ఐపీఎస్‌ ఝాన్సీ | Rai Lakshmi Jhansi IPS Movie Release on November 22nd | Sakshi
Sakshi News home page

ఐపీఎస్‌ ఝాన్సీ

Published Sun, Nov 3 2024 3:34 AM | Last Updated on Sun, Nov 3 2024 3:34 AM

Rai Lakshmi Jhansi IPS Movie Release on November 22nd

లక్ష్మీ రాయ్‌ లీడ్‌ రోల్‌లో నటించిన తాజా చిత్రం ‘ఝాన్సీ ఐపీఎస్‌’. గురుప్రసాద్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఆర్‌కే ఫిలిమ్స్‌ పతాకంపై డా. ప్రతాని రామకృష్ణ గౌడ్‌ తెలుగులో ఈ నెల 22న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రతాని రామకృష్ణ గౌడ్‌ మాట్లాడుతూ– ‘‘తమిళ్‌లో సూపర్‌ హిట్‌ అయిన ‘ఝాన్సీ ఐపీఎస్‌’ చిత్రాన్ని తెలుగులో రిలీజ్‌ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది.

లక్మీ రాయ్‌ త్రిపాత్రాభినయం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఆమె చేసిన మూడు క్యారెక్టర్స్‌ డిఫరెంట్‌ షేడ్స్‌లో ఉంటాయి. థ్రిల్లర్‌ మంజు కంపోజ్‌ చేసిన ఎనిమిది ఫైట్స్‌ ఆమె కెరీర్‌లో మైలురాయిగా నిలుస్తాయి. ‘కర్తవ్యం’ చిత్రంతో విజయశాంతిగారు లేడీ సూపర్‌ స్టార్‌గా ఎదిగారు. ఆ సినిమాలా మా ‘ఝాన్సీ ఐపీఎస్‌’ కూడా విజయం సాధిస్తుంది’’ అన్నారు. డాన్సర్, నటి ఆక్సాఖాన్, నటుడు జేవీఆర్‌ మాట్లాడారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement