ఎక్కువిస్తే ఆడేస్తా! | tamanna ready for item songs | Sakshi
Sakshi News home page

ఎక్కువిస్తే ఆడేస్తా!

Oct 15 2016 2:05 AM | Updated on Aug 28 2018 4:32 PM

ఎక్కువిస్తే ఆడేస్తా! - Sakshi

ఎక్కువిస్తే ఆడేస్తా!

ఎక్కువ డబ్బు ఇస్తే ఆడడానికి నేనెప్పుడూ రెడీ అంటున్నారు మిల్కీబ్యూటీ తమన్నా. ఈ అమ్మడి మంచి నటే కాదు మంచి డ్యాన్సర్ కూడా

ఎక్కువ డబ్బు ఇస్తే ఆడడానికి నేనెప్పుడూ రెడీ అంటున్నారు మిల్కీబ్యూటీ తమన్నా. ఈ అమ్మడి మంచి నటే కాదు మంచి డ్యాన్సర్ కూడా. ఇటీవలే డాన్సింగ్ కింగ్ ప్రభుదేవాతో నటించి ఆయన నుంచి మంచి డాన్సర్ అనే కితాబును కూడా అందుకున్నారు.అందాలారబోత విషయంలో హద్దులు చెరిపేయడానికి ఎప్పుడూ సిద్ధమే అనే ఈమె ఇటీవల ఐటమ్ సాంగ్స్‌కూ సై అనడం చూస్తున్నాం. ఇంతకు ముందు టాలీవుడ్‌లో దుమ్మురేపిన తమన్నా ఇప్పుడు కోలీవుడ్‌లో సత్తాచాటుతున్నారు. దేవి చిత్రంతో మరోసారి బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వెళ్లిన ఈ జాణ అక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని కాస్త సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కారు.

నటులతో సమానంగా పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ నటీమణుల కోరికను తాను స్వాగతిస్తున్నానని పేర్కొని పెద్ద చర్చకే తెరలేపారు. కథానాయకుల పారితోషికాలు కథానాయికల కంటే పలు రెట్లు అధికంగా ఉన్నాయని కూడా పేర్కొన్నారు. ఇకపోతే తాను కొత్త నటులతో సింగిల్ సాంగ్‌లో నటించి అధిక పారితోషికం పుచ్చుకుంటున్నాననే ప్రచారం జోరుగా సాగుతోందని, అందులో తప్పేముంది ఎవరైనా డబ్బు కోసమే పని చేస్తారని అన్నారు.

 అయినా ప్రత్యేక గీతంలో నటించడం సాధారణ విషయం కాదన్నారు. తానే కాదు కాజల్‌అగర్వాల్, శ్రుతిహసన్ లాంటి వాళ్లూ ఐటమ్ సాంగ్స్‌లో నటిస్తున్నారని తమన్నా తనను సమర్థించుకునేలా మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement