Julie -2
-
నమ్మకముంటే ఏదైనా సాధించవచ్చు..
చెన్నై: సినిమా విజయాలు అంతంత మాత్రాన ఉన్న తన అందచందాలతో అభిమానులను అకట్టుకునే రాయ్ లక్ష్మి ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ హాట్‌గా బికినీ వీడియో పోస్ట్ చేసి అందరిని అవాక్కయ్యేలా చేసింది. ఇటీవల రాయ్ లక్ష్మి నటించిన బాలీవుడ్ చిత్రం జూలీ2 ఆమెకు తీవ్ర నిరాశను మిగిల్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో అభిమానులు డీలా పడ్డా... రాయ్ లక్ష్మీ తన పర్ఫామెన్స్తో అందరిని ఆకట్టుకుంది. ఈ క్రమంలో సినిమాల ఫలితం ఎలా ఉన్నా తాను ఎల్లప్పుడూ వర్కవుట్లు చేస్తూ ఫిజిక్‌ను కాపాడుకుంటానని లక్ష్మి తెలిపింది. ప్రస్తుతం మునుపటి కంటే అందంగా ఉన్నావని.. నన్నొక కొత్త వ్యక్తిలా ఉన్నావని అందరూ చెబుతుంటే ఎంతో సంతోషంగా ఉందని పేర్కొంది. ఇప్పుడు తన శరీర సౌందర్యం మరింతగా ఇనుమడించడమే కాకుండా మానసికంగా కూడా దృడంగా ఉన్నానని చెప్పింది. మనపై మనకు పూర్తి నమ్మకముంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చని రాయ్ లక్ష్మీ చెప్పుకొచ్చింది. -
ప్రతిసారీ గదిలో ఒంటరిగా కూర్చుని ఏడ్చేదాన్ని!
సాక్షి, చెన్నై : నేను ప్రేమలో ఎన్ని సార్లు ఓడిపోయానో తెలుసా? అంటోంది నటి రాయ్‌లక్ష్మీ. సంచలనాలకు కేంద్రబిందువుగా ముద్రపడిన ఈ బహుభాషా నటి తరచూ ఏదో ఇక వివాదాస్పద వ్యాఖ్యలతో కలకలం పుట్టిస్తూనే ఉంటుంది. కొన్నేళ్ల కిందట టీమిండియా క్రికెటర్ ధోనితో డేటింగ్ అంటూ రాయ్‌లక్ష్మీ గురించి హాట్ హాట్ ప్రచారం జరిగింది. తాజాగా హిందీ చిత్రం జూలీ-2 చిత్ర ట్రైలర్లో తన అందాలతో మరోసారి వార్తల్లో నానుతోంది. ఇటీవల నటి మరిన్ని విషయాలపై చర్చించారు. ‘జూలీ-2 చిత్రంలో నేను గ్లామరస్‌గా నటించాననే ప్రచారం జరుగుతోంది. చిత్ర ట్రైలర్‌ను చూసిన వారు అలా అనుకోవడంలో తప్పులేదు. అయితే చిత్రం పూర్తిగా చూసిన వారు నా పాత్రను చూసి అయ్యో పాపం అనుకుంటారు. అందులో నాన్న చనిపోతారు. అమ్మ రెండో పెళ్లి చేసుకుంటుంది. అమ్మ రెండో భర్త నన్ను బయటకి వెళ్లి సంపాదించుకురా అని తరిమేస్తాడు. అలా ఎంతో కష్టపడి పోరాడి నటిగా నిలదొక్కుకుంటున్నాను. సినీరంగంలో ఇటీవల అత్యాచారాల గురించి చాలా మంది హీరోయిన్లు బహిరంగంగా వెల్లడిస్తున్నారని అయితే తనకలాంటి అనుభవం ఎదురు కాలేదు. తనను దర్శకుడు ఆర్వీ ఉదయకుమార్ కర్క కచడర చిత్రం ద్వారా కోలీవుడ్‌కు హీరోయిన్గా పరిచయం చేశారని, ఆ తరువాత అవకాశాలు లేక నాలుగేళ్లు పోరాడాల్సి వచ్చింది. ఆ సమయంలో నాకు సెక్స్ సంబంధాల గురించి నర్మగర్భంగా అర్ధమైంది. అనుసరించి పోవాలని కొందరు చెప్పారు. అలా చేస్తే నేనిప్పుడు సూపర్ హీరోయిన్ అయ్యేదాన్ని. అప్పట్లో నాకు తమిళ భాషలో ఒక్క పదం కూడా తెలిసేది కాదు. కొందరు నాపై దుష్ప్రచారం చేసేవారు. ఇక ప్రేమలో నేను ఐదుసార్లు ఓడిపోయాను. అలా ఓడిన ప్రతిసారీ గదిలో కూర్చుని ఏడ్చేదాన్ని. మగవారిలో మంచివాళ్లు ఎక్కువే, కొందరు చెడ్డవాళ్లు ఉన్నారు. నటుడు ఆర్య నాకు చాలా కాలంగా మంచి స్నేహితుడు మాత్రమే. నాకు రాజకీయాలు తెలియనందుకే ఆ రంగంలోకి వచ్చే ఆలోచనే లేదని’ తన మనసులో మాటను రాయ్‌లక్ష్మీ స్పష్టం చేసింది. -
జూలీ–2లో రాయ్‌లక్ష్మీ విజృంభణ
తమిళసినిమా: బాలీవుడ్ చిత్రం జాలీ–2లో నటి రాయ్‌లక్ష్మీ విజృంభణను చూడవచ్చు. ఏ విషయంలో విజృంభణ అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా కాలంగా అవకాశాలే లక్ష్యంగా గ్లామర్ విషయంలో హద్దులు మీరి నటిస్తున్న నటి రాయ్‌లక్ష్మీ. ఇప్పటి వరకూ తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం అంటూ దక్షిణాది భాషల్లో 50కి పైగా చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ ఏ భాషలోనూ హీరోయిన్గా సరైన స్థాయికి చేరుకోలేకపోయింది. దీంతో ఐటమ్ సాంగ్స్ చేయడానికి కూడా ఏ మాత్రం వెనుకాడటం లేదు. ఆ మధ్య తెలగు చిత్రం ఖైదీ నంబర్‌వన్ చిత్రంలో బాసూ చూపించు నీ గ్రేస్ అంటూ ఐటమ్ సాంగ్‌లో మెగాస్టార్ చిరంజీవిని తన విచ్చల విడి అందాలతో రెచ్చగొట్టి కుర్రకారును గిలిగింతలు పెట్టిన రాయ్‌లక్ష్మీకి బాలీవుడ్లో అవకాశాలు రాబట్టాలన్నది చిరకాల వాంఛ. దీంతో ఆ మధ్య అక్కడే మకాం పెట్టి ఎట్టకేలకు జూలీ–2 చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. కాగా ఆ చిత్ర ట్రైలర్ సోమవారం విడుదలైంది. అందులో రాయ్‌లక్ష్మీ హాట్ దృశ్యాలను చూసి సినీ వర్గాలే విస్తు పోతున్నారు. గ్లామర్ అనే పదానికే అర్థాన్ని రాయ్‌లక్ష్మీ మార్చేసిందనే కామెంట్స్ హల్చల్ చేస్తున్నాయి. ఈత దుస్తులు మొదలుకొని ఎన్ని రకాలుగా శృంగారంగా కనిపించాలో అన్ని విధాలుగా జూలీ–2లో నటి రాయ్‌లక్ష్మీ విజృంభించి నటించింది. మొత్తం మీద ఈ చిత్రం సెన్సార్ సభ్యులకు చేతినిండా పని చెప్పేలా ఉంది.