ముంబయి : గతంలో ఎన్నో సినిమాలు చేసినా ఆమెకు అంతగా కలిసిరాలేదు. దాంతో పేరులో కాస్త మార్పుచేసుకుంది. ప్రస్తుతం వరుస మూవీలతో పాటు సోషల్ మీడియాను ఆమె పాటలు, ట్రైలర్ల వీడియోలు ఊపేస్తున్నాయి. ఆమె మరెవరో కాదు.. ‘జూలీ 2’ రాయ్ లక్ష్మీ. అదృష్టం కలిసిరాకపోవడంతో తన పేరును లక్ష్మీ రాయ్ నుంచి రాయ్ లక్ష్మీగా మార్పు చేసుకున్న ఈ భామ గత కొంత కాలంగా యూట్యూబ్‌లో హవా కొనసాగిస్తోంది. ఓవరాల్‌గా ఆమెకు సంబంధించిన ఈ వీడియోలు ఏకంగా 5.5 కోట్ల వ్యూస్ సంపాదించుకోవడం విశేషం. దీంతో ఆమె యూట్యూబ్ క్వీన్ అంటూ నటి అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.
టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి చాలా గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెంబర్ 150లో ఆయన సరసన ‘రత్తాలు రత్తాలు..’ అంటూ కాలు కదిపింది ఈ బ్యూటీ. ఈ పాటకు 12మిలియన్ల (1.2కోట్లు) వ్యూస్ వచ్చాయి. రాయ్‌లక్ష్మీ ఎంతో స్లిమ్‌గా మారడంతో పాటు గ్లామర్ రూటు మార్చి నటించిన చిత్రం జూలీ2 ట్రైలర్లు ఆమె బోల్డ్‌నెస్‌తో హల్‌చల్ చేశాయి. ఈ మూవీ టీజర్ 89 లక్షల వ్యూస్‌తో సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. అదేవిధంగా ట్రైలర్-1ను 6.7 మిలియన్ల మంది చూడగా, ట్రైలర్-2కు 4.7 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. హరహరమహాదేవకి- 15 మిలియన్లు, ఓ జూలీకి 2.3 మిలియన్లు, కోయి హౌస్లాకు-1.9 మిలియన్లు, మలా సీన్‌హాకు 3.6 మిలియన్ల వీక్షకులతో 2017లో రాయ్‌లక్ష్మీ జోరు అంటూ కామెంట్లు వస్తున్నాయి.
2017 Golden year for raai😍 @iamlakshmirai 's video songs ruling YouTube like a boss😍
— RAAI LAXMI DEVOTEE (@RaaiLaxmiFan) 8 November 2017
Ratthalu - 12M
Haraharamahadevaki - 15M
Oh Julie - 2.3M
Koi hausla - 1.9M
Mala seenha - 3.6M
Julie2 teaser - 8.9M
Trailer 1 - 6.7M
Trailer 2 - 4.7M
Total - 55M🙏queen of Youtube#Iduppazhagi pic.twitter.com/oPvMjxkQRA
Comments
Please login to add a commentAdd a comment