దర్శకదిగ్గజం సంజయ్‌లీలా భన్సాలీ తీసే సినిమాలకు ప్రత్యేక అభిమానులు ఉంటారు. ఆయన సినిమాలు ఎంత రిచ్‌గా ఉంటాయో అంతే ఎమోషనల్‌గా కూడా ఉంటాయి. తను తీసే ఒక్కో సినిమా ఒక్కో కళాఖండంలా ఉంటుంది. అలా ఆయన 19 ఏళ్ల క్రితం తెరకెక్కించిన ఓ మాస్టర్ పీస్ 'బ్లాక్'. టైటిల్ చూడగానే ఓ విషయం అర్థమైపోతుంది. హీరోహీరోయిన్లలో ఒకరికి అంధత్వం ఉందని తెలిసిపోతోంది. అవును, ఇందులో హీరోయిన్‌గా నటించిన రాణీ ముఖర్జీకి కనబడదు, వినబడదు.
అంధురాలు, అల్జీమర్ టీచర్ మధ్య లవ్..
ఆమెకు టీచర్ అమితాబ్ బచ్చన్‌తో అనుబంధం ఏర్పడుతుంది. కానీ అతడికి క్రమంగా అల్జీమర్స్(మతిమరుపు) వచ్చి ఆమెను మర్చిపోతాడు. ఆ ఇద్దరి మధ్య నడిచే డ్రామానే బ్లాక్. 2005లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్టయింది. ఎంతోమంది మనసులను మెలిపెడుతూ కంటతడి పెట్టించేలా చేసింది. అంతేకాదు, మూడు జాతీయ అవార్డులను ఎగరేసుకుపోయింది.
ఇన్నాళ్లకు ఓటీటీలో
అయితే ఇప్పటివరకు ఈ సినిమా ఏ ఓటీటీలోనూ అందుబాటులో లేదు. తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. నేటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం చేస్తున్నట్లు వెల్లడించింది. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ మూవీ ఓటీటీలోకి వస్తే బాగుండని ఎన్నిసార్లు అనుకున్నామో, ఫైనల్‌గా మా కల నెరవేరింది అని కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: పేరెంట్స్‌తో వెళ్లా.. నడిరోడ్డుపై అసభ్యంగా తాకుతూ, గిల్లుతూ...: హీరోయిన్
Comments
Please login to add a commentAdd a comment