
సాక్షి, తమిళసినిమా: ఐటమ్ సాంగ్స్ నాకిష్టం అంటోంది నటి తమన్నా.. స్టార్ హీరోయిన్లు ఐటమ్ సాంగ్‌లో నటించడానికి ఒకప్పుడు భయపడేవారు. కానీ, ఇప్పుడు అది ఫ్యాషన్ అయ్యింది. ఇమేజ్‌ను సైతం పట్టించుకోకుండా స్టార్ హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్‌లో ఆడిపాడుతున్నారు. ఇందుకు మరో కారణం కూడా ఉంది. ఒక చిత్రంలో నటిస్తే వచ్చే పారితోషికంలో సగం ఒక్క ఐటమ్ సాంగ్‌లో నటిస్తే వచ్చేస్తుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే తత్వాన్ని బాగా ఒంటబట్టిచుకున్న ఈ తరం హీరోయిన్లు ఐటమ్ సాంగ్‌లకు అస్సలు వెనుకాడడం లేదు.
తమన్నా, శ్రియ, కాజల్ అగర్వాల్ ఇలా టాప్ హీరోయిన్లందరూ సింగిల్‌సాంగ్‌కు చిందేయడానికి సిద్ధం అంటున్నారు. అయితే ఇందుకు వారు ఒక్కో రీజన్‌ను రెడీగా పెట్టుకుంటున్నారు. నటి తమన్నా ఇప్పటికే చాలా చిత్రాల్లో ఐటమ్ సాంగ్‌లో నటించారు. ఇటీవల విడుదలైన కన్నడ చిత్రం కేజీఎఫ్‌లోనూ తన అందాలతో అదరగొట్టారు.
ఇలా ఐటమ్ సాంగ్స్‌లో నటించడంపై తాజగా తమన్నా స్పందించారు. ‘ సినిమాల్లోకి మొదట్లో నాకు డాన్స్‌తోనే గుర్తింపు లభించింది. ఇంకా చెప్పాలంటే డాన్స్‌లో ప్రతిభను చాటుకునే అవకాశాలు చాలా తక్కువ మంది హీరోయిన్లకే వస్తుంటాయి. అలాంటి అవకాశాలు నాకు ఎక్కువగానే వచ్చాయి. అందుకే డాన్స్‌కు ప్రాధాన్యం కలిగిన పాటల్లో నటించడం నాకు చాలా ఇష్టం’ అంటూ స్పెషల్ సాంగ్స్‌లో నటించడాన్ని ఈ అమ్మడు సమర్థించుకుంది. మొత్తం మీద తొలి రోజుల్లో నటనతో కాకుండా డాన్స్, అందచందాలతో నెట్టుకొచ్చానని ఈ అమ్మడు చెప్పకనే చెప్పిందన్నమాట. ఈ బ్యూటీ నటించిన తెలుగు చిత్రం ఎఫ్-2 చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఈ అమ్మడు సక్సెస్ చూసి చాలా కాలమైంది. అందుకే ఎఫ్-2 సినిమా రిజల్ట్ కోసం చాలా ఆతృతంగా ఎదురుచూస్తోందట.
Comments
Please login to add a commentAdd a comment