మహా శివరాత్రి శివ భక్తులకు అత్యంత ఇష్టమైన పండుగ. ఈ పండుగ తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాల్లో అత్యంత వైభవంగా జరుగుతుంది. శివభక్తులు తమ ఇష్టదైవానికి ప్రత్యేక పూజలు చేయడంతో పాటు ప్రత్యేక గీతాలు ఆలపిస్తారు. అలాగే శివుడి చరిత్రను వివరిస్తూ పలు సినిమాలు కూడా వచ్చాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 18న మహాశివరాత్రి సందర్భంగా ఆ పరమశివుడి గుర్తు చేసుకుంటూ అత్యంత ప్రీతికరమైన పాటలేవో తెలుసుకుందాం.
ఓం మహాప్రాణ దీపం సాంగ్ -శ్రీ మంజునాథ (2001)
ఇది చిరంజీవి, అర్జున్ సర్జా నటించిన శ్రీ మంజునాథ (2001) చిత్రంలోని చాలా ప్రజాదరణ పొందిన భక్తి గీతం. ప్రసిద్ధ తెలుగు పాటను శంకర్ మహదేవన్ పాడారు.
ఈ పాదం -శ్రీ మంజునాథ (2001)
శ్రీ మంజునాథ చిత్రంలోని శ్రీపాదం ప్రసిద్ధ పాటను ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోసం పాడారు.
ఆటగదరా శివా .. ఆటగదా కేశవ సాంగ్
జీవిత చిత్రాన్ని చూపించే పాటల్లో ఎక్కువ మందికి ఇష్టమైన పాట ఆటగదరా శివా... ఈ పాటలో ప్రతి అక్షరం అద్భుతమే. ఆటగదరా శివా ఆటగద కేశవా అంటూ సాగే పాట చిన్న చిన్న పదాలతో జీవితాన్ని తట్టిలేపిన తనికెళ్ల భరణి రచించగా.. ఈ పాటను ఏసుదాసు ఆలపించారు.
ఎట్టాగయ్యా శివా శివా
మరణానికి-పుట్టుకకు మధ్యలో అన్నీ ఎదురీతలే. బంధాలకు ప్రతిమనిషీ బందీనే, అందరికీ వేదన బాధ ఒక్కటే... దయచూడు భోళాశంకరా కరుణ చూపించు అంటూ సాగే ఈ పాట ఆటగదరా శివ సినిమాలో హైలెట్‌గా నిలిచింది.
భ్రమ అని తెలుసు సాంగ్
బ్రతుకంటే బొమ్మల ఆట.. పుట్టుక తప్పదు, మరణం తప్పదు.. అన్నీ తెలిసి మాయలో బతుకుతున్నాం అంటూ మనిషిలో ఉంటే అంతర్యామిని తట్టిలేపే పాట ఇది. జగద్గురు ఆదిశంకరాచార్య సినిమాలోని ఈ పాట శివ భక్తులకు ఇష్టమైన పాటగా నిలిచింది.
మాయేరా అంతా మాయేరా
నీ ముందూ నీ వెనుకా జరిగేదంతా మాయే.. మనవాళ్లు మనది అన్నది మాయే...జననం-మరణం మాయ మధ్యలో జరిగే నాటకం అంతా మాయ..జగమంతా మాయే..జనమంతా మాయే..కళ్లారా చూసే ప్రతిదీ తెల్లారితే మాయే అంటూ సాగే ఈ పాట ప్రతి ఒక్కరినీ ఆలోచింపచేసేలా ఉంటుంది
ఓ మహాదేవా సాంగ్
1966లో విడుదలైన ఓ మహాదేవ పాట శివునికి అంకితం చేయబడింది. తెలుగు చిత్రం పరమానందయ్య శిష్యుల కథ కోసం పి.సుశీల పాడారు.
లింగాష్టకం సాంగ్
లింగాష్టకం మ్యూజిక్ ఇయర్స్ ఆఫ్ శాండల్‌వుడ్ అనే సంగీత ఆల్బమ్‌కు చెందినది. దీనిని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు. ఈ పాట 1976లో విడుదలైంది.
Comments
Please login to add a commentAdd a comment