నమ్మకముంటే ఏదైనా సాధించవచ్చు.. | Rai Laxmi Worked Hard For His Fitness | Sakshi
Sakshi News home page

నమ్మకముంటే ఏదైనా సాధించవచ్చు..

Published Thu, Jul 18 2019 4:19 PM | Last Updated on Thu, Jul 18 2019 5:00 PM

Rai Laxmi Worked Hard For His Fitness - Sakshi

చెన్నై: సినిమా విజయాలు అంతంత మాత్రాన ఉన్న  తన అందచందాలతో అభిమానులను అకట్టుకునే  రాయ్ లక్ష్మి  ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్‌ హాట్‌గా బికినీ వీడియో పోస్ట్‌ చేసి అందరిని అవాక్కయ్యేలా చేసింది. ఇటీవల రాయ్ లక్ష్మి నటించిన బాలీవుడ్‌ చిత్రం జూలీ2 ఆమెకు తీవ్ర నిరాశను మిగిల్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడటంతో అభిమానులు డీలా పడ్డా... రాయ్‌ లక్ష్మీ తన పర్ఫామెన్స్‌తో అందరిని ఆకట్టుకుంది.

ఈ క్రమంలో సినిమాల ఫలితం ఎలా ఉన్నా తాను ఎల్లప్పుడూ వర్కవుట్లు చేస్తూ ఫిజిక్‌ను కాపాడుకుంటానని లక్ష్మి తెలిపింది. ప్రస్తుతం మునుపటి కంటే అందంగా ఉన్నావని.. నన్నొక కొత్త వ్యక్తిలా ఉన్నావని అందరూ చెబుతుంటే ఎంతో సంతోషంగా ఉందని పేర్కొంది. ఇప్పుడు తన శరీర సౌందర్యం మరింతగా ఇనుమడించడమే కాకుండా మానసికంగా కూడా దృడంగా ఉన్నానని  చెప్పింది. మనపై మనకు పూర్తి నమ్మకముంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చని రాయ్‌ లక్ష్మీ చెప్పుకొచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement