రెండు నెలల్లో... రాయ్‌...రాజా... రాయ్‌... | lakshmi rai Transformation Physics | Sakshi
Sakshi News home page

రెండు నెలల్లో... రాయ్‌...రాజా... రాయ్‌...

Published Wed, Nov 8 2017 11:30 PM | Last Updated on Thu, Nov 9 2017 5:31 AM

 lakshmi rai  Transformation Physics - Sakshi

జూలీ 2 అనే బాలీవుడ్‌ శృంగార చిత్రంలో సరికొత్త నాజూకు అందాల ‘లక్ష్మీరాయ్‌’మనకి పరిచయమవుతుంది. అందాల తారగా వెలుగుతున్న లక్ష్మీరాయ్‌...ఇప్పుడు బాలీవుడ్‌లో ట్రాన్స్‌ఫార్మేషన్‌ ఫిజిక్స్‌ ఉన్న అతి కొద్ది మంది టాప్‌ సెలబ్రిటీస్‌ల లిస్ట్‌లో ఒకరు. కేవలం రెండు నెలల్లో తన ఫిజిక్‌ను అమాంతం మార్చేసుకున్న ఈ తార చెబుతున్న ట్రాన్స్‌ఫార్మేషన్‌ కబుర్లివే.

స్టడీ...రెడీ... గో
 చిన్నప్పటి నుంచి చురుకైన దానిని. క్రీడాకారిణిని కూడా. చూడడానికి ఫిట్‌గానే ఉండేదాన్ని. అయితే రెండేళ్ల  నుంచే నా శరీరం వేగంగా బరువు పెరగడం ప్రారంభమైంది.  చాలా డైట్‌ప్లాన్స్‌ ప్రయత్నించాను. జిమ్‌కు కూడా వెళ్లాను. అయితే ఏవీ నాకు సరైన ఫలితాన్ని అందివ్వలేదు. ఇలా కాదని ఓ రేంజ్‌లో రీసెర్చ్‌ స్టార్ట్‌ చేశాను. నా మెటబాలిజం రేట్‌ చాలా నిదానంగా ఉంటోంది. ఈ విషయం మీద కూడా స్టడీ చేశాను. దాని ప్రకారం కార్బోహైడ్రేట్స్‌ను పూర్తిగా త్యజించి, ప్రొటీన్‌ డైట్‌కి మళ్లాను. చపాతీలు  మానేశాను. ఉడకబెట్టిన కాయగూరలు, చికెన్‌ వంటి ప్రొటీన్‌ ఫుడ్‌ తీసుకున్నాను.

షూట్‌ ఎట్‌ వెయిట్‌
బరువు తగ్గడం అంత సులభమైన ప్రక్రియ కాదు. దీన్నో సవాల్‌గా తీసుకున్నాను. నిజానికి అటు నటన కొనసాగిస్తూనే ఈ ట్రాన్స్‌ఫార్మేషన్‌ ప్లాన్‌ అమలు చేయవచ్చునేమో... కాని  పూర్తిగా దీని మీదే దృష్టి పెట్టాలని అనుకున్నాను. షూటింగ్‌ నుంచి రెండున్నర నెలలు గ్యాప్‌ తీసుకున్నాను.  రెండేళ్లలో పెంచుకున్న అదనపు వెయిట్‌ని ఈ బ్రేక్‌లో తగ్గించాలని డిసైడ్‌ అయ్యాను.

అలవాటు కావాలంటే...
ఏ కొత్త వ్యాపకం అయినా ఒక అలవాటుగా మారాలంటే 21 రోజులు చాలు. ఆ తర్వాత అది మన రోజువారీ జీవనశైలిలో భాగం అయిపోతుంది. నిజానికి నేను ఫుడీని (భోజనప్రియురాలిని). డైట్‌ విషయంలో మార్పు చేర్పులు చేసుకుని దాన్ని ఒక అలవాటుగా మార్చుకునేందుకు ప్రయత్నించి 10వ రోజునే బ్రేక్‌ ఇచ్చిన అనుభవాలు నాకు ఉన్నాయి. అయితే ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కాదన్నంత డూ ఆర్‌ డై సిట్యుయేషన్‌ నాకు నేను ఏర్పరచుకున్నాక... 10వ రోజును విజయవంతంగా అధిగమించి అదే ఊపులో  కొనసాగించగలిగాను. చివరికి 15 కిలోల బరువును తగ్గించుకోగలిగాను.

వెయిట్‌లాస్‌... హ్యాపీనెస్‌ గెయిన్‌
ప్రస్తుతం నేను నటించే ఒక మలయాళ చిత్రంలో  బైకర్‌ పాత్ర నాది. టోన్డ్‌ లుక్‌ కావాలి కాబట్టి ఈ పాత్ర కోసం నేను కాస్త బరువు తగ్గాలని ఆ సినిమా డైరెక్టర్‌ సూచించారు. అయితే నేను బాగా వెయిట్‌ లాస్‌ అయ్యేటప్పటికి తొలిరోజు షూటింగ్‌లో వెంటనే ఆయన నన్ను గుర్తు పట్టలేకపోయారు. ఆ తర్వాత కూడా ఈ అనుభవం నాకు చాలా మంది దగ్గర ఎదురైంది. దీన్ని నేను ఎంజాయ్‌ చేస్తున్నాను. ఇప్పుడు ప్రశాంతంగా పార్టీస్‌కి వెళ్లగలుగుతున్నాను. మరింత కాన్ఫిడెంట్‌గా, చురుగ్గా ఉండగలుగుతున్నాను.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement