‘జూలీ-2’పై ట్వీట్ల వర్షం | Rai Lakshmi Julie 2 teaser trailer goes viral | Sakshi
Sakshi News home page

హాట్‌ హాట్‌గా ‘జూలీ-2’ ట్రైలర్‌..

Published Tue, Aug 29 2017 6:04 PM | Last Updated on Sun, Sep 17 2017 6:06 PM

‘జూలీ-2’పై ట్వీట్ల వర్షం

‘జూలీ-2’పై ట్వీట్ల వర్షం

ముంబై/చెన్నై: పుష్కరకాలం కిందటే వెండితెరకు పరిచయమైన లక్ష్మీ రాయ్‌.. ఇప్పుడు రాయ్‌ లక్ష్మీ.. మంగళవారం ముంబై, చెన్నై నగరాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఆమె నటించిన ‘జూలీ-2’  సినిమా టీజర్ ట్రైలర్‌‌.. గడిచిన కొద్దిగంటలుగా ఆ రెండు నగరాల్లో సోషల్‌ మీడియా ట్రెండింగ్‌గా నిలిచింది.

బాలీవుడ్‌ ప్రేక్షకుల్లో రాయ్‌ లక్ష్మీ పేరు తెలియనివాళ్లు సైతం ‘జూలీ-2’కు ఫిదా అయిపోయామంటూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘ముంబైలో విపరీతమైన వర్షం కురుస్తోంది.. దానికి ఏమాత్రం తక్కువ కాకుండా ‘జూలీ-2’ టీజర్‌ వాట్సప్‌లో వరదలా ప్రవహిస్తోంది..’  అంటూ అభిమానులు చేస్తోన్న కామెంట్లను హీరోయిన్‌ రీట్వీట్లుగా మలుస్తున్నారు.

థ్రిల్లర్‌ జానర్‌లో రూపుదిద్దుకున్న ‘జూలీ-2’కు దీపక్‌ శివ్‌దాసాని దర్శకనిర్మాత. 2004లో నేహా ధూపియా నటించిన ‘జూలీ’  సినిమాకు సీక్వెల్‌ ఇది. కొత్త జూలీగా రాయ్‌ లక్ష్మీ, ఇతర ప్రధాన పాత్రల్లో రతి అగ్నిహోత్రి, సాహిల్‌ సలాతియా, ఆదిత్య శ్రీవాస్తవ, రవి కిషన్‌, పంకజ్‌ త్రిపాఠి, నిశికాంత్‌ కామత్‌లు నటించారు.

రాయ్‌ లక్ష్మీ 2015లో ‘జూలీ-2’కు సైన్‌ చేసినప్పటినుంచే ఈ సినిమాపై ట్రేడ్‌ వర్గాల్లో ఆసక్తినెలకొంది. ఇవాళ విడుదలైన టీజర్‌లో లక్ష్మీ ప్రదర్శించిన బోల్డ్‌నెస్‌.. జూలీ-2 మార్కెట్‌ను పీక్స్‌కు తీసుకెళుతుందనడంలో సందేహంలేదు. సెప్టెంబర్‌ 4న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement