
టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు (Dil Raju) తాజాగా ఆదాయపు పన్ను శాఖ అధికారుల ఎదుట విచారణలో పాల్గొన్నారు. సుమారు రెండు గంటల పాటు ఆయన్ను ఐటీ అధికారులు విచారించారు. ఈ మధ్య కాలంలో తన బ్యానర్ నుంచి విడుదలైన సినిమాల నిర్మాణ వ్యయం, ఆదాయం గురించి వారు ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఆయనకు సంబంధించిన వ్యాపారాల అకౌంట్స్ అన్నీ అధికారులు తణిఖీలు చేశారని సమాచారం.
ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన డాక్యుమెంట్లు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను ఐటీ అధికారులకు అందించినట్లు సమాచారం. విచారణ అనంతరం బషీర్‌బాగ్‌లోని ఐటీ కార్యాలయం నుంచి దిల్ రాజు తిరిగి వెళ్లిపోయారు. అయితే, ఆయన్ను మరోసారి విచారిస్తారా..? లేదా..? అనే విషయం గురించి ఎలాంటి సమాచారం లేదు.
Comments
Please login to add a commentAdd a comment