‘‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ’ చిత్రం మా యూనిట్‌కి స్పెషల్. ఎందుకంటే ఈ సినిమా కోసం అంతా చాలా హార్డ్ వర్క్ చేశాం. ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు కామెడీ ఉంది. సినిమాలంటే ప్యాషన్ ఉండే నిర్మాతలు అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో శ్రీధర్ రెడ్డి ఒకరు’’ అని రాయ్‌లక్ష్మీ అన్నారు. రామ్‌కార్తీక్, పూజిత పొన్నాడ జంటగా రాయ్‌లక్ష్మీ ప్రధాన పాత్రలో కిషోర్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ’. గురునాథ రెడ్డి సమర్పణలో ఎం.శ్రీధర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, ఆర్.కె.రెడ్డి నిర్మించారు. హరి గౌడ స్వరపరచిన ఈ సినిమా పాటల్ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘కిషోర్ కథ చెప్పినప్పుడు ఎంత ఎగై్జట్ అయ్యామో సినిమా మేకింగ్‌లోనూ అంతే ఎగై్జట్ అయ్యాం’’ అన్నారు గుర్నాధరెడ్డి.
‘‘మాకు తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి పెద్దగా అవగాహన లేదు. మంచి సినిమా చేద్దాం, నేను ముందుండి చూసుకుంటానని శ్రీధర్ రెడ్డి చెప్పడంతో సరే అని ఈ సినిమా తీశాం’’ అన్నారు ఆనంద్ రెడ్డి. ‘‘సినిమా ఇండస్ట్రీ అంతా మాయ.. వద్దు’ అని మాకు తెలిసినవాళ్లు చెప్పారు. కానీ ఇక్కడ మాకెలాంటి చెడు కనపడలేదు. మంచి కథతో చక్కని టీమ్‌తో పనిచేస్తే తప్పకుండా మంచి అవుట్‌పుట్ వస్తుందనడంలో సందేహం లేదు’’ అన్నారు శ్రీధర్ రెడ్డి. ‘‘నాకు మంచి నిర్మాతలు దొరికారు’’ అన్నారు కిషోర్ కుమార్ చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌర, రచయిత కిరణ్ పాల్గొన్నారు.
అంతా మాయ.. సినిమాలు వద్దన్నారు – శ్రీధర్‌రెడ్డి
Published Thu, Feb 21 2019 12:17 AM | Last Updated on Thu, Feb 21 2019 12:17 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment