ఐటమ్ గర్ల్ గా రాయ్ లక్ష్మి | rai lakshmi next item song with raghava lawrence | Sakshi
Sakshi News home page

ఐటమ్ గర్ల్ గా రాయ్ లక్ష్మి

Published Thu, May 5 2016 6:03 AM | Last Updated on Sun, Sep 3 2017 11:28 PM

ఐటమ్ గర్ల్ గా రాయ్ లక్ష్మి

ఐటమ్ గర్ల్ గా రాయ్ లక్ష్మి

రాను రానంటూనే చిన్నదో అన్న పాట చందాన  చేయను చేయను అంటూ మడి కట్టుకు కూర్చున్న నటి రాయ్‌లక్ష్మి ఇప్పుడు ఐటమ్ సాంగ్స్‌కు లెగ్ షేక్ చేయడానికి సిద్ధం అయిపోయారు. అదేమిటీ ఈ భామ ఇప్పటి వరకూ ఐటమ్ సాంగ్‌లో నటించలేదా? అని మీరడగొచ్చు. ఎందుకంటే ఇటీవల విడుదలైన తెలుగు చిత్రం సర్దార్ గబ్బర్‌సింగ్‌లో పవన్‌కల్యాణ్‌తో ఐటమ్ సాంగ్‌లో ఆడి పాడి దుమ్మురేపారు. కాగా ఈ అమ్మడు తమిళంలో సోలో హీరోయిన్ నుంచి, డబుల్ హీరోయిన్, తళుక్కున మెరిసే ప్రాధాన్యత లేని పాత్రల్లో కూడా నటించారు.

అయితే ఐటమ్ సాంగ్‌లో నటించమని చాలా అవకాశాలు వచ్చినా ససేమిరా అన్నారు. అలాంటిది తాజాగా రాఘవ లారెన్స్‌తో సింగిల్ సాంగ్‌లో ఇరగదీశారు. ఇంతకు ముందు కాంచన చిత్రంలో ఆయనకు జంటగా నటించి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న రాయ్‌లక్ష్మి కాంచన-2లో కూడా తనకే హీరోయిన్ అవకాశం వస్తుందని ఆశించారు. అయితే అలా జరగలేదు. అలాగే ఆ తరువాత ఆమెకు సరైన హిట్ కూడా రాలేదు. అవకాశాలు కూడా అంతగా లేక పోవడంతో తెలుగులో పవన్‌కల్యాణ్‌తో ఐటమ్ సాంగ్‌కు రెడీ అన్నారు. ఇక తమిళంలో రాఘవ లారెన్స్ అడగడంతో నో అని చెప్పలేకపోయారట.

వీరిద్దరి ఐటమ్ సాంగ్ త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్న మొట్టశివ కెట్టశివ చిత్రంలో చూడబోతున్నామన్న మాట. తెలుగు చిత్రం పటాస్‌కు రీమేక్‌గా తమిళంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సూపర్‌గుడ్ ఫిలింస్ పతాకంపై ఆర్‌బీ చౌదరి నిర్మిస్తున్నారు. సాయిరమణి దర్వకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో లారెన్స్‌కు జంటగా నిక్కీగల్రాణి నటిస్తున్నారు. ఇకపై రాయ్‌లక్ష్మిని మరిన్ని చిత్రాలలో ఐటమ్‌గర్ల్‌గా చూసే అవకాశం ఉంటుందని భావించవచ్చంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement