Rai Lakshmi
-
ఐపీఎస్ ఝాన్సీ
లక్ష్మీ రాయ్ లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘ఝాన్సీ ఐపీఎస్’. గురుప్రసాద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఆర్కే ఫిలిమ్స్ పతాకంపై డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ తెలుగులో ఈ నెల 22న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ– ‘‘తమిళ్లో సూపర్ హిట్ అయిన ‘ఝాన్సీ ఐపీఎస్’ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది.లక్మీ రాయ్ త్రిపాత్రాభినయం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఆమె చేసిన మూడు క్యారెక్టర్స్ డిఫరెంట్ షేడ్స్‌లో ఉంటాయి. థ్రిల్లర్ మంజు కంపోజ్ చేసిన ఎనిమిది ఫైట్స్ ఆమె కెరీర్లో మైలురాయిగా నిలుస్తాయి. ‘కర్తవ్యం’ చిత్రంతో విజయశాంతిగారు లేడీ సూపర్ స్టార్‌గా ఎదిగారు. ఆ సినిమాలా మా ‘ఝాన్సీ ఐపీఎస్’ కూడా విజయం సాధిస్తుంది’’ అన్నారు. డాన్సర్, నటి ఆక్సాఖాన్, నటుడు జేవీఆర్ మాట్లాడారు. -
సరికొత్త వూల్ఫ్
ప్రభుదేవా, రాయ్ లక్ష్మీ, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రల్లో వినూ వెంకటేష్ దర్శకత్వంలో సందేశ్ నాగరాజు, ఎన్. సందేశ్ నిర్మిస్తున్న చిత్రం ‘వూల్ఫ్’. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘ఈ సినిమా ప్రేక్షకు లను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ప్రభుదేవా యాక్షన్ సీక్వెన్స్‌లు, అనసూయ గెటప్ కొత్తగా ఉంటాయి’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
హా అంటారా... హడలిపోతారా!
అందాల తారలు భయపెట్టడానికి రెడీ అవుతున్నారు. ఆ అందం వెనక ఎంత ట్రాజెడీ ఉండి ఉంటే.. భయపెట్టాలనుకుని ఉంటారో ఊహించవచ్చు. అలా భయపెట్టే కథలతో కొందరు కథానాయికలు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. మరి ప్రేక్షకులు ‘హా’ అంటూ హడలిపోతారా చూడాలి. ఇక ఈ హారర్ స్టోరీలపై ఓ లుక్ వేయండి. ‘మాయ’, ‘ఐరా’, ‘డోరా’... ఇలా వీలై నప్పుడల్లా వెండితెరపై ఆడియన్స్‌ని భయ పెట్టారు హీరోయిన్ నయనతార. తాజాగా నయనతార గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన మరో హారర్ మూవీ ‘కనెక్ట్’. నయనతారతో 2015లో ‘మాయ’ సినిమా తీసిన అశ్విన్ శరవణన్యే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అనుపమ్ ఖేర్, సత్యరాజ్ కీ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమాను త్వరలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మరోవైపు హారర్ జానర్‌పై హీరోయిన్ కాజల్ అగర్వాల్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లున్నారు. ఎందుకంటే ప్రస్తుతం కాజల్ డైరీలో మూడు హారర్ సినిమాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. కాజల్ ప్రధాన పాత్రధారిగా యోగిబాబు, దర్శక–నటుడు కేఎస్ రవి కుమార్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఘోస్టీ’. హారర్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ పోలీసాఫీసర్ పాత్రలో నటించగా, కల్యాణ్ దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదలైంది. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయాలను కుంటున్నారు. అలాగే తమిళ దర్శకుడు డీకే దర్శకత్వంలో ‘కరుంగాప్పియమ్’ అనే హారర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన సినిమాలో ఓ లీడ్ రోల్ చేశారు కాజల్ అగర్వాల్. కాజల్‌తో పాటు ఈ సినిమాలో రెజీనా, జనని, నోయిరికా, రజియా విల్సన్ నటించారు. ఈ చిత్రంలో కొన్ని అతీంద్రియ శక్తులు ఉన్న యువతి పాత్రలో కాజల్ కనిపిస్తారు. ఇక హారర్ జానర్లో వచ్చిన చిత్రాల్లో ‘చంద్రముఖి’ సినిమాను ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘చంద్రముఖి 2’ రెడీ అవుతోంది. తొలి భాగానికి దర్శకత్వం వహించిన పి. వాసుయే మలి భాగానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఫస్ట్ పార్ట్‌లో రజనీకాంత్ నటించగా, ‘చంద్రముఖి 2’లో రాఘవా లారెన్స్ మెయిన్ లీడ్ చేస్తున్నారు. ఈ సినిమాలోని ఓ హీరోయిన్ పాత్రకు కాజల్ అగర్వాల్‌ను సంప్రదించిందట చిత్ర యూనిట్. మరోవైపు వెండి తెరపై ఇప్పటివరకు గ్లామరస్‌గా కనిపించిన హన్సిక కూడా హారర్ వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ మధ్య ‘గార్డియన్’ అనే హారర్ ఫిల్మ్‌కు హన్సిక సైన్ చేశారు. ఆల్రెడీ ఫస్ట్ లుక్ కూడా రిలీజైంది. శబరి–గురుశరవణన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అలాగే ఆర్. కన్నన్ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్న హారర్ సినిమాలో కూడా హన్సిక నటిస్తున్నారు. మరో హీరోయిన్ రాయ్‌లక్ష్మీ ‘సిండ్రెల్లా’గా ప్రేక్షకులను భయపెట్టేందుకు రెడీ అయ్యారు. వినో వెంకటేశ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో సాక్షీ అగర్వాల్ ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో రాయ్‌లక్ష్మీ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కాగా.. ‘రాజుగారి గది 2’ తర్వాత సమంత మరోసారి ప్రేతాత్మగా కనిపించనున్నారని, ఈ సినిమాకు ‘స్త్రీ’ ఫేమ్ అమర్ కౌశిక్ దర్శకత్వం వహించనున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా హారర్ బ్యాక్‌డ్రాప్‌లోనే మరికొందరు కథానాయికలు సినిమాలు చేస్తున్నారు. -
సోషల్ హల్చల్: ముద్దొస్తున్న బేబమ్మ..సెగలు రేపుతున్న రాయ్ లక్ష్మీ
►ఓర చూపులతో చెమటలు పట్టిస్తున్న నిఖితా శర్మ ►చీర కట్టులో రోజా పూలు పట్టుకొని కంటి చూపుతో కుర్రకారును చంపేస్తున్న ‘మాస్టర్’ బ్యూటీ మాళవికా మోహన్ ►తన అందాలను జోడించి చిట్టి’ పాటను మరింత రక్తి కట్టించిన దీప్తి సునైనా ►హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ సెగలు రేపుతున్న రాయ్ లక్ష్మీ ►లంగా ఓణిలో కనిపించి నెటిజన్లను ఆకట్టుకున్న ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి ►మహేశ్ బాబు, తమన్నాల షూటింగ్ వీడియోని షేర్ చేసిన నమ్రత View this post on Instagram A post shared by Nikita Sharma (@nikitasharma_official) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Aditi B (@aditi_budhathoki) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) -
ఇంకెంత కాలం?
‘‘పక్కింటి అమ్మాయి, కాలేజీ స్టూడెంట్, మరదలు పిల్ల.. ఇలాంటి పాత్రలు ఇంకెంత కాలం చేస్తాను? ప్రయోగాత్మకమైన పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కథానాయిక పాత్రలే కాదు.. ప్రతినాయిక ఛాయలు ఉన్న పాత్రలతో కూడా ప్రేక్షకులకు దగ్గర కావొచ్చు’’ అని అంటున్నారు రాయ్‌లక్ష్మీ. చెప్పినట్లుగానే ఓ నెగటివ్ క్యారెక్టర్ చేయడానికి సిద్ధమవుతున్నారు. 2015లో ముంబైలో వెలుగులోకి వచ్చిన షీనా బోరా హత్య కేసు దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. కూతురు షీనా బోరాను ఆమె తల్లి ఇంద్రాణీ ముఖర్జియా 2012లో హత్య చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సంచలన సంఘటన ఆధారంగా దర్శకుడు స్వరాజ్ ఓ సినిమా చేయాలని కథ రెడీ చేస్తున్నారు. ఇందులో ఇంద్రాణీ పాత్ర చేయమని రాయ్‌లక్ష్మీని అడిగితే ఓకే అన్నారట. -
బేడీలు వేస్తాం!
పువ్వులు పట్టుకున్న ముద్దుగుమ్మల చేతులు లాఠీలు పట్టుకున్నాయి. తమ పెర్ఫార్మెన్స్తో థియేటర్స్‌లో ప్రేక్షకుల మనసులను లాక్ చేయాలని ఈ ముద్దుగుమ్మలు తమలోని అదర్ సైడ్‌ని చూపించడానికి రెడీ అయిపోయారు. సీరియస్ అండ్ సిన్సియర్ పోలీసాఫీసర్లుగా కనిపించి, విలన్లను రప్ఫాడించడానికి సిద్ధమైన ఆ హీరోయిన్ల గురించి తెలుసుకుందాం. ‘నిశ్శబ్దం’ చిత్రం కోసం ఆమెరికా పోలీసాఫీసర్ అవతారం ఎత్తారు అంజలి. ఈ గెటప్‌లో సెట్ కావాలని దాదాపు ఎనిమిది కిలోల బరువు కూడా తగ్గారామె. ఇటీవల ఈ సినిమాలో అంజలి పాత్ర చిత్రీకరణ మొదలైంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో నాలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుష్క, మాధవన్, షాలినీ పాండే, మైఖేల్ మ్యాడ్సన్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఇక ‘ఆర్ఎక్స్ 100’ సినిమాలో గ్లామరస్‌గా రెచ్చిపోయిన పాయల్ రాజ్‌పుత్ ఇటీవల పోలీసాఫీసర్‌గా చార్జ్ తీసుకున్నారు. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పాయల్ రాజ్‌పుత్, రాయ్ లక్ష్మి, రేవతి, జ్యోతిక అటు చెన్నైకి వెళితే హీరోయిన్లు జ్యోతిక అండ్ రేవతి ఇద్దరూ కలిసి ఒకే పోలీస్‌స్టేషన్‌లో డ్యూటీ చేస్తున్నారు. వీరిద్దరి డ్యూటీ ‘జాక్‌పాట్’ అనే తమిళం సినిమా కోసం. ఈ సినిమాకు కల్యాణ్ దర్శకత్వం వహించారు. తమిళంలో మరో భామ పోలీస్‌గా కనిపించబోతున్నారు. ఆమె ఎవరో కాదు.. నటి, డాటరాఫ్ శరత్‌కుమార్. ఓ డాగ్‌ని వెంటపెట్టుకుని పోలీసాఫీర్‌గా ఓ కేసును దర్యాప్తు చేస్తున్నారు వరలక్ష్మీ శరత్‌కుమార్. ఆమె ఇన్విస్టిగేషన్ రిపోర్ట్‌ను ‘డానీ’ సినిమాలో చూడాలి. ఈ కేసును సంతానమూర్తి డైరెక్ట్ చేస్తున్నారు. తెలుగులో పలు చిత్రాల్లో గ్లామరస్ హీరోయిన్గా కనిపించిన రాయ్ లక్ష్మి ఇప్పుడు కన్నడంలో ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా ఓ సీక్రెట్ ఆపరేషన్ చేస్తున్నారు. ఆమె స్కెచ్ హీరో సుదీప్ కోసమే. పోలీస్‌గా ఆమె వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటో ‘కోటిగొబ్బ 3’ సినిమాలో తెలుస్తుంది. మొన్నామధ్య ఫైటింగ్, ఫైరింగ్ గట్రా నేర్చుకున్నారు హీరోయిన్ రాయ్‌లక్ష్మీ. ఇంత కష్టపడింది ఆమె కన్నడ చిత్రం ‘ఝాన్సీ’లో పోలీస్ గెటప్ వేయడం కోసమే. పీవీఆర్ గురుప్రసాద్ ఈ చిత్రానికి డైరెక్టర్. సౌత్‌లోనే కాదు.. బాలీవుడ్ భామలు కొందరు పోలీస్‌సైరన్ మోగిస్తున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సాహో’. ఈ సినిమాతో సౌత్‌కు పరిచయం అవుతున్నారు బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్. ఈ సినిమాలో శ్రద్ధాది పోలీస్ పాత్రే అని ఆల్రెడీ విడుదలైన ‘సాహో’ టీజర్ చెబుతోంది. ‘అంగ్రేజీ మీడియం’ సినిమా కోసం గన్ పట్టుకున్నారు కరీనా కపూర్. ఈ సినిమాకు హోమి అడ్జానియా దర్శకుడు. ఇర్ఫాన్ ఖాన్ హీరోగా నటిస్తున్నారు. ముంబైలో జరిగే అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని మళ్లీ శివానీ శివాజీ రాయ్‌గా డ్యూటీ చేస్తున్నారు రాణీ ముఖర్జీ. శివాజీ రాయ్ అనగానే ‘మర్దానీ’ చిత్రం గుర్తుకు వచ్చే ఉంటుంది. ప్రస్తుతం తెరకెక్కుతున్న ఈ సినిమా సీక్వెల్ ‘మర్దానీ 2’లో రాణీముఖర్జీ నటిస్తున్నారు. ఫస్ట్ పార్ట్‌కి కథ అందించిన∙గోపీ పుత్రన్ సీక్వెల్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. వరలక్ష్మి, రాణీ ముఖర్జీ, కరీనా కపూర్ -
నమ్మకముంటే ఏదైనా సాధించవచ్చు..
చెన్నై: సినిమా విజయాలు అంతంత మాత్రాన ఉన్న తన అందచందాలతో అభిమానులను అకట్టుకునే రాయ్ లక్ష్మి ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ హాట్‌గా బికినీ వీడియో పోస్ట్ చేసి అందరిని అవాక్కయ్యేలా చేసింది. ఇటీవల రాయ్ లక్ష్మి నటించిన బాలీవుడ్ చిత్రం జూలీ2 ఆమెకు తీవ్ర నిరాశను మిగిల్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో అభిమానులు డీలా పడ్డా... రాయ్ లక్ష్మీ తన పర్ఫామెన్స్తో అందరిని ఆకట్టుకుంది. ఈ క్రమంలో సినిమాల ఫలితం ఎలా ఉన్నా తాను ఎల్లప్పుడూ వర్కవుట్లు చేస్తూ ఫిజిక్‌ను కాపాడుకుంటానని లక్ష్మి తెలిపింది. ప్రస్తుతం మునుపటి కంటే అందంగా ఉన్నావని.. నన్నొక కొత్త వ్యక్తిలా ఉన్నావని అందరూ చెబుతుంటే ఎంతో సంతోషంగా ఉందని పేర్కొంది. ఇప్పుడు తన శరీర సౌందర్యం మరింతగా ఇనుమడించడమే కాకుండా మానసికంగా కూడా దృడంగా ఉన్నానని చెప్పింది. మనపై మనకు పూర్తి నమ్మకముంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చని రాయ్ లక్ష్మీ చెప్పుకొచ్చింది. -
నంబర్ 3
సౌత్‌లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక రాయ్‌లక్ష్మీ ఈ మ్యాజిక్‌ను బాలీవుడ్లో రిపీట్ చేయలేకపోతున్నారు. అందుకే వీలైనప్పుడల్లా హిందీ సినిమాల్లో నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు న్నారు. ఇది వరకు ‘అకీరా’ (2016), ‘జూలీ 2’ (2017) చిత్రాల్లో నటించిన ఆమె తాజాగా ‘టిస్ఫై’ అనే హిందీ చిత్రానికి సైన్ చేశారు. ఈ చిత్రానికి దీపక్ తిజోరీ దర్శకత్వం వహించనున్నారు. నాజియా హుస్సే నామి, షామా సికందర్, అలంకృత సహై, కైనత్ అరోరా కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో లండన్‌లో ప్రారంభం కానుంది. మరి.. హిందీలో చేస్తున్న ఈ మూడో సినిమా అయినా రాయ్‌లక్ష్మీకి నార్త్‌లో హిట్ టేస్ట్ చూపిస్తుందా? -
రాయ్‌లక్ష్మీ ఇమేజ్ను బ్రేక్ చేస్తుంది!
తమిళసినిమా : నటి రాయ్‌లక్ష్మిని కొత్తగా ఆవిష్కరించేలా ‘సిండ్రెల్లా’ ఉంటుందని ఆ సినిమా దర్శకుడు వినో వెంకటేశ్ అంటున్నారు. బెంగళూర్‌కు చెందిన ఈయన మల్టీమీడియాలో పట్టభద్రుడు. దర్శకుడు ఎస్జే.సూర్య వద్ద నాలుగేళ్లు సహాయ దర్శకుడిగా పని చేసిన వినో వెంకటేశ్ సిండ్రెల్లా చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సందర్భంగా సినిమా గురించి మాట్లాడుతూ.. సిండ్రెల్లా అన్నది దెయ్యం ఇతివృత్తంతో తెరకెక్కిస్తున్న కథా చిత్రమేనన్నారు. అయితే ఇప్పుడు వస్తున్న హర్రర్‌తో కూడిన థ్రిల్లర్ కథా చిత్రాలకు భిన్నంగా పలు జనరంజకమైన అంశాలతో కూడి ఉంటుందన్నారు. ఇందులో నటి రాయ్‌లక్ష్మి పోషిస్తున్న పాత్ర ఆమెకున్న గ్లామర్ ఇమేజ్ను బ్రేక్ చేస్తుందని అన్నారు. అంతే కాదు ఆమె కెరీర్లో ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక ఈ చిత్రంలో నటి సాక్షీ అగర్వాల్ ప్రతినాయకిగా నటించినట్లు వినో వెంకటేశ్ తెలిపారు. ఆమె పాత్ర సినీ పరిశ్రమలో చర్చనీయాంశం అవుతుందని అభిప్రాయ పడ్డారు. ఇంకా కల్లూరి వినోద్, గాయని ఉజ్జాయినిగజరాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. కాంచన-2 చిత్రం ఫేమ్ అశ్వమిత్ర సంగీతాన్ని, తెలుగులో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి పని చేసిన రామి ఛాయాగ్రహణం అందించారని తెలిపారు. తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఆబాలగోపాలాన్ని రంజింపజేసే విధంగా రూపొందించినట్లు చెప్పారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న సిండ్రెల్లా చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు. త్వరలోనే చిత్రాన్ని విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. -
పాము ప్రేమిస్తే?
‘‘ఇప్పటి వరకు వచ్చిన పాము కథా చిత్రాలన్నీ పగ నేపథ్యంలో రూపొందాయి. కానీ, మా ‘నాగకన్య’ చిత్రం పాము నేపథ్య కథావస్తువు అయినప్పటికీ విభిన్నంగా ఉంటుంది. పగతో కాకుండా ప్రేమ నేపథ్యంలో సాగుతుంది’’ అంటున్నారు నిర్మాత కె.ఎస్.శంకర్ రావు. కమల్‌హాసన్ నటించిన తమిళ ‘నీయా’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం ‘నీయా–2’. జై హీరోగా, రాయ్‌లక్ష్మి, వరలక్ష్మీశరత్ కుమార్, కేథరిన్ థెరిస్సా హీరోయిన్లుగా నటించారు. ఎల్.సురేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘నాగకన్య’ పేరుతో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై కె.ఎస్.శంకర్ రావు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెల 24న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. కె.ఎస్.శంకర్ రావు మాట్లాడుతూ– ‘‘గతంలో ‘నోము, దేవతలారా దీవించండి, దేవి, అమ్మానాగమ్మ’ వంటి పాము నేపథ్యంలో వచ్చిన చిత్రాలు ఎంత పెద్ద విజయాన్ని సాధించాయో తెలిసిందే. మా సినిమా కూడా అదే స్థాయిలో హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. పాము కథాచిత్రాలు గతంలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాలేదు. మా సినిమానే తొలిసారి విడుదలవుతోంది’’ అన్నారు. ఎల్.సురేష్ మాట్లాడుతూ– ‘‘నలభై నిమిషాల కాలనాగు గ్రాఫిక్స్ ఈ చిత్రానికి హైలైట్. కథ డిమాండ్ మేరకే గ్రాఫిక్స్ కోసం అధికంగా ఖర్చు చేయాల్సి వచ్చింది’’ అన్నారు. -
40 నిమిషాల గ్రాఫిక్స్‌తో...
కమల్‌హాసన్ హీరోగా నటించిన ‘నియా’ చిత్రం తమిళంలో ఘన విజయం సాధించింది. దానికి సీక్వెల్‌గా ‘నియా–2’ పేరుతో తమిళంలో, ‘నాగకన్య’ పేరుతో తెలుగులో ఓ చిత్రాన్ని రూపొందించారు. ‘జర్నీ, రాజారాణి’ చిత్రాల ఫేమ్ జై హీరోగా, వరలక్ష్మీ శరత్ కుమార్, రాయ్‌లక్ష్మి, కేథరిన్ థెరిస్సా ప్రధాన పాత్రల్లో నటించారు. ఎల్.సురేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈనెల 24న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ అధినేత కె.ఎస్.శంకర్ రావు తెలుగులో విడుదల చేస్తున్నారు. కె.ఎస్.శంకర్ రావు మాట్లాడుతూ– ‘‘పాము నేపథ్యంలో వచ్చిన ‘నోము, దేవి, పున్నమినాగు, అమ్మా నాగమ్మ’ వంటి చిత్రాలెన్నో ప్రేక్షకాదరణకు నోచుకున్నాయి. ఇప్పుడు మళ్లీ పాము కథాంశాన్ని ఎంచుకుని నేటి నవీన సాంకేతికతను మిళితం చేశారు. ముఖ్యంగా నలభై నిమిషాల కాలనాగు గ్రాఫిక్స్ ఈ చిత్రానికి హైలైట్. హారర్ కథాంశంతో ఆద్యంతం ఆకట్టుకునే ఈ చిత్రంలో పాము చేసే విన్యాసాలు, మనిషి పాముగా మారే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో నిజమైన కోబ్రాను వాడాలనుకున్నాం. అందుకోసం బ్యాంకాక్ కూడా వెళ్లాం. కానీ ఒరిజనల్ పామును షూటింగ్లో ఉపయోగించడానికి వీలుకాలేదు. దాంతో గ్రాఫిక్స్‌లో చూపించాం’’ అన్నారు ఎల్.సురేష్. ‘‘వెండితెరపై కాలనాగును చూపించాలన్న ఉద్దేశ్యంతో ఇండోనేషియాలో పాములకు శిక్షణ ఇచ్చే నిపుణులను కలిశాం. వారి దగ్గర 20 నుంచి 28 అడుగుల పొడవున్న కోబ్రాలు ఉన్నాయి. వాటిపై చిత్రీకరణ జరిపి కొన్ని సీన్లను గ్రాఫిక్స్‌లో ఉపయోగించాం’’ అని గ్రాఫిక్స్ నిపుణుడు వెంకటేష్ చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: రాజావెల్ మోహన్, సంగీతం: షబ్బీర్. -
నాగకన్య విన్యాసాలు
దాదాపు 40 ఏళ్ల క్రితం వచ్చిన కమల్‌హాసన్ చిత్రాల్లో ‘నీయా’ ఒకటి. ఈ రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ అప్పట్లో మంచి హిట్. ఇన్నేళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘నీయా 2’ రూపొందింది. తెలుగు వెర్షన్ టైటిల్ ‘నాగకన్య’. జై హీరోగా, వరలక్ష్మీ శరత్ కుమార్, రాయ్ లక్ష్మి, కేథరిన్ థెరిస్సా ప్రధాన పాత్రలలో ఎల్. సురేష్ దర్శకత్వంలో రూపొందింది. ఈ చిత్రం తెలుగు హక్కులను లైట్ హౌస్ సినీమ్యాజిక్ అధినేత కె.ఎస్. శంకర్ రావు దక్కించుకున్నారు. ఈ నెల 10న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా కె.ఎస్.శంకర్ రావు మాట్లాడుతూ– ‘‘హారర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం థ్రిల్‌కి గురి చేసే విధంగా ఉంటుంది. ముఖ్యంగా మనిషి పాముగా మారే సన్నివేశాలు, పాము చేసే విన్యాసాలు హైలైట్‌గా ఉంటాయి. కథ డిమాండ్ మేరకు గ్రాఫిక్స్‌కి భారీగా ఖర్చు పెట్టడం జరిగింది. ఈ సమ్మర్లో పిల్లలు, పెద్దలకు మంచి ఎంటర్టైనర్ అవుతుంది. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు’’ అన్నారు. -
వదంతులపై ఫైర్ అయిన రాయ్‌లక్ష్మీ
టీ.నగర్: ఎమీజాక్సన్, సమీరారెడ్డి గర్భంతో ఉన్నట్లు ఇంటర్నెట్లో సమాచారం చెక్కర్లు కొడుతుండగా మరోవైపు నటి రాయ్‌లక్ష్మీ కూడా గర్భంతో ఉన్నట్లు కొందరు నిప్పు రాజేశారు. ఈ విషయం తెలుసుకుని దిగ్భ్రాంతి చెందిన రాయ్‌లక్ష్మీ ఘాటుగా స్పదించారు.ఒక అమ్మాయిగా ప్రతి రోజు పలు విషయాలను తాను ఫేస్ చేయాల్సి వస్తోందని, తన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయంపై తాను కలచెందడం లేదన్నారు. స్వయం చింతన లేకుండా, ఇతరుల మనోబావాలతో సంబంధం లేకుండా హద్దులు మీరి తనపై వదంతులు రేపడం మనస్సును తీవ్రంగా గాయపరుస్తోందని వాపోయారు. ఒకే సమయంలో పలువురితో సన్నిహిత సంబంధాలు కలిగిన వ్యక్తిని తాను కాదని, ఇటువంటి ఇలాంటి వదంతులు సైతం ప్రచారం చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను గర్భంతో ఉన్నట్లు మరో రూమర్‌ను వ్యాపింపచేస్తున్నారని మండిపడింది. ఇలాంటి వదంతులతో తన మనస్సు ఎంతగానో గాయపడిందని, అర్థం పర్థం లేని ఆ రూమర్‌తో తాను ఎంతో రోదించినట్లు తెలిపారు. ఇకనైనా ఇలాంటి వదంతులు వ్యాపించేవారు తమ పద్ధతి మార్చుకోవాలని కోరింది. -
భార్యాబాధితుల కథ
భార్యాబాధితులైన నలుగురు స్నేహితులు బ్యాచిలర్ జీవితమే బావుంటుందనుకుంటారు. ఆ క్రమంలో ఆ నలుగురు ఒకరికి తెలియకుండా ఒకరు సంజన (రాయ్‌లక్ష్మి)ని ప్రేమిస్తారు. ఓ డాన్‌లా సంజన వారికి ఎలాంటి గుణపాఠం చెబుతుంది? అనే కథాంశంతో తెరకెక్కిన తమిళ చిత్రం ‘ఒంబదులే గురు’. రాయ్‌లక్ష్మి లీడ్రోల్లో పి.టి. సెల్వకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వాణీ వెంకటరమణ సినిమాస్‌పై నిర్మాత రవీంద్ర కల్యాణ్ తెలుగులో ‘సంజనరెడ్డి’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ నెల 5న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా తెలంగాణ ఫిలిం చాంబర్ కార్యదర్శి సాయివెంకట్ టీజర్‌ను రిలీజ్ చేశారు. రవీంద్ర కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్ కామెడీ, యాక్షన్ అంశాలతో సాగే చిత్రమిది. 120 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఇదే బేనర్లో నా స్వీయ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని రూపొందించనున్నా’’ అన్నారు. ‘‘రవీంద్ర కల్యాణ్‌లో మంచి దర్శకుడున్నారు. చెన్నైలో దర్శకుడిగా తానేంటో నిరూపించుకున్నారు’’ అన్నారు రామసత్యనారాయణ. సహ నిర్మాత బాదినేని వెంకయ్య, మాటల రచయిత శ్రీసాయి, కె.కస్తూరి, నూనె రంగనాయకులు, వాయాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
వద్దనుకుంటే కళ్లు మూసుకుని కూర్చోండి
సినిమా: వద్దనుకుంటే కళ్లు మూసుకుని కూర్చోండి అంటోంది నటి రాయ్‌లక్ష్మీ. అందాల ఆరబోతకు కేరాఫ్‌గా మారిన హీరోయిన్లలో ఈ బ్యూటీ ఒకరని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే విధంగా పలు వివాదాలకు, సంచలనాలకు ఈమె కేంద్ర బిందువే. కాగా ఆ మద్య దక్షిణాదిని వదులుకుని బాలీవుడ్ ఆశతో ముంబాయికి మకాం మార్చింది రాయ్‌లక్ష్మీ. అక్కడ జూలీ–2 చిత్రంలో మోతాదుకు మించిన గ్లామర్‌ను ప్రదర్శించి సెటిల్ అవ్వాలని ఆశ పడింది. అయితే వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదంటారే.. అలాంటి పరిస్థితే రాయ్‌లక్ష్మీకి ఎదురైంది. దీంతో గోడకు కొట్టిన బంతిలా మళ్లీ దక్షిణాదికి తిరిగివచ్చింది. అందుకు తగ్గట్టుగా కోలివుడ్లో కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో చేతిలో చిత్రాలు ఉన్నాయి. ఈ అమ్మడు నటించిన పొట్టు చిత్రం ఇటీవలే విడుదలైంది. తాజాగా నీయా–2 చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా రాయ్లక్ష్మీతో చిట్‌చాట్. ప్ర: నీయా–2 ఏ తరహా చిత్రం? జ: ఇది పాము కథ నేపథ్యంగా సాగే చిత్రం. నా పాత్రకు కూడా పాముతో సంబంధం ఉంటుంది. ఇందులో నేను రెండు గెటప్‌లలో కనిపిస్తాను. సస్పెన్స్ కథాంశంతో కూడిన ఈ చిత్రం మూడు కాలాలకు చెందినదిగా ఉంటుంది. అందుకే ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. ముగ్గురికీ తగిన ప్రాధాన్యత ఉంటుంది. సినిమా షూటింగ్ మొత్తం చాలా జాలీగా గడిచిపోయింది. ప్ర: కోలీవుడ్‌లో చాలా గ్యాప్ వచ్చినట్టుంది? జ: నిజం చెప్పాలంటే ఒకేసారి ఐదారు చిత్రాల్లో నటించాలన్న ఆశ నాకు లేదు. ఏదైనా కొత్తగా చెయ్యాలని ఆశ పడుతుంటాను. అందుకే చిత్రాల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాను. సరైన అవకాశాలు రాకుంటే ఖాళీగా ఉండటమే బెటర్. ప్ర:చాలా స్లిమ్‌గా తయారయ్యారు, ఎంత బరువు తగ్గారు? జ: కొందరు బరువు తగ్గితే చూడలేం. ఈ విషయాన్ని నేనే కొందరితో అన్నాను. నేను సన్నబడ్డ కూడా బాగున్నావంటున్నారు. నీయా–2 చిత్రంలో నా పాత అవతారాన్ని, స్లిమ్‌గా మారిన అవతారాన్ని చూడవచ్చు. ఈ చిత్రం కోసం సుమారు 15 కిలోల బరువు తగ్గాను. ప్ర: ఎక్కువగా బికినీ దుస్తుల్లో అదీ కూడా సెల్ఫీ ఫోటోలను ఇంటర్నెట్లో పోస్ట్ చేస్తుంటారు. కారణం ఏమిటీ? జ: నేను ఎక్కడికి వెళ్లినా సెల్ఫీ తీసుకుంటాను. అదంతా జ్ఞాపకాల కోసమే. అంతే కానీ సామాజిక మాద్యమాల్లో పోస్ట్ చేయడానికి మాత్రం కాదు. నేను చాలా కాలం ముంబాయిలో ఉన్నాను. అక్కడ బికినీ ధరించడం సర్వసాధారణం. అది నాకూ నచ్చింది. అందుకే బికినీ దుస్తులు ధరించి ఫొటోలు దిగాను. అలాంటి గ్లామర్ ఫొటోలను చూడటానికి ఇష్టపడని వారు కళ్లు మూసుకుని కూర్చోవచ్చు. ప్ర:వివాహం ఎప్పుడు చేసుకుంటారు? జ: నాకు కాబోయే భర్తను నేనే ఎంపిక చేసుకోవాలి. ఆ స్వేచ్ఛని నా కుటుంబ సభ్యులు ఇచ్చారు. ప్ర: ప్రేమ అనుభవాలు? జ: అవి లెక్కలేనన్ని. పాఠశాలలోనే చాలా మంది ఉన్నారు. వారి సంఖ్య చెప్పాలంటే వేరే లెవల్. ప్ర: రాజకీయాల్లోకి ఆహ్వానిస్తే? జ: ఇప్పటికే చాలా మంది ఆహ్వానించారు. నేనే నిరాకరించాను. ప్ర: మీటూ ఉద్యమం గురించి మీ అభిప్రాయం? జ: మీటూపై పోరాడటం మంచి విషయం. పలువురు బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి చెబుతున్నారు. అయితే కొందరు దీన్ని మరోరకంగా వాడుకుంటున్నారు అది తప్పు. -
రాయ్‌లక్ష్మీ గర్భం దాల్చినట్లు ప్రచారం..?
సినిమా: అంతమాత్రాన ఎలాగైనా మాట్లాడతారా? అంటూ మండిపడుతోంది నటి రాయ్‌లక్ష్మీ. ఈ అమ్మడు కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ అంటూ పలు భాషల్లో నాయకిగా నటించింది. చివరికి అందాలారబోతకు ఏ మాత్రం పరిధులు పెట్టకుండా నటించేసింది. హిందీ చిత్రం జూలీ–2లో హాలీవుడ్ తారలను మించిపోయి నటించింది. అయినా ఫలితం దక్కలేదు. ఆ చిత్రం చాలా నిరాశపరిచింది. దీంతో బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పేసి మళ్లీ దక్షిణాదినే నమ్ముకుంది. ఇన్ని భాషల్లో నటించినా ఎందుకనో స్టార్ హీరోయిన్ స్టేజ్‌కు చేరలేకపోయింది. ఇక చాలా చిత్రాల్లో సింగిల్ సాంగ్స్‌కు ఆడేసింది. ఇప్పుడు తమిళంలో కొన్ని చిత్రాలు చేతిలో ఉన్నాయి. ఇదిలాఉండగా ఈ సంచలన నటి గురించి వదంతులు రాని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. అలా తాజాగా ఒక వదంతి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రాయ్‌లక్ష్మీ గర్భం దాల్చింది అన్నదే ఆ ప్రచారం. దీని గురించి ముందు పెద్దగా పట్టించుకోని రాయ్‌లక్ష్మీ ఆ ప్రచారానికి ఫుల్స్టాప్ పెట్టాలన్న ఉద్దేశంలో పెదవి విప్పింది. ఆమె మాట్లాడుతూ కొందరు తన గురించి వదంతులు ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారని మండిపడింది. అవును తాను పలుమార్లు ప్రేమలో పడ్డానని అయితే ఆ తరువాత అది బ్రేకప్‌తో ముగిసిన మాట నిజమేనని అంగీకరించింది. అలాగని తన విషయంలో ఎవరైనా జోక్యం చేసుకుని మీ ఇష్టమొచ్చినట్టు మాట్లాడతారా? అంటూ ఆగ్రహించింది. ఒక రోజు తాను మామిడికాయ తినడం చూశారని అంది. దీంతో వెంటనే తాను గర్భం దాల్చినట్లు ప్రచారం చేసేస్తున్నారని ఆరోపించింది. ఇలాంటివి అడ్డు కోవడానికి తాను కోర్టును ఆశ్రయిస్తానని రాయ్‌లక్ష్మీ చెప్పింది. -
అంతా మాయ.. సినిమాలు వద్దన్నారు – శ్రీధర్‌రెడ్డి
‘‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ’ చిత్రం మా యూనిట్‌కి స్పెషల్. ఎందుకంటే ఈ సినిమా కోసం అంతా చాలా హార్డ్ వర్క్ చేశాం. ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు కామెడీ ఉంది. సినిమాలంటే ప్యాషన్ ఉండే నిర్మాతలు అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో శ్రీధర్ రెడ్డి ఒకరు’’ అని రాయ్‌లక్ష్మీ అన్నారు. రామ్‌కార్తీక్, పూజిత పొన్నాడ జంటగా రాయ్‌లక్ష్మీ ప్రధాన పాత్రలో కిషోర్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ’. గురునాథ రెడ్డి సమర్పణలో ఎం.శ్రీధర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, ఆర్.కె.రెడ్డి నిర్మించారు. హరి గౌడ స్వరపరచిన ఈ సినిమా పాటల్ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘కిషోర్ కథ చెప్పినప్పుడు ఎంత ఎగై్జట్ అయ్యామో సినిమా మేకింగ్‌లోనూ అంతే ఎగై్జట్ అయ్యాం’’ అన్నారు గుర్నాధరెడ్డి. ‘‘మాకు తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి పెద్దగా అవగాహన లేదు. మంచి సినిమా చేద్దాం, నేను ముందుండి చూసుకుంటానని శ్రీధర్ రెడ్డి చెప్పడంతో సరే అని ఈ సినిమా తీశాం’’ అన్నారు ఆనంద్ రెడ్డి. ‘‘సినిమా ఇండస్ట్రీ అంతా మాయ.. వద్దు’ అని మాకు తెలిసినవాళ్లు చెప్పారు. కానీ ఇక్కడ మాకెలాంటి చెడు కనపడలేదు. మంచి కథతో చక్కని టీమ్‌తో పనిచేస్తే తప్పకుండా మంచి అవుట్‌పుట్ వస్తుందనడంలో సందేహం లేదు’’ అన్నారు శ్రీధర్ రెడ్డి. ‘‘నాకు మంచి నిర్మాతలు దొరికారు’’ అన్నారు కిషోర్ కుమార్ చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌర, రచయిత కిరణ్ పాల్గొన్నారు. -
ఆఫీసర్ ఝాన్సీ
ఆరేళ్ల తర్వాత కన్నడంలో రాయ్‌లక్ష్మీ నటిస్తున్న సినిమా ‘ఝాన్సీ’. 2013లో వచ్చిన ‘అట్టహాస’ రాయ్‌లక్ష్మీ తొలి కన్నడ చిత్రం. ‘ఝాన్సీ’ చిత్రానికి పీవీఎస్ గురుప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు రాయ్‌లక్ష్మీ. సినిమాలో ఆమె లుక్‌ను విడుదల చేశారు. ఈ లుక్‌లో కాగడా పట్టుకుని కోపంగా రాయ్‌లక్ష్మీ చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు కదూ. ఈ చిత్రంలో ఆమె కొన్ని రియల్ స్టంట్స్ కూడా చేశారు. ‘‘కన్నడంలో నా తర్వాతి చిత్రం ‘ఝాన్సీ’ లుక్‌ను విడుదల చేసి నందుకు ఆనందంగా ఉంది. ఈ చిత్రం త్వరలో విడుదలవుతుంది’’ అన్నారు రాయ్‌లక్ష్మీ. -
సిండ్రిల్లాకు ఓకే!
తమిళ సినిమా: కోలీవుడ్, టాలీవుడ్ దాటి బాలీవుడ్ స్థాయికి ఎదిగిన సంచలన నటి రాయ్‌లక్ష్మి. బాలీవుడ్ చిత్రం జూలీ–2 ఆశించిన విజయం సాధించకపోయినా, అక్కడ తనదైన ముద్ర వేసుకున్న రాయ్‌లక్ష్మి.. చిన్న గ్యాప్ తరువాత కోలీవుడ్‌లో మళ్లీ బిజీ అవుతున్నారు. బాలీవుడ్లో యార్, నీయా 2 చిత్రాలతో పాటు మలయాళంలో నాలుగు, కన్నడంలో ఒక చిత్రం చేస్తున్నారు. తాజాగా కోలీవుడ్‌లో మరో అవకాశం తలుపు తట్టింది. హీరోయిన్ సెంట్రిక్ పాత్రలో నటించే చాన్స్‌ను కొట్టేసింది. సిండ్రిల్లా అనే ఫాంటసీ, హర్రర్ థ్రిల్లర్ కథా చిత్రంలో నటించడానికి రెడీ అవుతోంది. చిన్నారుల కలల ప్రపంచంలో కనిపించే దేవకన్య లాంటి పాత్ర సిండ్రిల్లా. ఈ పేరుతో ఒక చిత్రం తెరకెక్కనుంది. దర్శకుడు ఎస్జే.సూర్య శిష్యుడు వినో వెంకటేశ్ ఈ చిత్రం ద్వారా మెగాఫోన్ పడుతున్నారు. ఎస్ఎస్ఐ. ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇంతకు ముందు 100 చిత్రాలకు పైగా డిస్ట్రిబ్యూషన్ చేసిన ఈ సంస్థ చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి నిర్మిస్తున్న తొలి చిత్రం సిండ్రిల్లా. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది ఫాంటసీ నేపథ్యంలో సాగే హర్రర్, థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఇంతకు ముందు హర్రర్ ఇతివృత్తంగా పలు చిత్రాలు వచ్చినా, వాటికి పూర్తి భిన్నంగా సిండ్రిల్లా చిత్రం ఉంటుందని అన్నారు. చిత్ర టైటిల్ వినగానే నిర్మాత చిత్రం చేయడానికి ముందుకు వచ్చారన్నారు. ఈ చిత్ర స్క్రిప్ట్‌ను నటి లక్ష్మీరాయ్‌కు పంపామని, ఆ తరువాత ఒక షూటింగ్లో ఉన్న ఆమెను లంచ్ బ్రేక్‌లో కలిసి కథను వినిపించామని చెప్పారు. అంతకు ముందే పంపిన సింగిల్‌లైన్ కథను చదివిన రాయ్‌లక్ష్మి వెంటనే నటించడానికి అంగీకరించినట్లు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను అతి త్వరలోనే వెల్లడిస్తామని, చిత్ర షూటింగ్ కూడా త్వరలో ప్రారంభం కానున్నట్లు దర్శకుడు వినో వెంకటేశ్ తెలిపారు. -
ఆఫీసర్ ఝాన్సీ
దాదాపు ఆరేళ్ల తర్వాత శాండిల్‌వుడ్ నుంచి రాయ్‌లక్ష్మీకి మళ్లీ కబురొచ్చింది. 2012లో ఉపేంద్ర నటించిన ‘కల్పన’ చిత్రంతో శాండిల్‌వుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు రాయ్‌లక్ష్మీ. రాఘవ లారెన్స్ ‘కాంచన’ చిత్రానికి రీమేక్ ఇది. ఇప్పుడు పీఎస్వీ గురుప్రసాద్ దర్శకత్వంలో రూపొందనున్న కన్నడ చిత్రం ‘ఝాన్సీ’లో నటించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా ఆగస్టు 29న సెట్స్‌పైకి వెళ్తుందట. ‘‘ఇందులో సొసైటీలోని సమస్యలపై పోరాడే నిజాయతీ గల ఐపీఎస్ ఆఫీసర్ ఝాన్సీ పాత్రలో రాయ్‌లక్ష్మీ నటించనున్నారు. ఓన్లీ యాక్షన్ మాత్రమే కాదు. లవ్ అండ్ సెంటిమెంట్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. కంఫర్ట్ జోన్‌ని దాటి ఆమె ఈ సినిమాను ఒప్పుకున్నారు’’ అన్నారు. ‘‘కన్నడ ఫిల్మ్ ‘ఝాన్సీ’లో నటించబోతున్నందుకు హ్యాపీ. తొలిసారి ఫుల్ యాక్షన్ రోల్ ట్రై చేయబోతున్నాను’’ అన్నారు రాయ్‌లక్ష్మీ. ఈ సినిమాకు రాజేష్ కుమార్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. -
ఐయామ్ బ్యాక్
...అంటున్నారు హీరోయిన్ రాయ్ లక్ష్మీ. దాదాపు ఏడాది తర్వాత తమిళంలో ఆమె ‘నీయా 2’ అనే చిత్రం కమిట్ అయ్యారు. మధ్యలో హిందీ చిత్రం ‘జూలీ 2’లో నటించారు. అందుకే ‘ఐయామ్ బ్యాక్’ అన్నారు. రీసెంట్గా ‘నీయా 2’ సెట్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ‘‘నీయా 2’ రెండో షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఈ ఏడాది తమిళ, మలయాళం, తెలుగు ప్రాజెక్ట్స్ కోసం బ్యాక్ టు బ్యాక్ షూట్లో పాల్గొనబోతున్నాను’’ అని పేర్కొన్నారు రాయ్ లక్ష్మీ. ఈ సంగతి ఇలా ఉంచితే ఈ ‘నీయా 2’ చిత్రం గతంలో కమల్‌హాసన్ నటించిన ‘నీయా’కి సీక్వెల్ అని టాక్. దురై దర్శకత్వంలో ఆర్.ముత్తురామన్, కమల్‌హాసన్, సుప్రియ, లత ముఖ్య తారలుగా 1979లో ‘నీయా’ చిత్రం రూపొందింది. ఇది హారర్ మూవీ. స్నేక్‌కి కీలక పాత్ర ఉంది. ‘నీయా2’ కూడా స్నేక్ బేస్డ్ హారర్ మూవీ. దాంతో కమల్ ‘నీయా’కి ఇది సీక్వెల్ అనే వార్త ప్రచారంలోకొచ్చింది. అయితే చిత్రబృందం ఈ విషయం గురించి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇందులో జై హీరోగా, రాయ్ లక్ష్మీ, కేథరిన్, వరలక్ష్మీ శరత్ కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు. మరోవైపు నటి అంజలి, రాయ్‌లక్ష్మీల కాంబినేషన్లో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. -
జూలీ.. గీతాంజలి
... ఏం చేయబోతున్నారు అంటే ప్రజెంట్ సస్పెన్స్. తర్వాత చెప్తాం అంటున్నారు చిత్రబృందం. ‘గీతాంజలి, చిత్రాంగద’ వంటి థ్రిల్లర్స్‌లో నటించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు అంజలి. ‘జూలీ 2’ సినిమాతో ఇటీవల బాలీవుడ్లో హాట్ హాట్‌గా ఎంట్రీ ఇచ్చారు సౌత్ బ్యూటీ రాయ్‌లక్ష్మీ. ఇప్పుడు ఈ గీతాంజలి, జూలీ ఓ సినిమాలో నటించబోతున్నారు. అంజలి, రాయ్‌లక్ష్మీ ముఖ్య తారలుగా కర్రి బాలాజీ దర్శకత్వంలో ఆర్కే స్టూడియోస్ బ్యానర్‌పై తమిళ, తెలుగు భాషల్లో ఎమ్. రాజ్‌కుమార్ నిర్మాణంలో ఓ సినిమా రూపొందనుంది. ‘‘అంజలి, రాయ్ లక్ష్మీ పాత్రల గురించి తర్వాత చెబుతాం. కచ్చితంగా ఇప్పటివరకూ చేయని పాత్రల్లో కనిపిస్తారు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. డిఫరెంట్ స్టోరీకి సోషల్ అంశాలను జోడించి ఉత్కంఠభరితంగా తెరకెక్కించనున్నాం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అని దర్శక–నిర్మాతలు అన్నారు. సాయికుమార్, నరేశ్, శివప్రసాద్, ధన్‌రాజ్, జాకీ, అశోక్‌కుమార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దత్తి సురేష్ కుమార్. -
తీవ్ర నిరాశలో ‘జూలీ’
తమిళసినిమా: అనుకున్నదొక్కటీ అయ్యింది ఒక్కటీ.. బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్టా.. ఏమిటీ అసందర్భ ప్రేలాపన అనుకుంటున్నారా? ఆశించింది జరగకపోతే ఇలాంటి పాటలే గుర్తుకొస్తాయి మరి. నటి రాయ్‌లక్ష్మీ ఎన్ని భాషల్లో నటించినా, పేరును తారుమారు చేసుకున్నా, రాశి మాత్రం మారకపోవడంతో తీవ్ర నిరాశకు గురయిందట. కోలీవుడ్ హీరోయిన్గా పరిచయం అయినా.. వచ్చిన అవకాశాన్ని వదలకుండా, గెస్ట్ అపియరెన్స్, ఐటమ్ సాంగ్స్, నటిగా ఎన్ని రకాల పాత్రలు చేయాలో అన్నీ చేసేసింది. అయినా ఏ తరహా పాత్ర రాయ్‌లక్ష్మీని స్టార్ నటిని చేయలేక పోయింది. అయినా అందుకు అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ బ్యూటీ ఎన్నో ఆశలు పెట్టుకున్న హిందీ చిత్రం జూలీ -2 ఇటీవల విడుదల దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఈమె నిజానికి బాలీవుడ్ రంగప్రవేశానికి చాలా కాలంగా పోరాడి జూలీ -2 చిత్ర అవకాశాన్ని దక్కించుకుంది. మరో విషయం ఏమిటంటే ఇది ఈ అమ్మడి అర్ధ శత చిత్రం. దక్షిణాదిలో అంతగా ఆశాజనకంగా లేకపోవడంతో జూలీ-2తో బాలీవుడ్లో సెటిల్ అయిపోదామని ఆశించిన రాయ్‌లక్ష్మీకి ఆ చిత్రం ఘోర నిరాశనే మిగిల్చింది. ఈ చిత్రంలో అందాలు ఆర బోసినా ఫలితం దక్కలేదు. అయితే ఈమె నటనలో విమర్శించదగ్గ అంశం లేకపోయినా కథలోనే క్లారిటీ లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హిందీలో తెరకెక్కిన జూలీ -2 చిత్రాన్ని తమిళంలోనూ డబ్ చేసి విడుదల చేశారు. సుమారు రూ.30 కోట్ల బడ్జెట్‌తో నిర్మాణం జరిగిన ఈ చిత్రం ఇప్పటికి కేవలం కోటి రుపాయలు మాత్రమే వసూలు చేసిందని గణాంకాలు చెబుతున్నాయి. దీంతో జూలీ-2ను ప్లాప్ చిత్రంగా పరిగణించేస్తున్నారు సినీ పండితులు. కాగా తన 50వ చిత్రం ఇలాంటి ఫలితాన్నివ్వడంతో నటి రాయ్‌లక్ష్మీ అనుకున్నదొక్కటీ అయ్యింది ఒక్కటీ అనుకుని తీవ్ర షాక్‌కు గురైందని తెలుస్తోంది. -
ముద్దుకి ముందు... ఈ టిప్స్ పాటించండి!
మీకు సిగరేట్ తాగే అలవాటుందా? అయితే... నోటిని శుభ్రంగా కడుక్కోండి! లేదా నోట్లో చూయింగ్ గమ్ వేసుకొండి! – ఎవరినైనా ముద్దు పెట్టుకోవడానికి ముందు మీరు తప్పకుండా ఫాలో కావలసిన ఫస్ట్ టిప్. శరీరం నుంచి దుర్వాసన (బ్యాడ్ స్మెల్) రాకుండా చూసుకోవడం... సెకండ్ టిప్! ఈ రెండు టిప్స్ ఎవరు చెప్పారో తెలుసా? ‘ఖైదీ నంబర్ 150’లో రత్తాలు పాటలో హాట్ హాట్‌గా కనిపించిన రాయ్ లక్ష్మీ. ఆన్ స్క్రీన్ అయినా... ఆఫ్ ద స్క్రీన్ అయినా... ఈ టిప్స్ అందరికీ ఉపయోగపడతాయేమో కదూ! మూడో టిప్ కూడా ఉందండోయ్! అయితే... అది నటీనటులకు మాత్రమే, ప్రేక్షకులకు కాదు. అదేంటంటే... కిస్సింగ్ సీన్ లేదా రొమాంటిక్ సీన్స్‌లో నటించేటప్పుడు సెట్లో ఎవరున్నా, ఎంతమంది ఉన్నా... మర్చిపోమ్మని సెలవిచ్చారు. ఇప్పుడీ టిప్స్ అన్నీ ఎందుకంటే... రాయ్ లక్ష్మీ నటించిన హాట్ హిందీ సిన్మా ‘జూలీ–2’ ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకొస్తుంది. అదీ సంగతి! అన్నట్టు... ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
ఆ నటి.. యూట్యూబ్ క్వీన్ ఆఫ్ 2017!
ముంబయి : గతంలో ఎన్నో సినిమాలు చేసినా ఆమెకు అంతగా కలిసిరాలేదు. దాంతో పేరులో కాస్త మార్పుచేసుకుంది. ప్రస్తుతం వరుస మూవీలతో పాటు సోషల్ మీడియాను ఆమె పాటలు, ట్రైలర్ల వీడియోలు ఊపేస్తున్నాయి. ఆమె మరెవరో కాదు.. ‘జూలీ 2’ రాయ్ లక్ష్మీ. అదృష్టం కలిసిరాకపోవడంతో తన పేరును లక్ష్మీ రాయ్ నుంచి రాయ్ లక్ష్మీగా మార్పు చేసుకున్న ఈ భామ గత కొంత కాలంగా యూట్యూబ్‌లో హవా కొనసాగిస్తోంది. ఓవరాల్‌గా ఆమెకు సంబంధించిన ఈ వీడియోలు ఏకంగా 5.5 కోట్ల వ్యూస్ సంపాదించుకోవడం విశేషం. దీంతో ఆమె యూట్యూబ్ క్వీన్ అంటూ నటి అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి చాలా గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెంబర్ 150లో ఆయన సరసన ‘రత్తాలు రత్తాలు..’ అంటూ కాలు కదిపింది ఈ బ్యూటీ. ఈ పాటకు 12మిలియన్ల (1.2కోట్లు) వ్యూస్ వచ్చాయి. రాయ్‌లక్ష్మీ ఎంతో స్లిమ్‌గా మారడంతో పాటు గ్లామర్ రూటు మార్చి నటించిన చిత్రం జూలీ2 ట్రైలర్లు ఆమె బోల్డ్నెస్తో హల్చల్ చేశాయి. ఈ మూవీ టీజర్ 89 లక్షల వ్యూస్‌తో సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. అదేవిధంగా ట్రైలర్-1ను 6.7 మిలియన్ల మంది చూడగా, ట్రైలర్-2కు 4.7 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. హరహరమహాదేవకి- 15 మిలియన్లు, ఓ జూలీకి 2.3 మిలియన్లు, కోయి హౌస్లాకు-1.9 మిలియన్లు, మలా సీన్హాకు 3.6 మిలియన్ల వీక్షకులతో 2017లో రాయ్‌లక్ష్మీ జోరు అంటూ కామెంట్లు వస్తున్నాయి. 2017 Golden year for raai😍 @iamlakshmirai 's video songs ruling YouTube like a boss😍 Ratthalu - 12M Haraharamahadevaki - 15M Oh Julie - 2.3M Koi hausla - 1.9M Mala seenha - 3.6M Julie2 teaser - 8.9M Trailer 1 - 6.7M Trailer 2 - 4.7M Total - 55M🙏queen of Youtube#Iduppazhagi pic.twitter.com/oPvMjxkQRA — RAAI LAXMI DEVOTEE (@RaaiLaxmiFan) 8 November 2017 -
రెండు నెలల్లో... రాయ్...రాజా... రాయ్...
జూలీ 2 అనే బాలీవుడ్ శృంగార చిత్రంలో సరికొత్త నాజూకు అందాల ‘లక్ష్మీరాయ్’మనకి పరిచయమవుతుంది. అందాల తారగా వెలుగుతున్న లక్ష్మీరాయ్...ఇప్పుడు బాలీవుడ్లో ట్రాన్స్ఫార్మేషన్ ఫిజిక్స్ ఉన్న అతి కొద్ది మంది టాప్ సెలబ్రిటీస్‌ల లిస్ట్‌లో ఒకరు. కేవలం రెండు నెలల్లో తన ఫిజిక్‌ను అమాంతం మార్చేసుకున్న ఈ తార చెబుతున్న ట్రాన్స్ఫార్మేషన్ కబుర్లివే. స్టడీ...రెడీ... గో చిన్నప్పటి నుంచి చురుకైన దానిని. క్రీడాకారిణిని కూడా. చూడడానికి ఫిట్‌గానే ఉండేదాన్ని. అయితే రెండేళ్ల నుంచే నా శరీరం వేగంగా బరువు పెరగడం ప్రారంభమైంది. చాలా డైట్ప్లాన్స్ ప్రయత్నించాను. జిమ్‌కు కూడా వెళ్లాను. అయితే ఏవీ నాకు సరైన ఫలితాన్ని అందివ్వలేదు. ఇలా కాదని ఓ రేంజ్లో రీసెర్చ్ స్టార్ట్ చేశాను. నా మెటబాలిజం రేట్ చాలా నిదానంగా ఉంటోంది. ఈ విషయం మీద కూడా స్టడీ చేశాను. దాని ప్రకారం కార్బోహైడ్రేట్స్‌ను పూర్తిగా త్యజించి, ప్రొటీన్ డైట్‌కి మళ్లాను. చపాతీలు మానేశాను. ఉడకబెట్టిన కాయగూరలు, చికెన్ వంటి ప్రొటీన్ ఫుడ్ తీసుకున్నాను. షూట్ ఎట్ వెయిట్ బరువు తగ్గడం అంత సులభమైన ప్రక్రియ కాదు. దీన్నో సవాల్‌గా తీసుకున్నాను. నిజానికి అటు నటన కొనసాగిస్తూనే ఈ ట్రాన్స్ఫార్మేషన్ ప్లాన్ అమలు చేయవచ్చునేమో... కాని పూర్తిగా దీని మీదే దృష్టి పెట్టాలని అనుకున్నాను. షూటింగ్ నుంచి రెండున్నర నెలలు గ్యాప్ తీసుకున్నాను. రెండేళ్లలో పెంచుకున్న అదనపు వెయిట్‌ని ఈ బ్రేక్‌లో తగ్గించాలని డిసైడ్ అయ్యాను. అలవాటు కావాలంటే... ఏ కొత్త వ్యాపకం అయినా ఒక అలవాటుగా మారాలంటే 21 రోజులు చాలు. ఆ తర్వాత అది మన రోజువారీ జీవనశైలిలో భాగం అయిపోతుంది. నిజానికి నేను ఫుడీని (భోజనప్రియురాలిని). డైట్ విషయంలో మార్పు చేర్పులు చేసుకుని దాన్ని ఒక అలవాటుగా మార్చుకునేందుకు ప్రయత్నించి 10వ రోజునే బ్రేక్ ఇచ్చిన అనుభవాలు నాకు ఉన్నాయి. అయితే ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కాదన్నంత డూ ఆర్ డై సిట్యుయేషన్ నాకు నేను ఏర్పరచుకున్నాక... 10వ రోజును విజయవంతంగా అధిగమించి అదే ఊపులో కొనసాగించగలిగాను. చివరికి 15 కిలోల బరువును తగ్గించుకోగలిగాను. వెయిట్‌లాస్... హ్యాపీనెస్ గెయిన్ ప్రస్తుతం నేను నటించే ఒక మలయాళ చిత్రంలో బైకర్ పాత్ర నాది. టోన్డ్ లుక్ కావాలి కాబట్టి ఈ పాత్ర కోసం నేను కాస్త బరువు తగ్గాలని ఆ సినిమా డైరెక్టర్ సూచించారు. అయితే నేను బాగా వెయిట్ లాస్ అయ్యేటప్పటికి తొలిరోజు షూటింగ్లో వెంటనే ఆయన నన్ను గుర్తు పట్టలేకపోయారు. ఆ తర్వాత కూడా ఈ అనుభవం నాకు చాలా మంది దగ్గర ఎదురైంది. దీన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రశాంతంగా పార్టీస్‌కి వెళ్లగలుగుతున్నాను. మరింత కాన్ఫిడెంట్‌గా, చురుగ్గా ఉండగలుగుతున్నాను. -
నేను సేఫ్!
...అంటున్నారు రాయ్ లక్ష్మీ. దాంతో అభిమానులందరూ ‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకున్నారు. మరి, సుకుమారి గాయపడితే ఫ్యాన్స్ బాధపడిపోరూ! ‘రిస్క్ వద్దమ్మా... డూప్తోకానిచేద్దాం’ అని యూనిట్ సభ్యులు అన్నప్పటికీ ‘నేను రిస్కే తీసుకుంటా’ అని రాయ్ లక్ష్మీ రెడీ అయిపోయారట. ఆమె నటిస్తోన్న తాజా తమిళ చిత్రం షూటింగ్ ఈ మధ్యే మొదలైంది.ఫైట్ సీన్స్ తీస్తున్నారు. కొంచెం రిస్క్ అయినప్పటికీ రాయ్ లక్ష్మీ ఈ ఫైట్స్‌ని తానే చేస్తున్నారు.ఈ సీన్స్ తీస్తున్నప్పుడు ఆమె మోకాలికి గాయమైంది. ‘‘డూప్ లేకుండా యాక్షన్ సీక్వెన్స్ చేయడం నాకిష్టం. అలా ట్రై చేసి, చాలాసార్లు గాయపడ్డాను. మళ్లీ ట్రై చేసి గాయపడ్డాను. బట్నథింగ్ టు వర్రీ. సేఫ్ అండ్ ఫైన్’’ అని రాయ్ లక్ష్మీ పేర్కొన్నారు. మరి... ఇంతటితో రిస్కులు తీసుకోవడం మానేస్తారా? అనడిగితే... ‘‘అస్సలు మానను. అవసరమైతే ఇంకా రిస్కులు తీసుకుంటా’’ అంటున్నారు. అంత డేరింగ్ అండ్ డ్యాషింగ్. -
లవ్‌లో పడ్డ రాయ్‌లక్ష్మి
తమిళసినిమా: ఏదో ఒక సంచలన చర్యతో నిత్యం వార్తల్లో ఉండే నటి రాయ్‌లక్ష్మి. ఈత దుస్తులే కాదు ఎలాంటి గ్లామరస్ పాత్రనైనా చేయడానికి రెడీ అనే ఈ బ్యూటీ ఐటమ్ సాంగ్‌లకు సై అంటుంది. ఆ మధ్య క్రికెటర్ ధోనీతో డేటింగ్ అంటూ కలకలం సృష్టించిన రాయ్‌లక్ష్మి, ఇటీవల ధోని ఎవరూ అంటూ అందరికీ షాక్ ఇచ్చింది.ఆ తరువాత ధోని మంచి ఫ్రెండ్ అంటూ సవరించుకుందనుకోండి. ఈ అమ్మడు కోలీవుడ్ తెరపై కనిపించి చాలా కాలమే అయ్యింది. లారెన్స్ సరసన మొట్టశివ కెట్టశివ చిత్రంలో ఒక సింగిల్ సాంగ్‌లో నటించిన రాయ్‌లక్ష్మి ఆపై కోలీవుడ్, బాలీవుడ్ అంటూ చక్కర్లు కొడుతోంది. తెలుగులో చిరంజీవి 150వ చిత్రం ఖైధీనంబర్ 150లో రత్తాలు రత్తాలు అంటూ ఆయనతో చిందులేసి తెలుగు ప్రేక్షకులను కిర్రెక్కించిన రాయ్‌లక్ష్మి తాజాగా బాలీవుడ్లో జూలి–2 చిత్రంతో తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. అయితే ఆ చిత్ర టీజర్ ఈ మధ్య విడుదలైంది. అందులో రాయ్‌లక్ష్మి అందాల మోతకు సినీ జనాలు ఔరా ‘అంటూ ముక్కు మీద వేలేసుకుంటున్నారు. టీజరే ఇలా ఉంటే మెయిన్ పిక్చర్ ఎలా ఉంటుందోనన్న క్యూరియాసిటీ సినీ ప్రియుల్లోనూ నెలకొంది. ఈమె సినిమాల కథ ఇలా ఉంటే వ్యక్తిగతం విషయానికి వస్తే ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిందనే ప్రచారం సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. గత కొద్ది కాలంగా బాలీవుడ్లోనే మకాం పెట్టిన రాయ్‌లక్ష్మి, బాలీవుడ్ మోడల్, నటుడు హనీఫ్ హీలాల్ అనే అతనితో లవ్‌లో పడిపోయ్యిందట. తరచూ వీరిద్దరు డేట్ పేరుతో చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారనే ప్రచారం హోరెత్తుతోంది. దీనికి రాయ్‌లక్ష్మి ఎలా స్పందిస్తుందో చూడాలి. -
నెటిజన్లపై మండిపడ్డ హీరోయిన్ శ్రియ
చెన్నై: గ్లామర్ విషయంలో హీరోయిన్ శ్రియ కూడా చాలా చిత్రాలలో శృతి మించే నటించింది. అసలు అందానికి, అశ్లీలతకు తేడా ఏమిటన్న ప్రశ్నకు నటి శ్రియ ఆగ్రహంతో మండి పడింది. ఆమె ఏమన్నదంటే.. హీరోయిన్లు చీర కడితే వెంటనే పాత సంప్రదాయం అనేస్తారు. కాస్త మోడరన్ దుస్తులు ధరిస్తే అశ్లీలం, అసభ్యకరం అని విమర్శలు గుప్పిస్తారు. నిజం చెప్పాలంటే ఈ రెండింటిలోనూ దేనికదే అందం దాగుంటుంది. అది చూసే వారి దృష్టిని బట్టే ఉంటుంది. అయితే ప్రస్తుతం నెటిజన్లు మోడరన్ దుస్తులు ధరించిన హీరోయిన్ల గురించి చెడుగా రాసేస్తున్నారు. గ్లామర్‌గా కనిపిస్తే చెడ్డవాళ్లా అంటూ ప్రశ్నించింది. నిజం చెప్పాలంటే మేము మేముగానే ఉన్నాం. వ్యత్యాసం అనేది మీ కళ్లలోనే ఉంది. చీర కట్టినా, మోడ్రన్ దుస్తులు ధరించినా అందం అనేది ఒక్కటే అని తనదైన బాణీలో అందానికి శ్రియ నిర్వచనం చెప్పింది. ఇంటర్నెట్లో హాట్హీరోయిన్స్ అని టైప్ చేస్తే చాలు అర్ధ నగ్నం, నగ్నం హీరోయిన్ల చిత్రాలు కోకొల్లలుగా దర్శనమిస్తాయి. వాటిలో కొన్ని మార్పింగ్ ముఖాలు ఉంటాయి. కొందరు హీరోయిన్లు తమ అందాలను ఆరబోసే విధంగా కురచ దుస్తులు ధరించి ఫోటోలను తమ ఇస్ట్రాగ్రామ్లో పోస్ట్ చేసి ఫ్రీ పబ్లిసిటీ పొందేస్తున్నారు. హిందీ చిత్రం జులీ-2లో హీరోయిన్ రాయ్‌లక్ష్మీ నటించిన దృశ్యాలు అర్ధనగ్నానికి ఎక్కువ, నగ్నానికి కొంచెం తక్కువ అన్నట్లుగా ఉన్నాయి. అలాంటి అశ్లీల దృశ్యాలకు గ్లామర్ అనే పేరు పెట్టి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారనిపించక మానదు. -
‘జూలీ-2’పై ట్వీట్ల వర్షం
ముంబై/చెన్నై: పుష్కరకాలం కిందటే వెండితెరకు పరిచయమైన లక్ష్మీ రాయ్.. ఇప్పుడు రాయ్ లక్ష్మీ.. మంగళవారం ముంబై, చెన్నై నగరాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె నటించిన ‘జూలీ-2’ సినిమా టీజర్ ట్రైలర్.. గడిచిన కొద్దిగంటలుగా ఆ రెండు నగరాల్లో సోషల్ మీడియా ట్రెండింగ్‌గా నిలిచింది. బాలీవుడ్ ప్రేక్షకుల్లో రాయ్ లక్ష్మీ పేరు తెలియనివాళ్లు సైతం ‘జూలీ-2’కు ఫిదా అయిపోయామంటూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘ముంబైలో విపరీతమైన వర్షం కురుస్తోంది.. దానికి ఏమాత్రం తక్కువ కాకుండా ‘జూలీ-2’ టీజర్ వాట్సప్‌లో వరదలా ప్రవహిస్తోంది..’ అంటూ అభిమానులు చేస్తోన్న కామెంట్లను హీరోయిన్ రీట్వీట్లుగా మలుస్తున్నారు. థ్రిల్లర్ జానర్లో రూపుదిద్దుకున్న ‘జూలీ-2’కు దీపక్ శివ్‌దాసాని దర్శకనిర్మాత. 2004లో నేహా ధూపియా నటించిన ‘జూలీ’ సినిమాకు సీక్వెల్ ఇది. కొత్త జూలీగా రాయ్ లక్ష్మీ, ఇతర ప్రధాన పాత్రల్లో రతి అగ్నిహోత్రి, సాహిల్ సలాతియా, ఆదిత్య శ్రీవాస్తవ, రవి కిషన్, పంకజ్ త్రిపాఠి, నిశికాంత్ కామత్‌లు నటించారు. రాయ్ లక్ష్మీ 2015లో ‘జూలీ-2’కు సైన్ చేసినప్పటినుంచే ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో ఆసక్తినెలకొంది. ఇవాళ విడుదలైన టీజర్లో లక్ష్మీ ప్రదర్శించిన బోల్డ్నెస్.. జూలీ-2 మార్కెట్‌ను పీక్స్‌కు తీసుకెళుతుందనడంలో సందేహంలేదు. సెప్టెంబర్ 4న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. -
‘జూలీ-2’పై ట్వీట్ల వర్షం
-
బికినీ సుందరి!
నటీమణులు బికినీ దుస్తులు ధరించడానికి ఒకప్పుడు భయపడేవారు. ముఖ్యంగా ప్రముఖ కథానాయికలు తమ ఇమేజ్‌కి భంగం కలుగుతుందేమోనని ఈత దుస్తులు ధరించడానికి ససేమిరా అనే వారు. ఇక టూపీస్ దుస్తులు నర్తకీమణులే ధరించి అంగాంగ ప్రదర్శనలతో కుర్రకారును ఉర్రూతలూగించేవారు. అయితే ఈ సంస్కృతి రానురాను కథానాయకిలకు పాకింది. బికినీలు ధరించడానికి హీరోయిన్లు అధిక పారితోషికం డిమాండ్ చేసేవారు. అలాంటిది ఇప్పుడు ప్రముఖ హీరోయిన్లే ఐటమ్ గర్ల్‌గా మారిపోతున్నారు. అజిత్ బిల్లా చిత్రంలో నేటి టాప్ హీరోయిన్ నయనతార, సంచలన నటి నమిత ఈత దుస్తుల్లో పోటీ పడి కనిపించారు. ఆ తరువాత అలాంటి సన్నివేశాల్లో హీరోయిన్లు నటించడం అన్నది చాలా సర్వసాధారణం అయ్యిందనే చెప్పాలి. నటి రాయ్‌లక్ష్మీ విషయానికి కొస్తే ఒకప్పుడు హీరోయిన్. ఇప్పుడు ఎలాంటి పాత్రకైనా రెడీ అంటున్నారు. వచ్చిన అవకాశాన్ని వదిలే ప్రసక్తే లేదన్నట్లుగా మారిపోయారు.అలా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తూ తన కెరీర్‌ను బిజీగా ఉండేలా చూసుకుంటున్నారని చెప్పక తప్పదు. ఈ మధ్య తెలుగులో చిరంజీవితో సింగిల్ సాంగ్‌కు చిందేసిన రాయ్‌లక్ష్మి తనను తాను ప్రమోట్ చేసుకోవడంలో ఎప్పుడూ ముందుంటుంది. అలాంటి సందర్భం వస్తే మాత్రం చక్కగా ఉపయోగించుకుంటుందీ భామ. తాజాగా రాయ్‌లక్ష్మి నటిం చిన హిందీ చిత్రం జూలీ–2 చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. అందులో అమ్మడు అందాలారబోతలో ఇరగదీసిందట. టూపీస్ దుస్తుల్లో రకరకాల భంగిమల్లో స్విమ్ చేసి యువతను గిలిగింతలు పెట్టనుందట. జూలీ–2 చిత్ర ప్రచారంలో భాగంగా రాయ్లక్ష్మీనే స్వయంగా టూపీస్ దుస్తులు ధరించిన తన ఫొటోను ఇంటర్నెట్లో పోస్ట్ చేసింది. ఇప్పుడా ఫొటో సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తోంది. యువత అధికంగా లైక్ చేయడమే కాకుండా ఇతర హీరోయిన్ల ఈత దుస్తుల ఫొటోలను కూడా ఇంటర్నెట్లో పోస్ట్ చేసి ఏ నటి టాప్ అనే కాంటెస్ట్‌ను కూడా నిర్వహిస్తుండడం విశేషం. మొత్తం మీద రాయ్‌లక్ష్మీ ఈతదుస్తుల దృశ్యం యువతకు పెద్ద పనే పెట్టిందన్నమాట. -
ధోనీతో...డేటింగ్ చేసింది...నేనొక్కదాన్నేనా!
ఇండియన్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ, సౌత్ హీరోయిన్ రాయ్ లక్ష్మి మధ్య అప్పట్లో ఏం జరిగింది? ముంబయ్ మీడియాలో ఇప్పుడిదే హాట్ టాపిక్. ధోనీ జీవితంపై తీసిన సినిమా ‘ఎం.ఎస్. ధోని- ద అన్‌టోల్డ్ స్టోరీ’లో రాయ్ లక్ష్మితో అతడి రిలేషన్షిప్ గురించి ఉంటుందా? లేదా? అనే చర్చ జరుగుతోంది. ఈ చర్చకు కారణం ఏంటంటే.. ‘చెన్నై సూపర్‌కింగ్స్’ ఐపీయల్ టీమ్‌కి ధోనీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు, రాయ్ లక్ష్మి ఆ టీమ్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. అప్పట్లో ఇద్దరూ డేటింగ్ చేసుకున్నారు. ధోనీ మాజీ గర్ల్‌ఫ్రెండ్ ప్రియాంక గురించి ‘ఎం.ఎస్. ధోని’ ప్రచార చిత్రాల్లో చూపించడంతో, తాజాగా మళ్ళీ రాయ్ లక్ష్మి ప్రస్తావన కూడా వస్తోంది. ‘అకిరా’లో రాయ్ లక్ష్మి అతిథి పాత్రలో తళుక్కుమన్నారు. హిందీలో హీరోయిన్గా పరిచయమవుతున్న ‘జూలీ2’ త్వరలో విడుదల కానుంది. అయితే, మీడియా మాత్రం రానున్న ఈ సినిమాల గురించి కాక గతాన్ని గుర్తు చేయడం ఎందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రాయ్ లక్ష్మి చెప్పిన సంగతులు.. ధోనీ, నేనూ ఎప్పుడూ పెళ్లి చేసుకోవాలనుకోలేదు. ఆ ఆలోచన కూడా రాలేదు. ఏడాది కంటే తక్కువ రోజులే రిలేషన్షిప్లో ఉన్నాం. మా ఇద్దరి అభిప్రాయాలూ కలవలేదు. దాంతో విడిపోయాం. ఎనిమిదేళ్ల క్రితమే ఆ అధ్యాయం ముగిసింది. ఆ తర్వాత అతడితో టచ్‌లో లేను. అయినా, ధోనీ నాతో మాత్రమే డేటింగ్ చేయలేదు. నా తర్వాత చాలామంది అమ్మాయిలతో డేటింగ్ చేశాడు. చాలామందితో రిలేషన్షిప్లో ఉన్నాడు. ఆ జాబితా చాలా పెద్దదే. ఆ సంగతులు ఎలా ఉన్నా, అతని జీవిత కథా చిత్రం అంటే అమ్మాయిలు, డేటింగ్ మాత్రమే కాదు కదా. ఈ సినిమాలో ధోనీ జీవిత ముఖ్య ఘట్టాలు చూపిస్తారనుకుంటున్నా. అందులో నా ప్రస్తావన లేదనే అనుకుంటున్నా. ఒక క్రికెటర్‌తో సినిమా హీరోయిన్ డేటింగ్ కథ ఏంటో? తెలుసుకోవాలని అందరిలో ఆసక్తి ఉంటుంది. నావైపు నుంచి కథేంటో తెలుసుకోవాలని కొందరు ప్రయత్నించారు. కానీ, నేనేమీ చెప్పలేదు. ఏ అమ్మాయీ మరొకరి మాజీ గర్ల్ ఫ్రెండ్ అనిపించుకోవాలని కోరుకోదు.ఇప్పుడు ధోనీ పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నాడు. ఓ పాప కూడా పుట్టింది. అందుకే, ఇకపై ధోనీ గురించి అడిగితే, ‘క్రికెటర్‌గానే తెలుసు. వ్యక్తిగత పరిచయం లేదు’ అని చెబుతా. -
ఐటమ్ గర్ల్ గా రాయ్ లక్ష్మి
రాను రానంటూనే చిన్నదో అన్న పాట చందాన చేయను చేయను అంటూ మడి కట్టుకు కూర్చున్న నటి రాయ్‌లక్ష్మి ఇప్పుడు ఐటమ్ సాంగ్స్‌కు లెగ్ షేక్ చేయడానికి సిద్ధం అయిపోయారు. అదేమిటీ ఈ భామ ఇప్పటి వరకూ ఐటమ్ సాంగ్‌లో నటించలేదా? అని మీరడగొచ్చు. ఎందుకంటే ఇటీవల విడుదలైన తెలుగు చిత్రం సర్దార్ గబ్బర్‌సింగ్‌లో పవన్‌కల్యాణ్‌తో ఐటమ్ సాంగ్‌లో ఆడి పాడి దుమ్మురేపారు. కాగా ఈ అమ్మడు తమిళంలో సోలో హీరోయిన్ నుంచి, డబుల్ హీరోయిన్, తళుక్కున మెరిసే ప్రాధాన్యత లేని పాత్రల్లో కూడా నటించారు. అయితే ఐటమ్ సాంగ్‌లో నటించమని చాలా అవకాశాలు వచ్చినా ససేమిరా అన్నారు. అలాంటిది తాజాగా రాఘవ లారెన్స్‌తో సింగిల్ సాంగ్‌లో ఇరగదీశారు. ఇంతకు ముందు కాంచన చిత్రంలో ఆయనకు జంటగా నటించి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న రాయ్‌లక్ష్మి కాంచన-2లో కూడా తనకే హీరోయిన్ అవకాశం వస్తుందని ఆశించారు. అయితే అలా జరగలేదు. అలాగే ఆ తరువాత ఆమెకు సరైన హిట్ కూడా రాలేదు. అవకాశాలు కూడా అంతగా లేక పోవడంతో తెలుగులో పవన్‌కల్యాణ్‌తో ఐటమ్ సాంగ్‌కు రెడీ అన్నారు. ఇక తమిళంలో రాఘవ లారెన్స్ అడగడంతో నో అని చెప్పలేకపోయారట. వీరిద్దరి ఐటమ్ సాంగ్ త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్న మొట్టశివ కెట్టశివ చిత్రంలో చూడబోతున్నామన్న మాట. తెలుగు చిత్రం పటాస్‌కు రీమేక్‌గా తమిళంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సూపర్‌గుడ్ ఫిలింస్ పతాకంపై ఆర్బీ చౌదరి నిర్మిస్తున్నారు. సాయిరమణి దర్వకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో లారెన్స్‌కు జంటగా నిక్కీగల్రాణి నటిస్తున్నారు. ఇకపై రాయ్‌లక్ష్మిని మరిన్ని చిత్రాలలో ఐటమ్‌గర్ల్‌గా చూసే అవకాశం ఉంటుందని భావించవచ్చంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. -
ముందు శాంపిల్... తర్వాత ఫుల్!
పదేళ్లుగా తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో కథానాయికగా చేయడంతో పాటు అతిథి పాత్రలూ, ఐటమ్ సాంగులూ చేస్తూ రాయ్ లక్ష్మి బాగానే గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక్క హిందీ సినిమా అయినా చేయాలనీ, అది ఆషామాషీ సినిమా కాకూడదనీ ఎప్పట్నుంచో అనుకుంటున్నారామె. ఈ బ్యూటీ ఆశించిన విధంగానే బాలీవుడ్లో ఆమె ఎంట్రీ మామూలుగా జరగడంలేదు. సోనాక్షీ సిన్హా కథానాయికగా మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న హిందీ చిత్రం ‘అకిరా’లో అతిథి పాత్ర చేస్తున్నారామె. ఈ అతిథి పాత్ర చేయడం మొదలుపెట్టాక, ‘జూలీ 2’ అనే ఫిమేల్ ఓరియంటెడ్ మూవీలో అవకాశం దక్కింది. గతంలో హిందీలో నేహా ధూపియా చేసిన ‘జూలీ’కి ఇది సీక్వెల్ కాదు. ఇది వేరే కథతో రూపొందుతున్న చిత్రం. ఈ చిత్రానికి సంబంధించి రాయ్ లక్ష్మి ఫస్ట్ లుక్‌ని శనివారం విడుదల చేశారు. ‘‘ఇది శాంపిల్ మాత్రమే.. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆదివారం మరో లుక్ విడుదలవుతుంది’’ అని రాయ్ లక్ష్మి ట్విట్టర్లో పేర్కొన్నారు. చెప్పినట్లుగానే మరో లుక్‌ని వేలంటైన్స్ డే స్పెషల్‌గా ఆదివారం విడుదల చేశారు. ఈ రెండు లుక్స్‌కీ అద్భుతమైన స్పందన లభిస్తోంది. ‘సూపర్ హాట్ గాళ్.. లవ్లీ’ అంటూ రాయ్ లక్ష్మి అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. దీపక్ శివ్‌దాసాని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రాయ్ లక్ష్మి మొత్తం 25 నుంచి 30 రకాల లుక్స్‌లో, 90 రకాల కాస్ట్యూమ్స్‌లో కనిపిస్తారు. వాటిలో బికినీ కూడా ఉందని సమాచారం. నటిగా తనకిది 50వ చిత్రమనీ, ఈ చిత్రం ద్వారా కథానాయికగా హిందీ రంగానికి పరిచయం కావడం ఆనందంగా ఉందని రాయ్ లక్ష్మి అన్నారు. ఫస్ట్ లుక్ కోసం పది నుంచి పదకొండు కిలోల బరువు తగ్గారామె. ఆ తర్వాత తగ్గిన పది కిలోలతో పాటు అదనంగా ఇంకా బరువు పెరగమని దర్శకుడు అన్నారట. పాత్ర డిమాండ్ మేరకు రాయ్ లక్ష్మి తగ్గి, పెరిగారు. ‘‘ఓ కథానాయిక చుట్టూ సాగే చిత్రమిది. నటి కాకముందు ఆ అమ్మాయి జీవితం ఎలా ఉండేది? ఎలాంటి పరిస్థితుల్లో సినిమాల్లోకి రావాల్సి వచ్చింది. వచ్చాక ఏం జరిగింది? అనే కథతో ఈ చిత్రం సాగుతుంది. అయితే, ఇది ఏ కథానాయిక జీవితానికి సంబంధించిన కథ కాదు’’ అని రాయ్ లక్ష్మి పేర్కొన్నారు. ఆగస్ట్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
దయ్యాలంటే నాకు చాలా ఇష్టం
'నాకు దెయ్యాలంటే చాలా ఇష్టం'... వరుసగా దెయ్యాల చిత్రాలు చేస్తున్న నటి రాయ్ లక్ష్మీ అంటున్న మాటలివి. సంచలనాలకు కేంద్రబిందువుగా పేరున్న నటీమణుల్లో ఆమె ఒకరని చెప్పవచ్చు. తమిళ్, తెలుగు, మలయాళం,కన్నడం చిత్రాలంటూ దక్షిణాదిని చుట్టేసిన ఈ భామ తాజాగా బాలీవుడ్‌పై కన్నేశారు. ప్రస్తుతం అక్కడ నటిస్తున్న రాయ్ లక్ష్మీ నట జీవితం దశకం దాటింది. ఈ సందర్భంగా ఆమెతో చిన్న భేటీ. ప్రశ్న: ఈ పదేళ్లలో నటిగా మీ అనుభవం? జవాబు: ముఖ్యంగా చెప్పాలంటే నటిగా నేనిక్కడ చాలా నేర్చుకున్నాను. జయాపజయాలు రెండూ చవి చూశాను. విజయాలకు పొంగనూ లేదు. అపజయాలకు కృంగనూ లేదు.ఈ రెండిటికీ ఒకే రియాక్షన్ ఇవ్వాలని సినిమా నేర్పింది. తొలి రోజుల్లో మంచి కథా పాత్రలు లేని చిత్రాల్లో నటించాను. కారణం నేను ఎలాంటి సినీ నేపథ్యం లేనటువంటి కుటుంబం నుంచి వచ్చాను. ఇక్కడ నాకు గాడ్‌ఫాదర్ అంటూ ఎవరూ లేరు. అందుకు తోడు భాషా సమస్య ఒకటి. అలాంటి సినిమా ఇప్పుడు చాలా నేర్పింది. సినిమా అన్నది ఒక మహాసముద్రం.అందులో నేనూ అడుగెట్టాను. ప్రశ్న:మీ 50వ చిత్రం హింది చిత్రం అట? జ: అవును. అయితే ఆ చిత్ర వివరాలు నేనిప్పుడు బయట పెట్టలేను. త్వరలోనే ఫస్ట్‌లుక్ విడుదల ద్వారా ఆ చిత్ర యూనిట్నే వెల్లడించనున్నారు.అయితే అంతకు ముందుగా హిందిలో ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో అకిరా అనే చిత్రంలో అతిథి పాత్రలో నటించాను. ప్రశ్న:తమిళంలో కాంచన, అరణ్మణై, తాజాగా షావుకార్‌పేట్టై అంటే వరుసగా దెయ్యాల కథా చిత్రాల్లోనే నటిస్తునట్లున్నారు? జ: ప్రస్తుతం తమిళ చిత్రపరిశ్రమలో ఈ ట్రెండే నడుస్తోంది. సాధారణంగా ఒక ట్రెండ్ కొన్ని రోజులే నడుస్తుంది. ఈలోగానే అటాంటివి నేను మూడు చిత్రాలు చేసేశాను. వాటిలో కాంచన,అరణ్మణై చిత్రాలు మంచి విజయం సాధించాయి.షావుకార్‌పేట్టై చిత్రం త్వరలో విడుదల కానుంది.మరో విషయం ఏమిటంటే దెయ్యం కథా చిత్రాలంటే ఇష్టం.యాక్షన్ కథా చిత్రాలకంటే దెయ్యం కథా చిత్రాలు చూడడానికే నేను ఇష్ట పడతాను.అందుకేనేమో నాకిప్పుడు అలాంటి కథా చిత్రాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి. ప్రశ్న:మలయాళంలో మంచి పాత్రలు చేశారు. తమిళంలో ఇంకా గ్లామర్ పాత్రలకే పరిమితం అయ్యారే? జ: తమిళ చిత్రపరిశ్రమలో నా ఎంట్రీ అలాంటి పాత్రలతోనే అయ్యింది. మంచి పాత్రలు ఇచ్చి ఉండేవారేమోగానీ నా ఎంట్రీ గ్లామర్ పాత్రతో జరగడంతో అన్నీ ఆ తరహా పాత్రల అవకాశాలే వస్తున్నాయి. ధామ్‌ధూమ్ చిత్రం తరువాత నటనకు అవకాశం ఉన్న మంచి పాత్రలు వస్తాయని ఆశించాను. కానీ అలా జరగలేదు. ఇకపై అయినా దర్శక నిర్మాతలు మంచి పాత్రలు ఇస్తారని భావిస్తున్నాను. ప్రశ్న:ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు? జ: శ్రీకాంత్‌తో నటిస్తున్న షావుకార్‌పేట్టై చిత్రం పూర్తి కావచ్చింది.మలయాళ చిత్రానికి రీమేక్ అర్జున్ దివ్య మట్రుమ్ కార్తీక్ చిత్రం,ఇరు టిక్కెట్ల రెండు సినిమా లతో పాటు తెలుగులో పవన్ కల్యాణ్ సరసన సర్ధార్ గబ్భర్సింగ్ చిత్రం చేస్తున్నాను. ప్రశ్న:చివరి ప్రశ్న ప్రేమ, పెళ్లి విషయాల గురించి? జ: ప్రస్తుతం నేను ప్రేమిస్తోంది సినిమానే. బాలీవుడ్లో ఇప్పుడే ఎంటర్ అయ్యాను.అక్కడు చాలా చిత్రాలు చెయ్యాలి. ఆ తరువాతే ఇతర విషయాలు.పెళ్లి కచ్చితంగా చేసుకుంటాను.అయితే అంతకు ముందు కేరీర్‌ను డెవలప్ చేసుకోవాలి.ఆ తరువాతే పెళ్లి గురించి ఆలోచిస్తా. -
2014 కలిసొచ్చింది
కలిసొచ్చే కాలంలో అన్నీ జయాలేనంటారు. నటి రాయ్‌లక్ష్మి ప్రస్తుతం ఇలాంటి జోష్‌లోనే ఉన్నారు. తమిళం, తెలుగు, మలయాళం తదితర భాషల్లో నటిస్తున్న ఈ బ్యూటీకి సరైన విజయూలు రాలేదనే చెప్పాలి. ప్రతి మనిషికీ అదృష్టం అన్నది ఒక్కసారే తలుపు తడుతుందన్నట్లు ఈ సుందరికి ఇప్పుడు అదృష్టం వరించిందట. ఈ ఏడాది తమిళంలో నటించిన అరణ్మణై, మలయాళంలో మమ్ముట్టి సరసన నటించిన రాజాధిరాజా చిత్రాలు విజయం సాధించాయని రాయ్ లక్ష్మీఅంటున్నారట. తమిళం, మలయాళం భాషల్లో హిట్స్ రావడంతో 2014 తనకు బాగా కలిసొచ్చిందనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేస్తోంది. అంతేకాదు ఈ బ్యూటీ హీరోయిన్గా బాలీవుడ్‌కు చెందిన ఎస్ఎఎస్ అనే ప్రొడక్షన్ సంస్థ తమిళంలో ఒక భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోందట. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతికవర్గం వివరాలను త్వరలో ప్రకటించనుందట. నటి లక్ష్మీరాయ్ తన పేరును రాయ్‌లక్ష్మిగా మార్చుకున్న తరువాతే విజయాలు వరిస్తున్నాయి. అంటే అంతా పేరు మహిమే ననుకోవాలా?