లిప్ లాక్ ఆ హీరోయిన్ నేర్పిందన్న హీరో | Pratik Gandhi Opens Up About His First Onscreen Kiss Scene With Vidya Balan, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

తొలి లిప్‌లాక్‌.ఆ హీరోయిన్‌ నేర్పిందన్న హీరో

Published Sun, Feb 2 2025 10:44 AM | Last Updated on Sun, Feb 2 2025 10:55 AM

Pratik Gandhi Opens Up About His First Onscreen Kiss With Vidya Balan

ఒకప్పుడు అత్యంత అరుదుగా మాత్రమే కనిపించే పెదాలతో పెదాలను కలిపే లిప్‌లాక్‌ సన్నివేశాలు ఇప్పుడు బాలీవుడ్‌ సినిమాల్లో సర్వసాధారణంగా మారిపోయాయి. వయసులకు అతీతంగా నటీనటులు ముద్దాడేసుకుంటున్నారు. బాలీవుడ్‌ చిత్రాల్లో నటనకు సై అనడం అంటే లిప్‌లాక్‌కు కూడా సై అన్నట్టే అన్నంతగా పరిస్థితి మారిపోయింది. ఈ నేపధ్యంలో ఓ కిస్సింగ్‌ సీన్‌లో నటించలేక తాను ఇబ్బంది పడ్డానని హీరో ప్రతీక్‌ గాంధీ(Pratik Gandhi ) చెప్పడం విశేషం.

బాలీవుడ్‌ రొమాంటిక్‌ కామెడీ సినిమా దో ఔర్‌ దో ప్యార్‌లో  ప్రతీక్‌ గాంధీ బాలీవుడ్‌ స్టార్‌ యాక్ట్రెస్‌ విద్యాబాలన్‌(Vidya Balan) తో కలిసి లిప్‌లాక్‌ సన్నివేశం ఉంది.  ప్రతీక్‌ గాంధీ కన్నా నటనతో పాటు వయసులోనూ పెద్దదైన విద్యాబాలన్‌... లిప్‌లాక్స్‌లోనూ సీనియరే.  ఇప్పటికే చాలా సినిమాల్లో తెరపై సహనటులకు ముద్దులు గుప్పించి పండించిన విషయం తెలిసిందే.

స్కామ్‌ 1992: ది హర్షద్‌ మెహతా స్టోరీలో తన అద్భుతమైన నటనకు పేరుగాంచిన ప్రతీక్‌ గాంధీ ఇటీవల లెహ్రెన్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. సినిమాలోని తన లిప్‌లాక్‌ సన్నివేశం గురించి ఓపెనయ్యాడు.  విద్య తన మొట్టమొదటి ఆన్‌–స్క్రీన్‌ ముద్దును తెరపై పండించేందుకు ఎలా కారణమైందో అతను వెల్లడించాడు.  

శక్తివంతమైన నటనతో పాప్యులారిటీ  సంపాదించుకున్న ప్రతీక్‌ తాను ఇంతకు ముందు ఎప్పుడూ ముద్దు సన్నివేశంలో నటించలేదని అందువల్లే తొలిముద్దు సమయంలో ఇబ్బంది పడ్డానని అంగీకరించాడు, తనకు ఎంతో అసౌకర్యాన్ని కలిగించిన ఆ పరిస్థితిని సులభంగా విశ్వాసంతో హ్యాండిల్‌ చేసేందుకు విద్యాబాలన్‌ తనకి బాగా హెల్ప్‌ చేసిందని చెప్పాడు.

‘వృత్తిరీత్యా నటుడిగా ఉన్నప్పటికీ, ఆన్‌ స్క్రీన్‌ సాన్నిహిత్యం గురించి తనకు వ్యక్తిగతంగా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు ఒక విషయం చూపించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కేవలం కళ్లతో కూడా చూపించవచ్చు’’ అంటూ స్పష్టం చేశాడు. ఏదేమైనా ఈ సీన్‌ చాలా బాగా వచ్చిందని అన్నాడు.

 అయితే ఈ సినిమాలోని ఆ సన్నివేశం ఏమి కోరుకుంటున్నదో  ఆమె (విద్య)కు తెలుసు. అలాగే దానిని ఎలా కోరుకుంటున్నదో కూడా ఆమెకు స్పష్టత ఉంది అందుకే ఆమె చేసిన విధానం అంత ఖచ్చితంగా ఉంది.  సీనియర్‌ నటిగా దానిని పండించగలిగారు అంటూ చెప్పారు ప్రతీక్, ‘ఆ సన్నివేశం చిత్రీకరించే సమయంలో ఆమె చాలా ఉల్లాసంగా ఉంది; అది నా పరిస్థితిని పూర్తిగా తేలికగా మార్చేసింది హమ్నే హస్టే–హస్టే వో సీన్‌ కర్‌ దియా (మేం నవ్వుతూనే ఆ సీన్‌ చేసాము)‘ అంటూ చెప్పాడు. ఆమె సపోర్టివ్‌ నేచర్‌ను ప్రతీక్‌ ఎంతగానో కొనియాడాడు, ఆమెను వండర్‌ ఫుల్‌ కో స్టార్‌ అని పేర్కొన్నాడు.

లిప్‌లాక్స్‌తో పాటు ఆసక్తికరమైన కథాంశం ఉన్నప్పటికీ, దో ఔర్‌ దో ప్యార్‌ బాక్సాఫీస్‌ వద్ద ప్రభావం చూపలేకపోయింది ప్రేక్షకులను ఆకర్షించడంలో విఫలమైంది   అయినప్పటికీ, విద్య  ప్రతీక్‌ ఇద్దరూ తమ నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. చాలా మంది వారి ఆన్‌–స్క్రీన్‌ కెమిస్ట్రీని వారి పాత్రలకు వారు ప్రాణం పోసిన తీరును ప్రశంసించారు. దో ఔర్‌ దో ప్యార్‌  ఫెయిల్యూర్‌ అయినా,  విద్యాబాలన్‌ భూల్‌ భులయ్యా 3తో తిరిగి పుంజుకుంది, ఇది భారీ విజయాన్ని సాధించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement