![Rai Lakshmi Fires On Rumors About Pregnancy - Sakshi](/styles/webp/s3/article_images/2019/05/4/rai.jpg.webp?itok=cjoUT7Uv)
టీ.నగర్: ఎమీజాక్సన్, సమీరారెడ్డి గర్భంతో ఉన్నట్లు ఇంటర్నెట్‌లో సమాచారం చెక్కర్లు కొడుతుండగా మరోవైపు నటి రాయ్‌లక్ష్మీ కూడా గర్భంతో ఉన్నట్లు కొందరు నిప్పు రాజేశారు. ఈ విషయం తెలుసుకుని దిగ్భ్రాంతి చెందిన రాయ్‌లక్ష్మీ ఘాటుగా స్పదించారు.ఒక అమ్మాయిగా ప్రతి రోజు పలు విషయాలను తాను ఫేస్ చేయాల్సి వస్తోందని, తన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయంపై తాను కలచెందడం లేదన్నారు. స్వయం చింతన లేకుండా, ఇతరుల మనోబావాలతో సంబంధం లేకుండా హద్దులు మీరి తనపై వదంతులు రేపడం మనస్సును తీవ్రంగా గాయపరుస్తోందని వాపోయారు. ఒకే సమయంలో పలువురితో సన్నిహిత సంబంధాలు కలిగిన వ్యక్తిని తాను కాదని, ఇటువంటి ఇలాంటి వదంతులు సైతం ప్రచారం చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను గర్భంతో ఉన్నట్లు మరో రూమర్‌ను వ్యాపింపచేస్తున్నారని మండిపడింది. ఇలాంటి వదంతులతో తన మనస్సు ఎంతగానో గాయపడిందని, అర్థం పర్థం లేని ఆ రూమర్‌తో తాను ఎంతో రోదించినట్లు తెలిపారు. ఇకనైనా ఇలాంటి వదంతులు వ్యాపించేవారు తమ పద్ధతి మార్చుకోవాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment