కోలీవుడ్ సూపర్ హిట్ సినిమా 'బ్లాక్' తెలుగు వర్షన్ ఓటీటీలో విడుదలైంది. ఎలాంటి ప్రకటన లేకుంగానే సడెన్‌గా 'డార్క్' టైటిల్‌తో స్ట్రీమింగ్ అవుతుంది. తమిళ్‌లో భారీ కలెక్షన్లతో దుమ్మురేపిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో విడుదల కావడంతో ఈ వీకెండ్ చూసేయవచ్చని సినీ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రంలో నటుడు జీవా(Jiiva), నటి ప్రియ భవానీశంకర్(Priya Bhavani Shankar) జంటగా నటించారు. ప్రొటాన్షియల్ స్టూడియోస్ పతాకంపై ఎస్‌ఆర్.ప్రభు, ఎస్‌ఆర్.ప్రకాశ్‌బాబు నిర్మించిన ఈ చిత్రానికి జీకే.బాలసుబ్రమణి దర్శకత్వం వహించారు.
సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్‌తో పాటు మంచి థ్రిల్లర్ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కించారు. బ్లాక్ (డార్క్) చిత్రాన్ని రూ. 5 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. అయితే, బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్లకు పైగానే రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. అంతటి భారీ విజయం అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు తెలుగు వర్షన్ 'డార్క్' పేరుతో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతంది. ఈ సినిమా మొత్తం జీవా, ప్రియా భవానీ శంకర్ పాత్రల చుట్టూ ఓ విల్లా నేపథ్యంలోనే సాగడం గమనార్హం. 'కోహెరెన్స్ 'అనే హాలీవుడ్ మూవీ స్ఫూర్తితో దర్శకుడు బాలసుబ్రమణి డార్క్ మూవీని తెరకెక్కించినట్లు నెట్టింట భారీగా ప్రచారం జరిగింది.
కథేంటి?
వసంత్ (జీవా), అరణ్య (ప్రియా భవానీ శంకర్) భార్యభర్తలు. వీకెండ్ సరదాగా గడుపుదామని బీచ్ పక్కన తాము కొన్న కొత్త విల్లాలోకి వెళ్తారు. ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఇంకా పూర్తిగా పనులు జరగకపోవడం వల్ల వీళ్లు తప్పితే మరెవరు అక్కడ ఉండరు. పగలంతా బాగానే ఉంటుంది కానీ ఎప్పుడైతే రాత్రి అవుతుందో విచిత్రమైన సంఘటనలన్నీ జరుగుతుంటాయి. భయపడి పారిపోదామని ఎంత ప్రయత్నించినా.. తిరిగి తిరిగి అక్కడికి వస్తుంటారు. మరోవైపు తమ ఎదురుగా ఉన్న విల్లాలో ఎవరో ఉన్నారని అనిపిస్తుంది. వెళ్లి చూస్తే అచ్చుగుద్దినట్లు తమలాంటి ఇద్దరు వ్యక్తులే కనిపిస్తారు. ఇంతకీ వాళ్లెవరు? ఇలా జరగడానికి కారణమేంటి అనేదే మిగతా స్టోరీ.
Comments
Please login to add a commentAdd a comment