు. సినిమా సెట్స్‌లో నయనతార మొబైల్ ఫోన్ మోగితే, ఆమె చాలా డల్ అయిపోయేవారు అంటూ నాగార్జున ఈ డాక్యుమెంటరీలో మాట్లాడారు. (చదవండి: ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ రివ్యూ)ఈ విషయంపై నయనతార స్పందించారు. ‘‘నిజానికి ప్రేమ అనేది నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. నేనొక వ్యక్తిని మనస్ఫూర్తిగా నమ్మాను. తను నన్ను ప్రేమిస్తున్నాడని అనుకున్నాను. నన్ను అలా నమ్మించాడు. రిలేషన్షిప్లో అబ్బాయి – అమ్మాయిల మధ్య ఏదైనా జరిగితే, ఎక్కువగా అమ్మాయిల గురించే మాట్లాడుకుంటారు. తప్పంతా అమ్మాయిలదే అన్నట్లు వార్తలు రాస్తారు. ఎవరూ మగాళ్లను అడగరు’’ అంటూ ఒకింత భావోద్వేగంతో మాట్లాడారు నయనతార. అయితే తనని నమ్మించిన వ్యక్తి పేరుని మాత్రం నయనతార వెల్లడించలేదు. -
OTT: ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ ఎలా ఉందంటే?
నయనతార జీవిత ఆధారంగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ తెరకెక్కించిన డ్యాక్యుమెంటరీ సిరీస్‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’. అమిత్ కృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ నేటి(నవంబర్ 18) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒక గంట ఇరవైరెండు నిమిషాల నిడివిగల ఈ డ్యాక్యుమెంటరీ సిరీస్ ఎలా ఉంది? అందులో ఏం చూపించారు?🔸నయనతార జీవితం మొత్తాన్ని ఓ బ్యూటిఫుల్ స్టోరీగా మలిచి తెరపై అందంగా చూపించే ప్రయత్నం చేసింది నెట్‌ఫ్లిక్స్🔸నయనతార చిన్నప్పటి ఫోటోలను చూపుతూ..ఆమె స్కూల్ డేస్ సీన్‌తో ఈ డ్యాక్యుమెంటరీ ప్రారంభం అవుతుంది.🔸ఆమెకు సినిమా చాన్స్ ఎలా వచ్చింది? మాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కి ఎలా ఎంట్రీ ఇచ్చిందనేది ఆయాన డైరెక్టర్లతో చెప్పించారు.🔸కెరీర్ తొలినాళ్లతో నయనతార పడిన ఇబ్బందులను, బాడీ షేమింగ్ చేసినప్పుడు తను పడిన మానసిక క్షోభను పంచుకున్నారు.🔸తన పర్సనల్ లైఫ్‌పై వచ్చిన కొన్ని విమర్శల కారణంగా సినిమా చాన్స్‌లు కోల్పోయినా.. తిరిగి ఎలా ట్రాక్‌లోకి వచ్చారనేది ఆసక్తికరంగా తెలియజేశారు.🔸శ్రీరామరాజ్యం సినిమాలో సీత పాత్రకు నయనతారను తీసుకున్నప్పడు వచ్చిన విమర్శలను చూసి ఆమె ఎంత బాధపడిందనే విషయాలను ఆయా దర్శక నిర్మాతలతో చెప్పించారు.🔸తనపై వచ్చిన విమర్శలన్నింటిని పక్కన పడేసి.. ‘లేడీ సూపర్ స్టార్’గా ఎలా ఎదిగారనేది ఆసక్తికరంగా చూపించారు.🔸ఫస్టాఫ్ మొత్తం నయనతార బాల్యం, సినీ కెరీర్‌ని చూపించి..సెకండాఫ్‌లో విఘ్నేశ్‌తో ప్రేమాయణం ఎలా మొదలైంది? వివాహ జీవితం ఎలా ఉందనేది చూపించారు.🔸‘నానుమ్ రౌడీ దాన్’సమయంలో వీరిద్దరి మధ్య ఎలాంటి సంభాషణలు జరిగాయి? విఘ్నేశ్‌కి నయన్ ఎలాంటి సపోర్ట్‌ని అందించింది? ఎలా ప్రేమలో పడిపోయారనేది చక్కగా చూపించారు.🔸పెళ్లికి ముందు వీరిద్దరి రిలేషన్షిప్ ఎలా కొనసాగిందో అనేది వారి మాటల్లోనే చూపించారు. ప్రేమలో ఉన్నప్పడు వారిపై వచ్చిన మీమ్స్ గురించి కూడా సరదాగా పంచుకున్నారు.🔸గ్లాస్ హౌస్‌లోనే నయనతార ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నారు? పెళ్లి రోజు వీరిద్దరు ధరించిన దుస్తుల వెనున ఉన్న కథ, వాటిని తయారు చేయడానికి డిజైనర్లు పడిన కష్టాలను చూపించారు.🔸ఇక ఈ డ్యాక్యుమెంటరీ చివరల్లో నయనతార-విఘ్నేశ్‌ల కవల పిల్లలను చూపిస్తూ.. ఆహ్లాదకరమైన ముగింపును ఇచ్చారు.🔸మొత్తంగా ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ సిరీస్ సరదాగా సాగుతూ.. నయనతార లైఫ్‌లో చోటు చేసుకున్న కొన్ని వివాదాలు.. విమర్శలను చూపిస్తూనే..వాటిని ఎదుర్కొని ఎలా ‘లేడీ సూపర్‌స్టార్’గా ఎదిగారనేది చూపించారు.