
2014 కలిసొచ్చింది
కలిసొచ్చే కాలంలో అన్నీ జయాలేనంటారు. నటి రాయ్‌లక్ష్మి ప్రస్తుతం ఇలాంటి జోష్‌లోనే ఉన్నారు. తమిళం, తెలుగు, మలయాళం తదితర భాషల్లో నటిస్తున్న ఈ బ్యూటీకి సరైన విజయూలు రాలేదనే చెప్పాలి. ప్రతి మనిషికీ అదృష్టం అన్నది ఒక్కసారే తలుపు తడుతుందన్నట్లు ఈ సుందరికి ఇప్పుడు అదృష్టం వరించిందట. ఈ ఏడాది తమిళంలో నటించిన అరణ్మణై, మలయాళంలో మమ్ముట్టి సరసన నటించిన రాజాధిరాజా చిత్రాలు విజయం సాధించాయని రాయ్ లక్ష్మీఅంటున్నారట. తమిళం, మలయాళం భాషల్లో హిట్స్ రావడంతో 2014 తనకు బాగా కలిసొచ్చిందనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేస్తోంది. అంతేకాదు ఈ బ్యూటీ హీరోయిన్‌గా బాలీవుడ్‌కు చెందిన ఎస్‌ఎఎస్ అనే ప్రొడక్షన్ సంస్థ తమిళంలో ఒక భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోందట. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతికవర్గం వివరాలను త్వరలో ప్రకటించనుందట. నటి లక్ష్మీరాయ్ తన పేరును రాయ్‌లక్ష్మిగా మార్చుకున్న తరువాతే విజయాలు వరిస్తున్నాయి. అంటే అంతా పేరు మహిమే ననుకోవాలా?