
...అంటున్నారు రాయ్ లక్ష్మీ. దాంతో అభిమానులందరూ ‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకున్నారు. మరి, సుకుమారి గాయపడితే ఫ్యాన్స్ బాధపడిపోరూ! ‘రిస్క్ వద్దమ్మా... డూప్‌తోకానిచేద్దాం’ అని యూనిట్ సభ్యులు అన్నప్పటికీ ‘నేను రిస్కే తీసుకుంటా’ అని రాయ్ లక్ష్మీ రెడీ అయిపోయారట. ఆమె నటిస్తోన్న తాజా తమిళ చిత్రం షూటింగ్ ఈ మధ్యే మొదలైంది.ఫైట్ సీన్స్ తీస్తున్నారు. కొంచెం రిస్క్ అయినప్పటికీ రాయ్ లక్ష్మీ ఈ ఫైట్స్‌ని తానే చేస్తున్నారు.ఈ సీన్స్ తీస్తున్నప్పుడు ఆమె మోకాలికి గాయమైంది.
‘‘డూప్ లేకుండా యాక్షన్ సీక్వెన్స్ చేయడం నాకిష్టం. అలా ట్రై చేసి, చాలాసార్లు గాయపడ్డాను. మళ్లీ ట్రై చేసి గాయపడ్డాను. బట్‌నథింగ్ టు వర్రీ. సేఫ్ అండ్ ఫైన్’’ అని రాయ్ లక్ష్మీ పేర్కొన్నారు. మరి... ఇంతటితో రిస్కులు తీసుకోవడం మానేస్తారా? అనడిగితే... ‘‘అస్సలు మానను. అవసరమైతే ఇంకా రిస్కులు తీసుకుంటా’’ అంటున్నారు. అంత డేరింగ్ అండ్ డ్యాషింగ్.
Comments
Please login to add a commentAdd a comment