‘మనం ఇష్టపడే వారి కోసం ఎంత మారినా పర్వాలేదనిపిస్తుంది’ అంటున్నారు హీరోయిన్ అనన్యా పాండే. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘లైగర్’ సినిమాతో తెలుగుకి పరిచయమయ్యారీ నార్త్ బ్యూటీ. 2022 ఆగస్టు 25న ఈ చిత్రం విడుదలైంది. ‘లైగర్’ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదామె. అయితే హిందీలో మాత్రం వరుసగా సినిమాలు చేస్తున్నారు.
తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో రిలేషన్‌షిప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘గతంలో నేను రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. ఎదుటి వ్యక్తి కోసం నేనెంతగానో మారాను. చాలా విషయాల్లో రాజీపడ్డాను. రిలేషన్‌షిప్ ప్రారంభమైనప్పుడు ఎదుటి వ్యక్తి మెప్పు పొందడం, వారి దృష్టిని ఆకర్షించడం కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. మనం ఎంత మారినా ఫర్వాలేదనిపిస్తుంది. అయితే మనం మారుతున్నామనే విషయం ఆరంభంలో మనకు అర్థం కాదు. ఇది సహజంగానే ఉన్నట్లు అనిపిస్తుంది. ప్రేమలో ఉన్నప్పుడు లోపాలు తెలియవు. ఏదీ మనకు సమస్యగా అనిపించదు. ఆ బంధం నుంచి మనం బయటకు వచ్చినప్పుడే అన్నీ అర్థం అవుతాయి.
రిలేషన్‌షిప్‌లో నేను నిజాయతీగా ఉంటాను. ఎదుటి వ్యక్తి నుంచీ అంతే నిజాయతీ లభిస్తే బాగుంటుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య నమ్మకం ఉంటేనే ఏ బంధమైనా బలపడుతుంది. నాకు కాబోయే వ్యక్తి సింప్లిసిటీగా, నన్ను అర్థం చేసుకునేవాడై ఉండాలి’’ అని తెలిపారు అనన్యా పాండే. ఇదిలా ఉంటే నటుడు ఆదిత్యరాయ్ కపూర్‌తో అనన్య ప్రేమలో ఉన్నట్లు గతంలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఇటీవల వీరిద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రిలేషన్ షిప్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో వైరల్‌గా మారాయి. కాగా ప్రస్తుతం ‘శంకరా’ అనే సినిమాలో నటి స్తున్నారు అనన్యా పాండే. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment