special songs
-
భారతీయ తొలి ఐటమ్ గాళ్ ఓ పాకిస్తానీ..
భారతీయ సినిమా చరిత్రలో ఐటమ్ సాంగ్స్ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. ఇటీవలి కాలంలో అయితే బాలీవుడ్ చిత్రాలు ఐటమ్ సాంగ్ లేకుండా పూర్తి కాదన్న అభిప్రాయం స్థిరపడిపోయింది. మలైకా అరోరా ‘హోత్ రసిలే’, కరీనా కపూర్ ‘ఫేవికోల్ సే’, సమంతా ‘ఊ అంటావా’, నోరా ఫతేహి ‘దిల్బర్ దిల్బర్’ వంటి పాటలు విపరీతంగా ప్రాచుర్యం పొందాయి. తాజాగా తమన్నా భాటియా ఆజ్‌కీ రాత్ ద్వారా ఐటమ్ క్వీన్‌గా మారిపోయిన సంగతీ తెలిసిందే. ఇంతగా భారతీయ సినిమా చరిత్రలో మమేకం అయిపోయిన ఈ ఐటమ్ నంబర్ల చరిత్ర ఎక్కడి నుంచి మొదలైందో తెలుసా?సినిమా పరిజ్ఞానం బాగా ఉన్నవారు కూడా ఈ ఐటమ్ నంబర్ల ట్రెండ్‌ను హెలెన్, బిందు లేదా జీనత్ అమెన్ మొదలుపెట్టారని అనుకుంటారు. కానీ నిజానికి వీళ్లందరి కన్నా ముందుగానే శృంగార నర్తకిగా తెరపై చిందేసిన ఇండియా ఫస్ట్ ఐటమ్ గర్ల్ ఎవరో తెలుసా? ఆ గౌరవం ‘మేడమ్ అజురీ‘(Madame Azurie)కి దక్కింది.అన్నా మేరీ గ్వీజెలర్...ఉరఫ్ మేడమ్ అజురీ... బాలీవుడ్లో తొలి ఐటమ్ డాన్సర్ ఎలా అయింది? అనే ప్రశ్నలు కలిగితే... ఒకసారి చరిత్ర తవ్వి తీయాలి. దాదాపు వందేళ్ల క్రితం... అంటే 1930లలో హీరోయిన్లకు భిన్నంగా ప్రత్యేక డాన్సర్ పాత్రలను సినీ పరిశ్రమలో ప్రవేశపెట్టిన పేరే మేడమ్ అజురీ అని చెప్పాలి. బెంగళూరులో జన్మించిన ఆమె తల్లి హిందూ బ్రాహ్మణ నర్స్ కాగా, తండ్రి జర్మన్ జ్యూయిష్ డాక్టర్. తల్లిదండ్రులు విడిపోయిన తర్వాత ఆమె తండ్రితో నివసించింది. ఆ సమయంలో ఆమె తండ్రి ఆమెను బాలే నృత్యం నేర్చుకోవడానికి ప్రోత్సహించారు, కానీ భారతీయ నృత్యాలను అభ్యసించేందుకు మాత్రం అంగీకరించలేదు. అజురీ యుక్తవయస్సులో ఉన్నప్పుడు ఆమె కుటుంబం బొంబాయికి తరలివెళ్లింది. ఆమె తండ్రి త్రీ ఆర్ట్స్ సర్కిల్లో సభ్యుడయ్యాడు, ఆ సమయంలో అజురీకి త్రీ ఆర్ట్స్ సర్కిల్ నిర్వాహకురాలు బేగం అతియా ఫైజీ–రహమిన్తో సంభాషించడానికి వీలు కలిగింది.అలా అజురీ అతియా సహకారంతో మరికొన్ని మనవైన కళలు నృత్యాలనుు అభ్యసించగలిగింది. అలా అజురీ పలు నృత్య శైలులను నేర్చుకుని నదిరా సినిమా తో హిందీ సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆ తర్వాత ‘పర్దేసీ సయ్యాన్’, ‘క్వత్ల్–ఎ–ఆమ్’, ‘ది బాంబే టాకీస్’, ‘నయా సంసార్’ వంటి చిత్రాలతో సహా 700కి పైగా సినిమాల్లో నటించి, తన డాన్సులతో ఎంతో పాప్యులర్ అయ్యింది.తమ ప్యాలెస్‌లో నృత్యం చేయాలంటూ మేడమ్ అజురీకి బ్రిటన్ లోని బకింగ్ హ్యామ్ ప్యాలెస్ నుంచి ఆహ్వానం అందింది అంటేనే ఆమె పాప్యులారిటీ ఏ స్థాయిలో వెలిగేదో తెలుస్తుంది. దేశ విభజన అనంతరం అజూరీ ఓ ముస్లింను నిఖా చేసుకుని పాకిస్తాన్ లోని రావల్పిండీలో స్థిరపడి, పాకిస్తాన్లో కూడా కొన్ని స్థానిక చిత్రాల్లో నటించిన తర్వాత ఎందుకనో గానీ నటనకు గుడ్‌బై చెప్పేసింది. ఆ తర్వాత అక్కడ ఒక క్లాసికల్ డాన్స్ అకాడమీని ప్రారంభించి, ఏళ్ల తరబడి నృత్యాన్ని బోధించింది. అలా భారతీయ చిత్రాల్లో ఐటమ్ డ్యాన్సులకు ఊపిరిపోసిన అజురీ ఆగస్టు 1998లో మరణించింది. -
స్పెషల్ సాంగ్స్‌కి సై
‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అనేది సామెత. చిత్ర పరిశ్రమలో ఈ సామెత బాగా వర్తిస్తుంది. ప్రత్యేకించి హీరోయిన్ల విషయంలో.. క్రేజ్ ఉన్నప్పుడే వరుసగా సినిమాలు చేసి, అటు ప్రేక్షకుల్ని అలరించడంతో పాటు ఇటు బ్యాంక్ బ్యాలెన్స్‌లు పెంచుకోవాలి. ఇందుకు కేవలం హీరోయిన్ పాత్రలకే పరిమితం కాకుండా ట్రెండ్‌కి తగ్గట్టుగా కెరీర్‌ని మలచుకుంటూ స్పెషల్ సాంగ్స్‌కి కూడా సై అంటున్నారు పలువురు కథానాయికలు.పైగా ప్రత్యేక పాటల్లో నటించే వారికి పారితోషికం కూడా భారీగా ఇస్తుండటంతో స్పెషల్ సాంగ్స్‌లో నర్తించేందుకు హీరోయిన్లు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ప్రస్తుతం పూజా హెగ్డే, శ్రియ, నేహా శెట్టి, కేతికా శర్మ, రెబా మోనికా జాన్, చంద్రికా రవి వంటి హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్‌లో నటిస్తున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం.రెట్రోకి హైలైట్ ‘ఇష్టం’ (2001) సినిమాతో హీరోయిన్గా పరిచయమయ్యారు శ్రియా శరణ్. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, ప్రభాస్, పవన్ కల్యాణ్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్... ఇలా పలువురు హీరోలకి జోడీగా నటించి, స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు శ్రియ. ప్రస్తుతం హీరోయిన్గా అవకాశాలు తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్, స్పెషల్ సాంగ్స్‌పై దృష్టి పెట్టారు శ్రియ. ప్రత్యేక పాటల్లో నర్తించడం ఆమెకు కొత్త కాదు. రామ్‌ని హీరోగా, ఇలియానాని హీరోయిన్గా పరిచయం చేస్తూ వైవీఎస్ చౌదరి తెరకెక్కించిన ‘దేవదాసు’ (2006) సినిమాలో తొలిసారి ప్రత్యేక పాటలో చిందేశారు శ్రియ.ఆ తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన ‘మున్నా’ (2007), వెంకటేశ్ కథానాయకుడిగా నటించిన ‘తులసి’ (2007), పవన్ కల్యాణ్ హీరోగా చేసిన ‘పులి’, సందీప్ కిషన్, సాయిదుర్గా తేజ్ నటించిన ‘నక్షత్రం’ (2017) వంటి తెలుగు సినిమాలతో పాటు పలు తమిళ, హిందీ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన శ్రియ తాజాగా ‘రెట్రో’ సినిమాలో ప్రత్యేక పాటలో సందడి చేయనున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొదుతున్న ఈ సినిమాలో సూర్యకి జంటగా పూజా హెగ్డే నటించారు.సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్‌లో సూర్యతో కాలు కదిపారు శ్రియ. గోవాలో ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో సూర్య, శ్రియలపై ఈ పాట చిత్రీకరించారు మేకర్స్. సూర్య, జ్యోతిక, కార్తికేయ సంతానం నిర్మించిన ఈ మూవీ మే 1న విడుదల కానుంది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌ను సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ సొంతం చేసుకుంది. ముచ్చటగా మూడోసారినాగచైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ (2014) సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు పూజా హెగ్డే. ప్రభాస్, మహేశ్‌బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, వరుణ్ తేజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అఖిల్ వంటి హీరోలకి జోడీగా నటించి, తెలుగులో ఓ వెలుగు వెలిగిన ఆమె ప్రస్తుతం తమిళ, హిందీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఓ వైపు హీరోయిన్గా నటిస్తున్న ఈ బ్యూటీ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘కూలీ’ సినిమాలో ఓ ప్రత్యేక పాటలో నర్తించారు.రామ్‌చరణ్ హీరోగా నటించిన ‘రంగస్థలం’ (2018) సినిమాలోని ‘జిల్ జిల్ జిగేల్ రాణి...’ పూజా చేసిన తొలి స్పెషల్ సాంగ్. ఈ పాటలో రామ్‌చరణ్, పూజా హెగ్డే మాస్ డ్యాన్సులకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత ‘ఎఫ్ 3’ (2022) సినిమాలో ‘అధ్యక్షా... లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా...’ అనే సాంగ్‌లో రెండోసారి చిందేసిన పూజ ముచ్చటగా మూడోసారి ‘కూలీ’లో ఓ స్పెషల్ సాంగ్ చేశారు.రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొదిన చిత్రం ‘కూలీ’. అనిరు«ధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ మూవీలోని ప్రత్యేక పాట చాలా వెరీ వెరీ స్పెషల్‌గా ఉంటుందట. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతీహాసన్ ప్రధాన పాత్రల్లో నటించారు. సన్న్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ‘కూలీ’ నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించలేదు.అది దా సర్ప్రైజ్అది దా సర్ప్రైజ్ అంటున్నారు కేతికా శర్మ. ఆకాశ్ పూరి హీరోగా నటించిన ‘రొమాంటిక్’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమయ్యారు కేతిక. 2021 అక్టోబరు 21న విడుదలైన ఈ మూవీలో ఈ అమ్మడు అందాలకు కుర్రకారు ఫిదా అయ్యారు. ఆ తర్వాత ‘లక్ష్య, రంగరంగ వైభవంగా, బ్రో’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన కేతికా శర్మ తొలిసారి ‘రాబిన్‌హుడ్’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశారు. ‘భీష్మ’ (2020) వంటి హిట్ మూవీ తర్వాత హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్లో రూపొదిన ద్వితీయ చిత్రం ‘రాబిన్‌హుడ్’.శ్రీలీల హీరోయిన్గా నటించారు. ఈ సినిమాలో ‘అది దా సర్ప్రైజ్...’ అంటూ సాగే ప్రత్యేక పాటలో కేతికా శర్మ సందడి చేశారు. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందించిన ఈ పాటని ఇటీవలే విడుదల చేశారు. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటని నీతి మోహన్, అనురాగ్ కులకర్ణి పాడగా, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతోంది.నా ముద్దుపేరు స్వాతి రెడ్డి శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘సామజవర గమన’ (2023) సినిమాతో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు రెబా మోనికా జాన్. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో ఈ బ్యూటీ క్రేజ్ ఓ రేంజ్‌కి వెళ్లింది. ప్రస్తుతం ఆమె ‘మృత్యుంజయ్’ మూవీలో శ్రీవిష్ణుతో రెండోసారి జోడీగా నటిస్తున్నారు. ఓ వైపు హీరోయిన్గా నటిస్తున్న ఈ బ్యూటీ మరోవైపు ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశారు. సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’.కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియాంకా జవాల్కర్, మురళీధర్ గౌడ్, డైరెక్టర్ కేవీ అనుదీప్ కీలక పాత్రలు పోషించారు. ‘మ్యాడ్’కి (2023) సీక్వెల్‌గా రూపొదిన ‘మ్యాడ్ స్క్వేర్’లో రెబా మోనికా జాన్ ప్రత్యేక గీతంలో సందడి చేయనున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.‘నా ముద్దుపేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి... నే ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండుగడ్డి...’ అంటూ సాగే ఈ పాటలో హుషారైన స్టెప్పులు వేశారు రెబా. సురేష్ గంగుల సాహిత్యం అందించిన ఈ పాటని స్వాతి రెడ్డి, భీమ్స్ ఆలపించారు. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న రిలీజ్ కానుంది.మొదటి సారి...ఆకాశ్ పూరి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘మెహబూబా’ (2018) సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగుకి పరిచయం అయ్యారు కన్నడ బ్యూటీ నేహా శెట్టి. ఆ సినిమా తర్వాత ‘గల్లీ రౌడీ, డీజే టిల్లు, బెదురులంక 2012, రూల్స్ రంజన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ వంటి సినిమాల్లో నటించి, మెప్పించారామె. సిద్ధు జొన్నలగడ్డకి జోడీగా నటించిన ‘డీజే టిల్లు’ (2022) సినిమాలో రాధిక పాత్రతో కుర్రకారు మనసులు దోచేశారీ బ్యూటీ. ఈ మూవీలో ఆమె నటన, గ్లామర్‌కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.ఇదిలా ఉంటే నేహా శెట్టి తొలిసారి ఓ ప్రత్యేక పాటలో చిందేశారు. పవన్ కల్యాణ్ హీరోగా ‘సాహో’ మూవీ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్). డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా మోహన్, శ్రియా రెడ్డి హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఆ పాటలో పవన్ కల్యాణ్‌తో కలిసి చిందేశారట నేహా శెట్టి. థాయ్‌ల్యాండ్‌లో ఈ పాటని చిత్రీకరించారని సమాచారం. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబరులో రిలీజ్ కానుందని ఫిల్మ్‌నగర్ టాక్.టచ్‌లో ఉండు ఓ రబ్బీ...తమిళ చిత్ర పరిశ్రమలో హీరోయిన్గా నటించిన చంద్రికా రవి ఓ స్పెషల్ సాంగ్‌తో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు. 2019లో విడుదలైన ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ సినిమాలో ఓ ప్రత్యేక పాట ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారీ బ్యూటీ. ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీర సింహారెడ్డి’ (2023) మూవీలో ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే...’ అనే స్పెషల్ సాంగ్‌లో తనదైన గ్లామర్, డ్యాన్సులతో ప్రేక్షకులను ఫిదా చేశారు చంద్రిక.తాజాగా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేశారామె. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమా ద్వారా హీరోగా పరిచయమైన యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన ద్వితీయ చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. దర్శక ద్వయం నితిన్, భరత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దీపికా పిల్లి కథానాయికగా నటించారు. యూనిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొదిన ఈ మూవీలో ‘టచ్‌లో ఉండు ఓ రబ్బీ... ఓ రబ్బీ...’ అంటూ చిందేశారు చంద్రిక.ఈ పాటకి చంద్రబోస్ మాస్ లిరిక్స్ అందించగా, లక్ష్మీ దాస, పి. రఘు పాడారు. రధన్ తనదైన హుషారైన సంగీతం అందించారు. శేఖర్ మాస్టర్ నృత్యరీతులు సమకూర్చారు. మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్‌పై రూపొదిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ఏప్రిల్ 11న విడుదల కానుంది. చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఆ పాటలో చిరంజీవితో కలిసి ఊర్వశీ రౌతేలా చిందేయనున్నారని టాక్. ‘వాల్తేరు వీరయ్య’ (2023) సినిమాలో ‘వేర్ ఈజ్ ద పార్టీ...’ అనే ప్రత్యేక పాటలో చిరంజీవి– ఊర్వశీ రౌతేలా తమదైన స్టెప్పులతో అలరించిన సంగతి తెలిసిందే.ఈ పాట సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో ‘విశ్వంభర’లోనూ చిరంజీవితో కలిసి స్పెషల్ సాంగ్‌లో ఊర్వశి మెరవనున్నారట. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్‌పై వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్న ఈ మూవీ ఈ వేసవిలో విడుదల కానుందని టాక్. ఇదిలా ఉంటే... బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ హీరోగా టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన హిందీ చిత్రం ‘జాట్’. ఈ మూవీలో రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా ఇతర కీలక పాత్రధారులు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఆ పాటలో హీరోయిన్ నిధీ అగర్వాల్ మెరవనున్నారని టాక్. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీలపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. కాగా ‘విశ్వంభర’లో ఊర్వశీ రౌతేలా, ‘జాట్’లో నిధీ అగర్వాల్ స్పెషల్ సాంగ్స్ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు.వీరే కాదు.. మరి కొందరు హీరోయిన్లు కూడా ప్రత్యేక పాటల్లో సందడి చేయనున్నారు. – డేరంగుల జగన్ మోహన్ -
వినాయకచవితి స్పెషల్.. ఈ సాంగ్స్ లేకపోతే సందడే ఉండదు!
వినాయకచవితి పండుగ వచ్చిందంటే చాలు. చిన్నపిల్లలే కాదు.. పెద్దలు డ్యాన్సులతో హోరెత్తిస్తారు. పెద్ద పెద్ద డీజేలు, గణనాధుని పాటలతో ఏ గల్లీలో చూసినా సందడే సందడి.. ధూమ్ ధామ్. మరీ ఇంత సంతోషంగా పిల్లలు, పెద్దలు జరుపుకునే పండుగలో గణనాథునిపై మనం రాసుకున్న పాటలకైతే కొదువ లేదాయే. మరీ ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా సంతోషంగా గణనాధున్ని గంగమ్మ ఒడికి చేర్చే వరకు మనకోసం.. మరీ ముఖ్యంగా బొజ్జ గణపయ్య కోసం సినిమాల్లో వచ్చిన పాటలను ఓ సారి గుర్తు చేసుకుందాం. వినాయకచవితి సందర్భంగా లంబోదరుడి సూపర్ హిట్ సాంగ్స్ గురించి తెలుసుకుందాం పదండి. సినిమాల్లో మన గణపయ్య సూపర్ హిట్ సాంగ్స్ మెగాస్టార్ 'జై చిరంజీవ'- 'జై జై గణేశా.. జై కొడతా గణేశా' 'జై జై గణేశా.. జై కొడతా గణేశా' అనే సాంగ్ వినాయకచవితి వచ్చిందంటే కచ్చితంగా ఉండాల్సిందే. మెగాస్టార్ చిరంజీవి, సమీరా రెడ్డి, భూమిక ప్రధాప పాత్రల్లో విజయ భాస్కర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వెంకటేశ్ కూలీనెం 1- 'దండాలయ్యా.. ఉండ్రాలయ్యా..దేవా' 'దండాలయ్యా.. ఉండ్రాలయ్యా..దేవా. నీ అండదండా ఉండాలయ్యా.. దేవా' అంటూ సాగే వినాయకుని పాట ఇప్పటికీ కూడా ఎవర్గ్రీన్. వెంకటేశ్, టబు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2002లో రిలీజైంది. 100% లవ్ -'తిరుతిరు గణనాథ..' నాగచైతన్య, తమన్నా జంటగా నటించిన చిత్రం 100% లవ్. ఈ చిత్రంలో తమన్నా పాడే 'తిరుతిరు గణనాథ..' అంటూ పాడే సాంగ్ హైలెట్. వినాయకచవితి పండుగ రోజు ఈ పాట కచ్చితంగా ఉండాల్సిందే. అల్లు అర్జున్ 'ఇద్దరమ్మాయిలతో'- గణపతి బప్పా మోరియా అల్లు అర్జున్, అమలా పాల్ జంటగా నటించిన చిత్రం ఇద్దరమ్మాయిలతో. ఈ చిత్రంలో 'గణపతి బప్ప మోరియా' సాంగ్ వినని వారుండరు. ఐకాన్ స్టార్ ఈ పాటకు తన స్టెప్పులతో అదరగొట్టాడు. వెస్ట్రర్న్ స్టెల్లో బన్నీ దుమ్ములేపారు. దేవుళ్లు- 'వక్రతుండా మహాకాయ' సాంగ్ ఎస్పీ బాలసుబ్రమణ్య ఆలపించిన ఈ సాంగ్ దేవుళ్లు సినిమాలోది. ఇద్దరు చిన్న పిల్లలు తమ తల్లిదండ్రుల కోసం దేవుడిని మొక్కులు చెల్లించేందుకు బయలుదేరుతారు. ఈ సినిమాలో 2001లో రిలీజ్ కాగా.. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించారు. బాలయ్య భగవంత్ కేసరి- గణేశ్ ఆంతం సాంగ్ బాలకృష్ణ, శ్రీలీల జంటగా నటిస్తోన్న చిత్రం భగవంత్ కేసరి. ఈ చిత్రంలో గణేశ్ ఆంతం లిరికల్ సాంగ్‌ను ఇటీవలే రిలీజ్ చేశారు. వినాయకచవితికి గణపతి మండపాలు ఈ పాటతో హోరెత్తనున్నాయి. -
మహాశివరాత్రి స్పెషల్.. శివుని ప్రత్యేక గీతాలు
మహా శివరాత్రి శివ భక్తులకు అత్యంత ఇష్టమైన పండుగ. ఈ పండుగ తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాల్లో అత్యంత వైభవంగా జరుగుతుంది. శివభక్తులు తమ ఇష్టదైవానికి ప్రత్యేక పూజలు చేయడంతో పాటు ప్రత్యేక గీతాలు ఆలపిస్తారు. అలాగే శివుడి చరిత్రను వివరిస్తూ పలు సినిమాలు కూడా వచ్చాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 18న మహాశివరాత్రి సందర్భంగా ఆ పరమశివుడి గుర్తు చేసుకుంటూ అత్యంత ప్రీతికరమైన పాటలేవో తెలుసుకుందాం. ఓం మహాప్రాణ దీపం సాంగ్ -శ్రీ మంజునాథ (2001) ఇది చిరంజీవి, అర్జున్ సర్జా నటించిన శ్రీ మంజునాథ (2001) చిత్రంలోని చాలా ప్రజాదరణ పొందిన భక్తి గీతం. ప్రసిద్ధ తెలుగు పాటను శంకర్ మహదేవన్ పాడారు. ఈ పాదం -శ్రీ మంజునాథ (2001) శ్రీ మంజునాథ చిత్రంలోని శ్రీపాదం ప్రసిద్ధ పాటను ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోసం పాడారు. ఆటగదరా శివా .. ఆటగదా కేశవ సాంగ్ జీవిత చిత్రాన్ని చూపించే పాటల్లో ఎక్కువ మందికి ఇష్టమైన పాట ఆటగదరా శివా... ఈ పాటలో ప్రతి అక్షరం అద్భుతమే. ఆటగదరా శివా ఆటగద కేశవా అంటూ సాగే పాట చిన్న చిన్న పదాలతో జీవితాన్ని తట్టిలేపిన తనికెళ్ల భరణి రచించగా.. ఈ పాటను ఏసుదాసు ఆలపించారు. ఎట్టాగయ్యా శివా శివా మరణానికి-పుట్టుకకు మధ్యలో అన్నీ ఎదురీతలే. బంధాలకు ప్రతిమనిషీ బందీనే, అందరికీ వేదన బాధ ఒక్కటే... దయచూడు భోళాశంకరా కరుణ చూపించు అంటూ సాగే ఈ పాట ఆటగదరా శివ సినిమాలో హైలెట్‌గా నిలిచింది. భ్రమ అని తెలుసు సాంగ్ బ్రతుకంటే బొమ్మల ఆట.. పుట్టుక తప్పదు, మరణం తప్పదు.. అన్నీ తెలిసి మాయలో బతుకుతున్నాం అంటూ మనిషిలో ఉంటే అంతర్యామిని తట్టిలేపే పాట ఇది. జగద్గురు ఆదిశంకరాచార్య సినిమాలోని ఈ పాట శివ భక్తులకు ఇష్టమైన పాటగా నిలిచింది. మాయేరా అంతా మాయేరా నీ ముందూ నీ వెనుకా జరిగేదంతా మాయే.. మనవాళ్లు మనది అన్నది మాయే...జననం-మరణం మాయ మధ్యలో జరిగే నాటకం అంతా మాయ..జగమంతా మాయే..జనమంతా మాయే..కళ్లారా చూసే ప్రతిదీ తెల్లారితే మాయే అంటూ సాగే ఈ పాట ప్రతి ఒక్కరినీ ఆలోచింపచేసేలా ఉంటుంది ఓ మహాదేవా సాంగ్ 1966లో విడుదలైన ఓ మహాదేవ పాట శివునికి అంకితం చేయబడింది. తెలుగు చిత్రం పరమానందయ్య శిష్యుల కథ కోసం పి.సుశీల పాడారు. లింగాష్టకం సాంగ్ లింగాష్టకం మ్యూజిక్ ఇయర్స్ ఆఫ్ శాండల్‌వుడ్ అనే సంగీత ఆల్బమ్‌కు చెందినది. దీనిని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు. ఈ పాట 1976లో విడుదలైంది. -
పాటల్లో దేశభక్తి స్ఫూర్తి.. ఈ పాటలు ఎవర్గ్రీన్!
ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం మనది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. గుండెల నిండా దేశభక్తితో జరుపుకునే పండగే ఈ గణతంత్ర దినోత్సవం.బ్రిటీష్ పాలనలో మగ్గిన మన దేశానికి స్వాతంత్ర్యం అనంతరం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దేశ వ్యాప్తంగా పండగలా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. గుండెనింగా దేశభక్తి, మనసు ఉప్పొంగేలా అమరవీరుల పోరాటాన్ని వివరించేలా ఎన్నో దేశభక్తి గీతాలు ప్రేక్షకులను సమ్మోహన పరిచాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలం నుంచి జూ. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల వరకు ఎంతో మంది స్టార్ హీరోలు దేశభక్తి కలిగిన సినిమాల్లో నటించారు. తరాలు మారినా ప్రతి భారతీయుడిలోనూ దేశభక్తిని ఉప్పింగించే కొన్ని సినీ పాటల్ని ఓసారి గుర్తుచేసుకుందాం. ‘మేమే ఇండియన్స్’ గణతంత్ర దినోత్సవ రోజుల్లో టీవీల్లో మనం ఎక్కువగా చూసే సినిమా ‘ఖడ్గం’. ఈ సినిమాలో రవితేజ, శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో పోషించారు. దేశభక్తి చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ.. ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌గానే రన్ అవుతోంది. ఇందులోని దేశభక్తి సాంగ్ ‘మేమే ఇండియన్స్’ ఇప్పటికీ మార్మోగుతూనే ఉంటుంది. వీటితో పాటు మరికొన్ని దేశభక్తి పాటలివే.. -
Item Songs 2021: ఈ ఏడాది 'ఊ'పేసిన ఐటమ్ సాంగ్‌లు ఇవే..
సినిమా అంటే యాక్షన్, రొమాంటిక్, కామెడీ సీన్లు, పాటలు వంటి రకారకాల వినోదాల మేళవింపు. ఒక పక్కా కమర్షియల్ సినిమా అంటే అన్నీ ఉండి తీరాల్సిందే. ఆకలితో ఉన్నవాడికి విందు భోజనంలా వడ్డించాలి సినిమా దర్శకుడు. అప్పుడే ప్రేక్షకులు సినిమా అనే రుచిని ఆస్వాదిస్తారు. లేకుంటే తిరస్కరిస్తారు. ఇక మాంచి కమర్షియల్ సినిమాలో ఐటమ్ సాంగ్ అంటే ప్రతీ మాస్ ప్రేక్షకుడు స్పెషల్ ఫోకస్ పెడతాడు సినిమాపై. సినిమాలో ఐటమ్ సాంగ్ లేదంటే పెదవి విరుస్తారు ఆడియెన్స్. థియేటర్లలో స్పెషల్ సాంగ్ వచ్చిందంటే చాలు విజిల్స్, పేపర్స్ విసిరేస్తూ గోల గోలగా సందడి చేస్తారు. ఇంతలా కేక పెట్టించే ఐటమ్ సాంగ్‌లో ఎవరూ స్టెప్పులేస్తారా అని వేయి కళ్లతో ఎదురుచూసే పక్కా మాస్ ఆడియెన్స్ కూడా ఉన్నారు. అందుకే ఈ ఐటమ్ సాంగ్స్‌లో తమ అందాలతో కట్టిపడేస్తున్నారు హీరోయిన్స్. ఇదివరకు అయితే ఈ సాంగ్స్‌లో సాధారణ నటీనమణులు నర్తించేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. అందుకే తమ ముందు ఐటమ్ సాంగ్స్ కూడా తక్కువే అని నేరుగా హీరోయిన్లే ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ సమంత చేసిన 'ఊ అంటావ మావ'తో ఐటమ్ సాంగ్స్‌కు కొత్త కళ వచ్చింది. ఇలా ఈ ఏడాది వచ్చిన 'భూమ్ బద్దలు' నుంచి 'ఊ అంటావా మావ' వరకు అలరించిన స్పెషల్ సాంగ్స్‌పై ఓ లుక్కేద్దాం. 1. ఊ అంటావా మావ.. ఉఉ అంటావా మావ (పుష్ప) 2. ఛాంగురే ఐటమ్ సాంగురే (గల్లీ రౌడీ) 3. పెప్సీ ఆంటీ (సిటీమార్) 4. మందులోడా (శ్రీదేవి సోడా సెంటర్) 5. పైన పటారం (చావు కబురు చల్లగా) 6. రంభ ఊర్వశి మేనక (అల్లుడు అదుర్స్) 7. డించక్ డించక్ డింకా (రెడ్) 8. భూమ్ బద్దలు (క్రాక్) ఈ స్పెషల్ సాంగ్స్‌తో పాటు నాగశౌర్య నటించిన 'వరుడు కావలెను' సినిమాలోని 'దిగు దిగు నాగ' సాంగ్ కూడా చాలా అలరించింది. అయితే ఈ పాటలో కూడా హీరోయిన్ రీతు వర్మ నర్తించింది. -
స్పెషల్ సాంగ్స్‌తో కనువిందు చేయబోతోన్న బ్యూటీలు..
కొంత లవ్వు.. కాస్త నవ్వు.. కాసింత సెంటిమెంట్... మధ్య మధ్యలో ఫైట్స్.. సినిమా ఇలా సాగిపోతుంటుంది. మధ్యలో జిల్.. జిల్.. జిగేల్మనే స్పెషల్ సాంగ్ వస్తే... ప్రేక్షకులకు ఐ ఫీస్ట్... ఇయర్ ఫీస్ట్... ఇప్పటికే ఇలాంటి ప్రత్యేక పాటలు చాలానే చూశాం. రానున్న రోజుల్లో కనువిందు చేయనున్న ‘స్పెషల్ సాంగ్స్’ గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు స్పెషల్ సాంగ్స్ చేయడానికి ప్రత్యేకంగా తారలు ఉండేవారు. ఇప్పుడు స్టార్ హీరోయిన్లు, హీరోయిన్లు కూడా చేస్తున్న విషయం తెలిసిందే. కెరీర్లో తొలిసారి సమంత ఒక స్పెషల్ సాంగ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటివరకూ ఈ బ్యూటీ యాభైకి పైగా సినిమాలు చేశారు. ఫస్ట్ టైమ్ సమంత స్పెషల్ సాంగ్‌లో కనిపించనుండటం విశేషం. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పుష్ప’లోనే సమంత ప్రత్యేక పాటలో కనిపించనున్నారు. చదవండి: 'జగపతిబాబును గుర్తుపట్టలేదు, బాలకృష్ణ మనిషేనా?' సేమ్ టు సేమ్ సమంతలానే హీరోయిన్ రెజీనా తన కెరీర్లో ఫస్ట్ టైమ్ స్పెషల్ సాంగ్ చేశారు. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘ఆచార్య’లోనే రెజీనా స్పెషల్ సాంగ్ చేశారు. అయితే ఇది రెగ్యులర్ స్పెషల్ సాంగ్లానో, ఐటమ్ సాంగ్లానో ఉండదని తెలిసింది. చిరంజీవి–రెజీనా పాల్గొనగా ఓ గుడిలో ఈ పాట ఉంటుందని సమాచారం. రామ్‌చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రలు చేసిన ‘ఆచార్య’ చిత్రం ఫిబ్రవరి 4న థియేటర్స్‌లోకి రానుంది. ఇంకోవైపు బుల్లితెర ఫేమస్ యాంకర్, నటి రష్మీ గౌతమ్ ‘బోళా శంకర్’ చిత్రంలో ఓ మాస్ మసాలా సాంగ్‌లో చిరంజీవితో కలిసి స్టెప్పులేశారు. మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలిగా కీర్తీ సురేష్ కనిపిస్తారు. నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. ఇక సమంత, రెజీనా, రష్మీ గౌతమ్‌ల లెక్క ఫస్ట్ టైమ్ కాకుండా... ఇప్పటికే తమన్నా అరడజను (అల్లుడు శీను, స్పీడున్నోడు, జాగ్వార్, కేజీఎఫ్: చాప్టర్ 1, జై లవకుశ, సరిలేరు నీకెవ్వరు) స్పెషల్ సాంగ్స్‌లో స్టెప్పులు వేశారు. చదవండి: RRR Janani Song: ఆర్ఆర్ఆర్ 'జనని' సాంగ్ వచ్చేసింది.. తాజాగా ‘గని’ కోసం మరోసారి స్పెషల్‌గా మాస్ స్టెప్పులేశారని తెలిసింది. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. మరోవైపు యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా (‘జాతి రత్నాలు’ ఫేమ్) ‘బంగార్రాజు’ చిత్రంలో నాగార్జునతో కలిసి ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించనున్నారు. నాగార్జున హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 2016లో వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయానా’ చిత్రానికి ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ రూపుదిద్దుకుంటోంది. ఇందులో నాగచైతన్య, కృతీశెట్టి ఓ జంటగా నటిస్తున్నారు. ఇంతేనా? రానున్న రోజుల్లో మరిన్ని స్పెషల్ సాంగ్స్‌లో కొందరు తారలను చూసే అవకాశం ఉంది. -
దేశ భక్తిని నరనరాన నింపే ఈ పాటలు విన్నారా?
ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే ‘స్వాతంత్ర్యం’.రెండు వందల ఏళ్లకు పైగా పరాయి పాలనలో మగ్గిన, అణచివేతకు గురైన భారత్.. తొంభై ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో స్వాతంత్య్రం సాధించుకుంది. కులమతాలకతీతంగా దేశం మొత్తం కలిసి సంబురంగా చేసుకునే పండుగు ఇది. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర ప్రాముఖ్యతను తెలిపే కొన్ని మధురమైన పాటలు -
May Day: కార్మికుల హక్కులు, కష్టాలను తెలియజేసే పాటలు
కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించి పోరాడి సాధించిన రోజు నేడు(మే 01). ఈ రోజును మేడేగా కార్మికులు ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. సమాజ గతిని, పురోగతిని శాసించేది, నిర్ధేశించేది శ్రామిక వర్గం. అలాంటి వర్గాన్ని మనమంతా గౌరవించాల్సింది. శ్రామిక వర్గం కష్టాలు, హక్కులపై తెలుగు చాలా సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా ఆర్ నారాయణ మూర్తి సినిమాలన్నీ శ్రామికుల హక్కులకు సంబంధించినవే. ఆయన పాటలకు కూడా వారి కష్టాలను తెలియజేసేవిగా ఉంటాయి. మేడే సందర్భంగా శ్రామిక వర్గాలకు సంబంధించిన తెలుగు సినిమా పాటలు మీకోసం. > -
శ్రీరామ నవమి- ఫేమస్ పాటలివే
తండ్రి మాటను జవదాటని తనయుడిగా, సోదరులను అభిమానించిన అన్నగా, భార్య దూరమైనా నిరంతరం ఆమె కోసం పరితపించే భర్తగా, ప్రజల సంక్షేమం కోసమే వారి మాటకు విలువిచ్చిన రాజుగా.. మనిషి ధర్మం తప్పకుండా ఎలా జీవించాలో చూపించాడు శ్రీరాముడు. జీవితంలో ఎదురైన సమస్యలను ధర్మమార్గంలో అధిగమిస్తూ జీవితంలో ఎలా ముందుకు నడవాలో ఆయనవేసిన అడుగులను చూస్తే స్పష్టమవుతుంది. శ్రీరామనవమి సందర్భంగా కొన్ని ‘సీతారాముల పాటలు’ ఇప్పుడు చూద్దాం. -
మధురమైన తెలుగు పాటలు
-
ఐటమ్ అంటే నాకిష్టం!
సాక్షి, తమిళసినిమా: ఐటమ్ సాంగ్స్ నాకిష్టం అంటోంది నటి తమన్నా.. స్టార్ హీరోయిన్లు ఐటమ్ సాంగ్‌లో నటించడానికి ఒకప్పుడు భయపడేవారు. కానీ, ఇప్పుడు అది ఫ్యాషన్ అయ్యింది. ఇమేజ్ను సైతం పట్టించుకోకుండా స్టార్ హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్‌లో ఆడిపాడుతున్నారు. ఇందుకు మరో కారణం కూడా ఉంది. ఒక చిత్రంలో నటిస్తే వచ్చే పారితోషికంలో సగం ఒక్క ఐటమ్ సాంగ్‌లో నటిస్తే వచ్చేస్తుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే తత్వాన్ని బాగా ఒంటబట్టిచుకున్న ఈ తరం హీరోయిన్లు ఐటమ్ సాంగ్‌లకు అస్సలు వెనుకాడడం లేదు. తమన్నా, శ్రియ, కాజల్ అగర్వాల్ ఇలా టాప్ హీరోయిన్లందరూ సింగిల్సాంగ్కు చిందేయడానికి సిద్ధం అంటున్నారు. అయితే ఇందుకు వారు ఒక్కో రీజన్‌ను రెడీగా పెట్టుకుంటున్నారు. నటి తమన్నా ఇప్పటికే చాలా చిత్రాల్లో ఐటమ్ సాంగ్‌లో నటించారు. ఇటీవల విడుదలైన కన్నడ చిత్రం కేజీఎఫ్‌లోనూ తన అందాలతో అదరగొట్టారు. ఇలా ఐటమ్ సాంగ్స్‌లో నటించడంపై తాజగా తమన్నా స్పందించారు. ‘ సినిమాల్లోకి మొదట్లో నాకు డాన్స్‌తోనే గుర్తింపు లభించింది. ఇంకా చెప్పాలంటే డాన్స్‌లో ప్రతిభను చాటుకునే అవకాశాలు చాలా తక్కువ మంది హీరోయిన్లకే వస్తుంటాయి. అలాంటి అవకాశాలు నాకు ఎక్కువగానే వచ్చాయి. అందుకే డాన్స్‌కు ప్రాధాన్యం కలిగిన పాటల్లో నటించడం నాకు చాలా ఇష్టం’ అంటూ స్పెషల్ సాంగ్స్‌లో నటించడాన్ని ఈ అమ్మడు సమర్థించుకుంది. మొత్తం మీద తొలి రోజుల్లో నటనతో కాకుండా డాన్స్, అందచందాలతో నెట్టుకొచ్చానని ఈ అమ్మడు చెప్పకనే చెప్పిందన్నమాట. ఈ బ్యూటీ నటించిన తెలుగు చిత్రం ఎఫ్-2 చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఈ అమ్మడు సక్సెస్ చూసి చాలా కాలమైంది. అందుకే ఎఫ్-2 సినిమా రిజల్ట్ కోసం చాలా ఆతృతంగా ఎదురుచూస్తోందట. -
నాకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు: నటి
తమిళసినిమా: ఆ నిర్ణయంలో మార్పు లేదు అంటున్నారు నటి చార్మి. ఈ బ్యూటీ చాలా కాలం కిందట తమిళంలో కాదల్ అళివదిలై, లాడం వంటి కొన్ని చిత్రాల్లో నటించారు. ఆ తరువాత టాలీవుడ్‌పైనే దృష్టి సారించారు. పలు తెలుగు చిత్రాల్లో కథానాయకిగా నటించిన చార్మి కొన్ని స్పెషల్ సాంగ్స్‌లోనూ ఆడి అందాలను ఆరబోశారు. ప్రస్తుతం అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో నిర్మాత అవతారమెత్తారు. అయితే చార్మీపై పలు ప్రేమ వదంతులు హల్చల్ చేశాయి. తాను ప్రేమలో మోసపోయానని, అందువల్ల పెళ్లి చేసుకోకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తాజాగా సోషల్‌మీడియాలో ప్రచారం వైరల్ అవుతోంది. ఆ సంగతేమిటో చూద్దాం. నా జీవితంలో ఒకతన్ని గాఢంగా ప్రేమించాను. అయితే రెండు కారణాలతో ఆ ప్రేమ విఫలమైంది. ఒక వేళ మేము పెళ్లి చేసుకున్నా అదే కారణాలతో విడిపోవలసివచ్చేది. ఆ వ్యక్తి ప్రవర్తన కారణంగా నాకు ప్రేమ, పెళ్లిపై నమ్మకం పోయింది. అయితే అతను మంచి వాడే. ఇక నాకు మరో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ఒక వ్యక్తిని మనసారా ప్రేమించి, మరొకరితో కలిసి జీవించడం, అతని కోసం వేచి చూడటం, సమయాన్ని కేటాయించడం, వంటా వార్పు అంటూ ఇంటి పనులు చేయడం నా వల్ల కాని పని. అందుకే ఇకపై వివాహమే చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు అని చార్మి పేర్కొన్నారు. చార్మి సంచలన నిర్ణయం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
మెరుపు చూపిస్తున్న ‘జిగేల్ రాణి’
ముకుంద సినిమాతో తెలుగు తెరపై మెరిసిన పూజ హెగ్డే అందంతోనే కాదు నటనతోనూ ఆకట్టుకుంది. తరువాత బాలీవుడ్‌పై కన్నేసింది ఈ సుందరి. హృతిక్‌రోషన్ సినిమా మొహంజదారో సినిమాలో నటించింది. కానీ అది బెడిసికొట్టింది. సినిమా ఆడకపోవడంతో నిరాశ పడినా...తెలుగులో అల్లుఅర్జున్ సరసన డీజే సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమాలో అమ్మడు అందాలకు ఫిదా అయ్యారు తెలుగు ప్రేక్షకులు. ఇప్పుడు వరుస కట్టి తెలుగులో సినిమాలు చేస్తోంది. రాంచరణ్ రంగస్థలం సినిమాలో చేస్తున్న జిగేల్ రాణి అంటూ సాగే ప్రత్యేకగీతం మాత్రం తనకు ప్రత్యేకమే అంటోంది ఈ చిన్నది. ఆ సాంగ్‌ను తలుచుకుంటూ ఉంటే ఇప్పటికీ తనకు ఎగిరి గంతులేయానిపిస్తుందటా. అంతలా ఆ సాంగ్ ఆడియో, విజువలైజేషన్ తనను ఆకట్టుకున్నాయని చెపుతోంది. ప్రస్తుతం పూజ ప్రభాస్, ఎన్టీఆర్, మహేశ్ బాబుల సినిమాలతో బిజీగా ఉంది. అంతేకాదు హైదరాబాద్ మోస్ట్ డిజరైబుల్ ఉమెన్ లిస్ట్‌లో కాజల్, తమన్నా, శృతిహాసన్ లాంటి సీనియర్లను వెనక్కినెట్టి పూజ అగ్రస్థానంలో నిలబడింది. -
క్రిస్మస్ కీర్తన
-
ప్రత్యేక గీతాల్లో నటించను: శ్యామల
ప్రత్యేక గీతాల్లో నటించే ఉద్దేశం తనకు లేదని టీవీ వ్యాఖ్యాత, నటి శ్యామల అన్నారు. బెస్ట్ యాంకర్ల జాబితాలో తన పేరు ఉండాలన్న కోరికను ఆమె వ్యక్తపరిచారు. లౌక్యం, ఒక లైలా కోసం సినిమాల్లో చేసిన పాత్రలకు మంచి గుర్తింపు రావడంతో వరుసగా అవకాశాలు వస్తున్నాయని తెలిపారు. అయితే సినిమాల కోసం టీవీ షోలు వదులుకోబోనని స్పష్టం చేశారు. సినిమాల్లో ప్రత్యేక గీతాలు చేసే అవకాశం వచ్చిన వార్తలపై శ్యామల స్పందించారు. ప్రస్తుతం ప్రత్యేక గీతాల్లో నటించే ఉద్దేశం తనకు లేదన్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్ కు దగ్గర కావాలన్నదే తన లక్ష్యమన్నారు. కర్ణాటకకు చెందిన శ్యామల తెలుగులో అనర్గళంగా మాట్లాడుతూ మంచి వ్యాఖ్యాతగా గుర్తింపు పొందారు. అయితే దీనికోసం తాను ప్రత్యేకంగా శిక్షణ తీసుకోలేదని చెప్పారు. చిన్నప్పుడు పరిషత్ నాటకాల్లో నటించానని వెల్లడించారు. ఓ తెలుగు నాటకంలో ఉత్తమ బాలనటిగా అవార్డు కూడా అందుకున్నానని కూడా తెలిపారు. అభిషేకం, లయ, హ్యేపీ డేస్ సీరియల్స్ లో నటించిన శ్యామలకు 18 ఏళ్ల వయసులో పెళ్లైంది. భర్త, అత్తింటివారు అండగా నిలవడం వల్లే కెరీర్ ఆటంకం లేకుండా ముందుకుసాగుతోందని తెలిపారు. -
స్పెషల్ సాంగ్స్‌కే కాదు...ఆర్ట్ సినిమాలకూ రెడీ!
సినిమా పరిశ్రమలో ఎప్పుడు ఎవరికి బ్రేక్ వస్తుందో ఎవరూ ఊహించలేరు. ‘ఈగ’లో అతిథి పాత్రకు అంగీకరించినప్పుడు హంసానందిని కూడా తన కెరీర్‌కి అది మంచి మలుపు అవుతుందని ఊహించలేదు. ‘ఈగ’ తర్వాత వరుసగా మిర్చి, అత్తారింటికి దారేది, భాయ్ చిత్రాల్లో అవకాశాలు దక్కించుకున్నారామె. ఈ ఆరడుగుల అందం అసలు పేరు పూనమ్. ‘అనుమానాస్పదం’తో కథానాయికగా పరిచయం చేసినప్పుడు సీనియర్ దర్శకుడు వంశీ ఆమె పేరుని హంసానందినిగా మార్చారు. ఆ పేరంటే తనకెంతో ఇష్టమంటున్న హంసానందినితో జరిపిన ఇంటర్వ్యూ... ఈ మధ్య అతిథి పాత్రలు, ఐటమ్ సాంగ్స్‌కు మీరే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయినట్టున్నారు. ఈ పరిణామం ఎలా అనిపిస్తోంది? లక్కీ అని చెప్పాలి. ఎందుకంటే, నేను స్క్రీన్ మీద కనిపించేది కాసేపే అయినా ప్రేక్షకులకు బాగానే గుర్తుండిపోతున్నాను. హంసా చాలా స్టయిలిష్‌గా ఉందనీ గ్లామరస్‌గా ఉందనీ అభినందిస్తున్నారు. ఇలా ఐటమ్ సాంగ్స్‌కే పరిమితమైపోవాలనుకుంటున్నారా? అలా ఏం లేదు. నేను చేసేవి ఐటమ్ సాంగ్స్ కాదు... స్పెషల్ సాంగ్స్ అనాలి. ఎందుకంటే, మీరిప్పటివరకు నేను చేసిన పాటలను చూస్తే కథలో భాగంగానే అవి ఉంటాయి. అలాగే, పాటలో మాత్రమే కాకుండా రెండు, మూడు సీన్స్‌లో కూడా ఉంటాను కదా. స్పెషల్ సాంగ్స్ చేయడానికి నేనెప్పుడూ సిద్ధమే. అలాగని పాటలకే పరిమితమైతే నాకు నేను బోర్ కొట్టడంతో పాటు ప్రేక్షకులకు కూడా బోర్ కొట్టేస్తాను. అందుకే లీడ్ రోల్స్ చేయాలనుకుంటున్నాను. ‘ఈగ’ ఒప్పుకున్నప్పుడు గెస్ట్ రోల్స్ పరంగా మీకు డిమాండ్ పెరుగుతుందనుకున్నారా? అస్సలు ఊహించలేదు. ఆ సినిమాకి రాజమౌళిగారు అడిగినప్పుడు, మీ పాత్ర తెరపై కనిపించేది కాసేపే... ఎక్కువసేపు కనిపిస్తే అంత ఇంపాక్ట్ ఉండదన్నారు. ఆయన మాటలు అక్షరాలా నిజం. ‘ఈగ’లో నేను తక్కువ సమయం కనిపించినా, మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమా విడుదలైన తర్వాత చాలామంది దర్శక, నిర్మాతలు ఫోన్ చేసి, చిన్న పాత్ర అయినా క్యూట్‌గా ఉందన్నారు. వంశీ ‘అనుమానాస్పదం’లో కథానాయికగా చేశారు.. ఆ తర్వాత హీరోయిన్గా రాణించలేకపోవడానికి కారణం ఏంటి? వంశీగారు ఎంత మంచి దర్శకులో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమాలో కథానాయికగా చేసే అవకాశం రావడం ఓ అదృష్టం. ఆ సినిమా తర్వాత సినిమాల ఎంపిక విషయంలో తప్పు జరిగింది. దానివల్ల కెరీర్ అనుకున్న విధంగా సాగలేదు. ఇప్పుడు హీరోయిన్గా ఏమైనా సినిమాలు చేస్తున్నారా? నేను చేసే అతిథి పాత్రలకు ఎంత పేరొచ్చినా, ఫుల్ లెంగ్త్ రోల్స్ చేసినప్పుడు లభించే సంతృప్తి వేరు. అందుకే, లీడ్ రోల్స్‌పై దృష్టి సారించాలనుకుంటున్నాను. కొన్ని మంచి అవకాశాలు ఉన్నాయి. ఏది పడితే అది కాకుండా మంచి ప్రాజెక్ట్‌ని ఎన్నుకోవాలనుకుంటున్నాను. ప్రస్తుతం చేస్తున్న ‘రుద్రమదేవి’లో మీ పాత్ర ఎలా ఉంటుంది? ఇందులో నా పాత్ర పేరు ‘మధానికా’. ఓ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తాను. ఏడెనిమిది లుక్స్ టెస్ట్ చేసిన తర్వాత ఓ లుక్‌ని ఫైనలైజ్ చేశారు. ఈ సినిమా కోసం నా బాడీ లాంగ్వేజ్ కూడా మార్చుకున్నాను. గ్లామరస్ రోల్స్ మాత్రమేనా.. డీ-గ్లామర్ రోల్స్ కూడా చేయాలనుకుంటున్నారా? నటిగా నిరూపించుకునే అవకాశం ఉన్న ఏ పాత్ర అయినా చేస్తాను. కథ, కేరక్టర్ బాగుంటే ఆర్ట్ ఫిల్మ్‌లో చేయడానికి కూడా రెడీ. అలాగే మంచి ఫైట్స్ డిమాండ్ చేసే యాక్షన్ మూవీస్‌లో చేయడానికి కూడా సిద్ధమే.