దయ్యాలంటే నాకు చాలా ఇష్టం | interview with lakshmi rai | Sakshi
Sakshi News home page

దయ్యాలంటే నాకు చాలా ఇష్టం

Published Sat, Sep 12 2015 10:43 AM | Last Updated on Wed, Apr 3 2019 8:58 PM

దయ్యాలంటే నాకు చాలా ఇష్టం - Sakshi

దయ్యాలంటే నాకు చాలా ఇష్టం

'నాకు దెయ్యాలంటే చాలా ఇష్టం'... వరుసగా దెయ్యాల చిత్రాలు చేస్తున్న నటి రాయ్ లక్ష్మీ అంటున్న మాటలివి. సంచలనాలకు కేంద్రబిందువుగా పేరున్న నటీమణుల్లో ఆమె ఒకరని చెప్పవచ్చు. తమిళ్, తెలుగు, మలయాళం,కన్నడం చిత్రాలంటూ దక్షిణాదిని చుట్టేసిన ఈ భామ తాజాగా బాలీవుడ్‌పై కన్నేశారు. ప్రస్తుతం అక్కడ నటిస్తున్న రాయ్ లక్ష్మీ నట జీవితం దశకం దాటింది. ఈ సందర్భంగా ఆమెతో చిన్న భేటీ.
 
ప్రశ్న: ఈ పదేళ్లలో నటిగా మీ అనుభవం?

జవాబు: ముఖ్యంగా చెప్పాలంటే నటిగా నేనిక్కడ చాలా నేర్చుకున్నాను. జయాపజయాలు రెండూ చవి చూశాను. విజయాలకు పొంగనూ లేదు. అపజయాలకు కృంగనూ లేదు.ఈ రెండిటికీ ఒకే రియాక్షన్ ఇవ్వాలని సినిమా నేర్పింది. తొలి రోజుల్లో మంచి కథా పాత్రలు లేని చిత్రాల్లో నటించాను. కారణం నేను ఎలాంటి సినీ నేపథ్యం లేనటువంటి కుటుంబం నుంచి వచ్చాను. ఇక్కడ నాకు గాడ్‌ఫాదర్ అంటూ ఎవరూ లేరు. అందుకు తోడు భాషా సమస్య ఒకటి. అలాంటి సినిమా ఇప్పుడు చాలా నేర్పింది. సినిమా అన్నది ఒక మహాసముద్రం.అందులో నేనూ అడుగెట్టాను.
 
ప్రశ్న:మీ 50వ చిత్రం హింది చిత్రం అట?
జ: అవును. అయితే ఆ చిత్ర వివరాలు నేనిప్పుడు బయట పెట్టలేను. త్వరలోనే ఫస్ట్‌లుక్ విడుదల ద్వారా ఆ చిత్ర యూనిట్‌నే వెల్లడించనున్నారు.అయితే అంతకు ముందుగా హిందిలో ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో అకిరా అనే చిత్రంలో అతిథి పాత్రలో నటించాను.
 
ప్రశ్న:తమిళంలో కాంచన, అరణ్మణై, తాజాగా షావుకార్‌పేట్టై అంటే వరుసగా దెయ్యాల కథా చిత్రాల్లోనే నటిస్తునట్లున్నారు?
జ: ప్రస్తుతం తమిళ చిత్రపరిశ్రమలో ఈ ట్రెండే నడుస్తోంది. సాధారణంగా ఒక ట్రెండ్ కొన్ని రోజులే నడుస్తుంది. ఈలోగానే అటాంటివి నేను మూడు చిత్రాలు చేసేశాను. వాటిలో కాంచన,అరణ్మణై చిత్రాలు మంచి విజయం సాధించాయి.షావుకార్‌పేట్టై చిత్రం త్వరలో విడుదల కానుంది.మరో విషయం ఏమిటంటే దెయ్యం కథా చిత్రాలంటే ఇష్టం.యాక్షన్ కథా చిత్రాలకంటే దెయ్యం కథా చిత్రాలు చూడడానికే నేను ఇష్ట పడతాను.అందుకేనేమో నాకిప్పుడు అలాంటి కథా చిత్రాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి.
 
ప్రశ్న:మలయాళంలో మంచి పాత్రలు చేశారు. తమిళంలో ఇంకా గ్లామర్ పాత్రలకే పరిమితం అయ్యారే?
జ: తమిళ చిత్రపరిశ్రమలో నా ఎంట్రీ అలాంటి పాత్రలతోనే అయ్యింది. మంచి పాత్రలు ఇచ్చి ఉండేవారేమోగానీ నా ఎంట్రీ గ్లామర్ పాత్రతో జరగడంతో అన్నీ ఆ తరహా పాత్రల అవకాశాలే వస్తున్నాయి. ధామ్‌ధూమ్ చిత్రం తరువాత నటనకు అవకాశం ఉన్న మంచి పాత్రలు వస్తాయని ఆశించాను. కానీ అలా జరగలేదు. ఇకపై అయినా దర్శక నిర్మాతలు మంచి పాత్రలు ఇస్తారని భావిస్తున్నాను.
 
ప్రశ్న:ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు?

జ: శ్రీకాంత్‌తో నటిస్తున్న షావుకార్‌పేట్టై చిత్రం పూర్తి కావచ్చింది.మలయాళ చిత్రానికి రీమేక్ అర్జున్ దివ్య మట్రుమ్ కార్తీక్ చిత్రం,ఇరు టిక్కెట్ల రెండు సినిమా లతో పాటు తెలుగులో పవన్ కల్యాణ్ సరసన సర్ధార్ గబ్భర్‌సింగ్ చిత్రం చేస్తున్నాను.
 
ప్రశ్న:చివరి ప్రశ్న ప్రేమ, పెళ్లి విషయాల గురించి?
జ: ప్రస్తుతం నేను ప్రేమిస్తోంది సినిమానే. బాలీవుడ్‌లో ఇప్పుడే ఎంటర్ అయ్యాను.అక్కడు చాలా చిత్రాలు చెయ్యాలి. ఆ తరువాతే ఇతర విషయాలు.పెళ్లి కచ్చితంగా చేసుకుంటాను.అయితే అంతకు ముందు కేరీర్‌ను డెవలప్ చేసుకోవాలి.ఆ తరువాతే పెళ్లి గురించి ఆలోచిస్తా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement