Black Movie
-
ఓటీటీలోకి బిగ్గెస్ట్ హిట్ సినిమా.. 'డార్క్' పేరుతో తెలుగులో స్ట్రీమింగ్
కోలీవుడ్ సూపర్ హిట్ సినిమా 'బ్లాక్' తెలుగు వర్షన్ ఓటీటీలో విడుదలైంది. ఎలాంటి ప్రకటన లేకుంగానే సడెన్‌గా 'డార్క్' టైటిల్‌తో స్ట్రీమింగ్ అవుతుంది. తమిళ్లో భారీ కలెక్షన్లతో దుమ్మురేపిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో విడుదల కావడంతో ఈ వీకెండ్ చూసేయవచ్చని సినీ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రంలో నటుడు జీవా(Jiiva), నటి ప్రియ భవానీశంకర్(Priya Bhavani Shankar) జంటగా నటించారు. ప్రొటాన్షియల్ స్టూడియోస్ పతాకంపై ఎస్ఆర్.ప్రభు, ఎస్ఆర్.ప్రకాశ్‌బాబు నిర్మించిన ఈ చిత్రానికి జీకే.బాలసుబ్రమణి దర్శకత్వం వహించారు.సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్‌తో పాటు మంచి థ్రిల్లర్ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కించారు. బ్లాక్ (డార్క్) చిత్రాన్ని రూ. 5 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. అయితే, బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్లకు పైగానే రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. అంతటి భారీ విజయం అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు తెలుగు వర్షన్ 'డార్క్' పేరుతో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతంది. ఈ సినిమా మొత్తం జీవా, ప్రియా భవానీ శంకర్ పాత్రల చుట్టూ ఓ విల్లా నేపథ్యంలోనే సాగడం గమనార్హం. 'కోహెరెన్స్ 'అనే హాలీవుడ్ మూవీ స్ఫూర్తితో దర్శకుడు బాలసుబ్రమణి డార్క్ మూవీని తెరకెక్కించినట్లు నెట్టింట భారీగా ప్రచారం జరిగింది.కథేంటి?వసంత్ (జీవా), అరణ్య (ప్రియా భవానీ శంకర్) భార్యభర్తలు. వీకెండ్ సరదాగా గడుపుదామని బీచ్ పక్కన తాము కొన్న కొత్త విల్లాలోకి వెళ్తారు. ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఇంకా పూర్తిగా పనులు జరగకపోవడం వల్ల వీళ్లు తప్పితే మరెవరు అక్కడ ఉండరు. పగలంతా బాగానే ఉంటుంది కానీ ఎప్పుడైతే రాత్రి అవుతుందో విచిత్రమైన సంఘటనలన్నీ జరుగుతుంటాయి. భయపడి పారిపోదామని ఎంత ప్రయత్నించినా.. తిరిగి తిరిగి అక్కడికి వస్తుంటారు. మరోవైపు తమ ఎదురుగా ఉన్న విల్లాలో ఎవరో ఉన్నారని అనిపిస్తుంది. వెళ్లి చూస్తే అచ్చుగుద్దినట్లు తమలాంటి ఇద్దరు వ్యక్తులే కనిపిస్తారు. ఇంతకీ వాళ్లెవరు? ఇలా జరగడానికి కారణమేంటి అనేదే మిగతా స్టోరీ. -
'బ్లాక్' సినిమా రివ్యూ (ఓటీటీ)
థియేటర్ అంటే భారీ బడ్జెట్ సినిమాలు.. ఓటీటీ అంటే థ్రిల్లర్ మూవీస్ అనేది ప్రస్తుతం ట్రెండ్. అందుకు తగ్గట్లే డిఫరెంట్ కథలతో తీస్తున్న థ్రిల్లర్స్.. భాషతో సంబంధం లేకుండా ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. అలా కొన్నిరోజుల క్రితం స్ట్రీమింగ్‌లోకి వచ్చిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ 'బ్లాక్'. అమెజాన్ ప్రైమ్‌లో ఉన్న ఈ మూవీ ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: 'పుష్ప 3'.. అసలు ఉన్నట్టా? లేనట్టా?)కథేంటి?వసంత్ (జీవా), అరణ్య (ప్రియా భవానీ శంకర్) భార్యభర్తలు. వీకెండ్ సరదాగా గడుపుదామని బీచ్ పక్కన తాము కొన్న కొత్త విల్లాలోకి వెళ్తారు. ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఇంకా పూర్తిగా పనులు జరగకపోవడం వల్ల వీళ్లు తప్పితే మరెవరు అక్కడ ఉండరు. పగలంతా బాగానే ఉంటుంది కానీ ఎప్పుడైతే రాత్రి అవుతుందో విచిత్రమైన సంఘటనలన్నీ జరుగుతుంటాయి. భయపడి పారిపోదామని ఎంత ప్రయత్నించినా.. తిరిగి తిరిగి అక్కడికి వస్తుంటారు. మరోవైపు తమ ఎదురుగా ఉన్న విల్లాలో ఎవరో ఉన్నారని అనిపిస్తుంది. వెళ్లి చూస్తే అచ్చుగుద్దినట్లు తమలాంటి ఇద్దరు వ్యక్తులే కనిపిస్తారు. ఇంతకీ వాళ్లెవరు? ఇలా జరగడానికి కారణమేంటి అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా ఏదైనా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటే మూవీస్ చూద్దామనుకునే వాళ్లకు 'బ్లాక్' నచ్చేస్తుంది. 1964లో సినిమా ఓపెన్ అవుతుంది. తన ఫ్రెండ్, అతడి ప్రేయసికి మనోహర్ (వివేక్ ప్రసన్న).. బీచ్ దగ్గర్లోని తన విల్లాలో ఉంచి, తర్వాతి రోజు ఉదయం పెళ్లి చేయాలనుకుంటాడు. కానీ అనుకోని కొన్ని సంఘటనల వల్ల వాళ్లిద్దరినీ ఎవరో చంపేస్తారు. కట్ చేస్తే స్టోరీ 60 ఏళ్ల తర్వాత అంటే ప్రస్తుతానికి వస్తుంది.వసంత్, ఆరణ్య.. వాళ్లిద్దరి ప్రవర్తన, మనస్తత్వాలు ఇలా సీన్స్ వెళ్తుంటాయి. కాకపోతే ఇవి రొటీన్‌గా ఉంటాయి. ఎప్పుడైతే వీళ్లిద్దరూ విల్లాలోకి అడుగుపెడతారో విచిత్రమైన సంఘటనలన్నీ జరుగుతుంటాయి. తమలాంటి ఇద్దరు వ్యకులు వీళ్లకు కనిపించడంతో సస్పెన్స్ క్రియేట్ అవుతుంది. అలా హారర్, సూపర్ నేచురల్ ఎలిమెంట్ ఏదో ఉందనే ఉత్కంఠ కలుగుతుంది. చీకటి ప్రదేశం కారణంగా ప్రతిసారీ తాము వివిధ కాలాల్లోకి (టైమ్ లైన్) ముందుకు వెనక్కి వెళుతున్నామని వసంత్ తెలుసుకోవడం, చీకటి ప్రదేశం కారణంగానే వసంత్-ఆర్యం ఒకరికొకరు దూరమవడం.. చివరకు ఎలా కలుసుకున్నారనేది సినిమా.(ఇదీ చదవండి: కవలలకి జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్)సినిమా చూస్తున్నంతసేపు థ్రిల్లింగ్‌గా ఉంటుంది. కాకపోతే అలా జరగడానికి వెనకున్న కారణాన్ని బయటపెట్టే సీన్ మాత్రం పేలవంగా ఉంటుంది. ఏదో ఫిజిక్స్ క్లాస్ చెబుతున్నట్లు వేగంగా చూపించేశారు. దీంతో సగటు ప్రేక్షకుడికి సరిగా అర్థం కాదు. క్లైమాక్స్ కూడా ఏదో హడావుడిగా ముగించేసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమా రెండు గంటల్లోపే ఉండటం ప్లస్ పాయింట్.ఎవరెలా చేశారు?సినిమాలో జీవా, ప్రియా భవానీ శంకర్ పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. వీళ్లిద్దరూ ఆయా పాత్రల్లో ఆకట్టుకున్నారు. వాస్తవానికి, ఊహలకు మధ్య నలిగిపోయే వ్యక్తిగా జీవా వేరియషన్స్ చూపించాడు. వివేక్ ప్రసన్నతో పాటు మిగిలిన వాళ్లది అతిథి పాత్రలే. టెక్నికల్ విషయాలకొస్తే డైరెక్టర్ కేజీ సుబ్రమణి తీసుకున్న కాన్సెప్ట్ బాగుంది. కాకపోతే స్క్రిప్ట్‌లో లాజిక్స్ సరిగా ఎష్టాబ్లిష్ చేసుంటే బాగుండేది అనిపించింది. శామ్ సీఎస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు చాలా పెద్ద ప్లస్. కొన్ని సీన్లను బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా ఎలివేట్ చేసింది. మిగిలిన డిపార్ట్మెంట్స్ తమ వంతు న్యాయం చేశారు. ఓవరాల్‌గా చూసుకుంటే ఓటీటీలో థ్రిల్లర్ మూవీ ఏదైనా చూద్దామనుకుంటే 'బ్లాక్' ట్రై చేయొచ్చు. ప్రస్తుతానికి తమిళ ఆడియో మాత్రమే అందుబాటులో ఉంది. సబ్ టైటిల్స్ ఉన్నాయి.-చందు డొంకాన(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' హౌస్‌లో ఉండలేనంటూ కన్నీళ్లతో బయటకొచ్చిన శోభా శెట్టి) -
జాతీయ అవార్డులు అందుకున్న మూవీ.. 19 ఏళ్లకు ఓటీటీలో..
దర్శకదిగ్గజం సంజయ్‌లీలా భన్సాలీ తీసే సినిమాలకు ప్రత్యేక అభిమానులు ఉంటారు. ఆయన సినిమాలు ఎంత రిచ్‌గా ఉంటాయో అంతే ఎమోషనల్‌గా కూడా ఉంటాయి. తను తీసే ఒక్కో సినిమా ఒక్కో కళాఖండంలా ఉంటుంది. అలా ఆయన 19 ఏళ్ల క్రితం తెరకెక్కించిన ఓ మాస్టర్ పీస్ 'బ్లాక్'. టైటిల్ చూడగానే ఓ విషయం అర్థమైపోతుంది. హీరోహీరోయిన్లలో ఒకరికి అంధత్వం ఉందని తెలిసిపోతోంది. అవును, ఇందులో హీరోయిన్గా నటించిన రాణీ ముఖర్జీకి కనబడదు, వినబడదు. అంధురాలు, అల్జీమర్ టీచర్ మధ్య లవ్.. ఆమెకు టీచర్ అమితాబ్ బచ్చన్‌తో అనుబంధం ఏర్పడుతుంది. కానీ అతడికి క్రమంగా అల్జీమర్స్(మతిమరుపు) వచ్చి ఆమెను మర్చిపోతాడు. ఆ ఇద్దరి మధ్య నడిచే డ్రామానే బ్లాక్. 2005లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్టయింది. ఎంతోమంది మనసులను మెలిపెడుతూ కంటతడి పెట్టించేలా చేసింది. అంతేకాదు, మూడు జాతీయ అవార్డులను ఎగరేసుకుపోయింది. ఇన్నాళ్లకు ఓటీటీలో అయితే ఇప్పటివరకు ఈ సినిమా ఏ ఓటీటీలోనూ అందుబాటులో లేదు. తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. నేటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం చేస్తున్నట్లు వెల్లడించింది. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ మూవీ ఓటీటీలోకి వస్తే బాగుండని ఎన్నిసార్లు అనుకున్నామో, ఫైనల్‌గా మా కల నెరవేరింది అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) చదవండి: పేరెంట్స్‌తో వెళ్లా.. నడిరోడ్డుపై అసభ్యంగా తాకుతూ, గిల్లుతూ...: హీరోయిన్ -
ఒక్కోసారి లైఫ్ మనకు కావాల్సింది ఇవ్వదు: ఆది
Aadi Saikumar Black Movie Trailer Released: ఆది సాయికుమార్ తాజాగా నటించిన చిత్రం బ్లాక్. జి.బి. కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందనుంది. ఈ సినిమాను మే 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం (మే 21) 'బ్లాక్' ట్రైలర్‌ను విడుదల చేశారు. 'ఒక్కోసారి లైఫ్ మనకు కావాల్సింది ఇవ్వదు. మనకు నచ్చినట్లు వెళ్లనివ్వదు. దానికి నచ్చిందే ఇస్తుంది. నచ్చినట్టే తీసుకెళ్తుంది. కానీ, దానికి ఒక కారణం ఉంది.' అంటూ ఆది చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ట్రైలర్లో మిగతా డైలాగ్‌లు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇందులో ఆది పోలీస్‌గా అలరించనున్నాడు. బిగ్‌బాస్ రెండో సీజన్ టైటిల్ విన్నర్ కౌశల్ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. బ్లాక్ మూవీ ఒక రాబరీ, ఒక దొంగతనం చుట్టూ తిరిగే కథాంశంగా ఉంది. 'విభిన్నమైన కథ, కథానాలతో రూపొందుతున్న చిత్రమిది. ఆది నటన ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్.' అని చిత్రబృందం తెలిపింది. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ మూవీలో దర్శనబానిక్, ఆమని, పృథ్వీరాజ్, సత్యం రాజేష్, తాగుబోతు రమేష్ తదితరులు నటించారు. చదవండి: మా లగేజ్ ఎక్కడ ?.. ఎయిర్‌పోర్టులో హీరోయిన్‌కు చేదు అనుభవం