
ఐటమ్‌సాంగ్స్ బాటలో..
సినిమా ఎవరిని ఎటు పయనింపజేస్తుందో ఎవరికి తెలియదు. ఎవరైనా దాని దారిలో పోవలసిందే. నటి క్యాథిరిన్ ట్రెసా పోకడ అలానే ఉంది. మెడ్రాస్ చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైన ఈ బ్యూటీకి ఇక్కడ కొన్ని అవకాశాలు వచ్చినా, ఆ తరువాత సన్నగిల్లాయి. నిజానికి మెడ్రాస్ చిత్రంలో మప్సల్స్ ఏరియా యువతిగా ఆ పాత్రలో క్యాథరిన్‌ట్రెసా బాగానే ఇమిడింది. ఆ తరువాతనే అమ్మడిని కనిదన్ లాంటి చిత్రాల్లో గ్లామరస్‌కు మారిపోయింది. కోలీవుడ్‌లో అవకాశాలు ఎండమావులుగా కనిపించడంతో ఈ బ్యూటీ టాలీవుడ్‌పై దృష్టిసారించింది.
అక్కడ అవకాశాలు ఆశాజనకంగా ఉన్నా, అన్నీ సెకండ్ హీరోయిన్ పాత్రలు, గ్లామర్ పాత్రలే తలుపుతడుతున్నాయి. ఇటీవల నటించిన తెలుగు చిత్రం ‘గౌతమ్‌నందా’లో క్యాథరిన్‌ట్రెసాను కేవలం గ్లామర్ కోసమే వాడుకున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. కాగా తాజాగా రానాకు జంటగా నటించిన నాన్ ఆణైయిట్టాల్( తెలుగులో నేనేరాజు నేనేమంత్రి) చిత్రంలోనూ అందాలారబోతలో ఇరగదీసిందంటున్నారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది.
అయితే దీనిపై క్యాథరిన్ ట్రెసా చాలా ఆశలు పెట్టుకుందట. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ తనను గ్లామర్ పాత్రలకే వాడుకుంటున్నారనే చింత ఏమాత్రం లేదట. దీంతో ఐటమ్ సాంగ్స్ క్యాథరిన్ ట్రెసా తలుపు తడుతున్నాయట. కథానాయకి అవకాశాలు ముఖం చాటేస్తే తన అందాలను నమ్ముకుని ఐటమ్ సాంగ్స్ బాట పట్టాలనే ఆలోచన క్యాథరిన్‌కు లేకపోలేదట. ప్రస్తుతం హీరోయిన్ల ఐటమ్ సాంగ్స్‌కు చాలా గిరాకీ ఉందన్న విషయాన్ని గ్రహించిన ఈ జాణ అలాంటి లెగ్ షేక్ పాటలకు గేట్లు తెరుస్తున్నట్లు భావించాల్సి వస్తోందంటున్నాయి సినీ వర్గాలు.