కోట్లిచ్చినా నా నిర్ణయం మారదు! | Vidya Balan says 'no' to item songs | Sakshi
Sakshi News home page

కోట్లిచ్చినా నా నిర్ణయం మారదు!

Published Mon, Jun 16 2014 12:26 AM | Last Updated on Sat, Sep 2 2017 8:51 AM

కోట్లిచ్చినా నా నిర్ణయం మారదు!

కోట్లిచ్చినా నా నిర్ణయం మారదు!

విద్యాబాలన్ ఇటీవల ఓ నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక పాటల్లో నటించకూడదని చాలా బలంగా ఫిక్స్ అయ్యారు. రెండేళ్ల క్రితం ‘ఫెరారీ కీ సవారీ’ చిత్రంలో ఆమె ఓ ప్రత్యేక పాటకు కాలు కదిపారు. దాంతో పలువురు దర్శక, నిర్మాతలు ఆమెను ఐటమ్ సాంగ్స్ చేయమని అడుగుతున్నారట. కానీ, విద్యాకి అది ఇష్టం లేదు. ‘‘ఇప్పుడే కాదు.. భవిష్యత్తులో కూడా నేను ప్రత్యేక పాటలు చేయను. ఎందుకంటే, వాటి ద్వారా నాకు ప్రత్యేకంగా ఆనందమేం లభించడంలేదు. ఇక, అలాంటప్పుడు ఎందుకు? అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా’’ అని చెప్పారు. అగ్రతారలు ఐటమ్ సాంగ్స్ చేస్తే పారితోషికం భారీ ఎత్తున ఉంటుంది. అందులోనూ విద్యాబాలన్ వంటి తారలకైతే కోట్లివ్వడానికి కూడా నిర్మాతలు వెనకాడరు. కానీ, విద్యా మనసు ఆ కోట్లకు కరగడంలేదట. విద్యా ఒక్కసారి నిర్ణయించుకుంటే.. ఆ నిర్ణయాన్ని ఎవరూ మార్చలేరు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement