shivaratri festival
-
ముగిసిన మహా కుంభమేళా
మహాకుంభ్‌నగర్: ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక వేడుకగా రికార్డుకెక్కిన మహా కుంభమేళా శివరాత్రి పర్వదినం సందర్భంగా బుధవారం ముగిసింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాల ఘట్టానికి తెరపడింది. 144 సంవత్సరాల తర్వాత వచి్చన ఈ మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు పోటెత్తారు. 45 రోజులపాటు వైభవంగా సాగిన పుణ్యక్రతువులో ఉత్సాహంగా పాల్గొన్నారు. చివరి రోజు బుధవారం భక్తుల పుణ్యస్నానాలతో గంగ, యమున, సరస్వతి నదుల సంగమస్థలి కిక్కిరిసిపోయింది. ఒక్కరోజే 1.32 కోట్ల మంది తరలివచ్చారు. హరహర మహాదేవ అనే మంత్రోచ్ఛారణలతో ఈ ప్రాంతమంతా మార్మోగిపోయింది. చివరి రోజు కావడంతో భక్తులపై హెలికాప్టర్ల ద్వారా పూలవర్షం కురిపించారు. ఈ ఏడాది జనవరి 13న పౌష్య పూర్ణిమ రోజు మహా కుంభమేళా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26 వరకూ 66.21 కోట్ల మందికిపైగా జనం స్నానాలు ఆచరించారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సంఖ్య ప్రపంచంలోని చాలా దేశాల ఉమ్మడి జనాభా కంటే అధికం కావడం గమనార్హం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ నటులు మహా కుంభమేళాలో పాలుపంచుకున్నారు. భూటాన్ రాజు సైతం పుణ్నస్నానం ఆచరించారు. మహా కుంభమేళాను విజయవంతం చేయడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈసారి పటిష్టమైన చర్యలు చేపట్టింది. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించింది. డ్రోన్లు, కృత్రిమ మేధ కెమెరాలను రంగంలోకి దించింది. మహాకుంభ్‌నగర్‌లో ప్రత్యేకంగా టెంట్ సిటీని నిర్మించింది. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. -
తూర్పుగోదావరి జిల్లా తాడిపూడిలో విషాదం
-
YS Jagan: రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.
-
మహాశివరాత్రి స్పెషల్.. శివుని ప్రత్యేక గీతాలు
మహా శివరాత్రి శివ భక్తులకు అత్యంత ఇష్టమైన పండుగ. ఈ పండుగ తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాల్లో అత్యంత వైభవంగా జరుగుతుంది. శివభక్తులు తమ ఇష్టదైవానికి ప్రత్యేక పూజలు చేయడంతో పాటు ప్రత్యేక గీతాలు ఆలపిస్తారు. అలాగే శివుడి చరిత్రను వివరిస్తూ పలు సినిమాలు కూడా వచ్చాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 18న మహాశివరాత్రి సందర్భంగా ఆ పరమశివుడి గుర్తు చేసుకుంటూ అత్యంత ప్రీతికరమైన పాటలేవో తెలుసుకుందాం. ఓం మహాప్రాణ దీపం సాంగ్ -శ్రీ మంజునాథ (2001) ఇది చిరంజీవి, అర్జున్ సర్జా నటించిన శ్రీ మంజునాథ (2001) చిత్రంలోని చాలా ప్రజాదరణ పొందిన భక్తి గీతం. ప్రసిద్ధ తెలుగు పాటను శంకర్ మహదేవన్ పాడారు. ఈ పాదం -శ్రీ మంజునాథ (2001) శ్రీ మంజునాథ చిత్రంలోని శ్రీపాదం ప్రసిద్ధ పాటను ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోసం పాడారు. ఆటగదరా శివా .. ఆటగదా కేశవ సాంగ్ జీవిత చిత్రాన్ని చూపించే పాటల్లో ఎక్కువ మందికి ఇష్టమైన పాట ఆటగదరా శివా... ఈ పాటలో ప్రతి అక్షరం అద్భుతమే. ఆటగదరా శివా ఆటగద కేశవా అంటూ సాగే పాట చిన్న చిన్న పదాలతో జీవితాన్ని తట్టిలేపిన తనికెళ్ల భరణి రచించగా.. ఈ పాటను ఏసుదాసు ఆలపించారు. ఎట్టాగయ్యా శివా శివా మరణానికి-పుట్టుకకు మధ్యలో అన్నీ ఎదురీతలే. బంధాలకు ప్రతిమనిషీ బందీనే, అందరికీ వేదన బాధ ఒక్కటే... దయచూడు భోళాశంకరా కరుణ చూపించు అంటూ సాగే ఈ పాట ఆటగదరా శివ సినిమాలో హైలెట్‌గా నిలిచింది. భ్రమ అని తెలుసు సాంగ్ బ్రతుకంటే బొమ్మల ఆట.. పుట్టుక తప్పదు, మరణం తప్పదు.. అన్నీ తెలిసి మాయలో బతుకుతున్నాం అంటూ మనిషిలో ఉంటే అంతర్యామిని తట్టిలేపే పాట ఇది. జగద్గురు ఆదిశంకరాచార్య సినిమాలోని ఈ పాట శివ భక్తులకు ఇష్టమైన పాటగా నిలిచింది. మాయేరా అంతా మాయేరా నీ ముందూ నీ వెనుకా జరిగేదంతా మాయే.. మనవాళ్లు మనది అన్నది మాయే...జననం-మరణం మాయ మధ్యలో జరిగే నాటకం అంతా మాయ..జగమంతా మాయే..జనమంతా మాయే..కళ్లారా చూసే ప్రతిదీ తెల్లారితే మాయే అంటూ సాగే ఈ పాట ప్రతి ఒక్కరినీ ఆలోచింపచేసేలా ఉంటుంది ఓ మహాదేవా సాంగ్ 1966లో విడుదలైన ఓ మహాదేవ పాట శివునికి అంకితం చేయబడింది. తెలుగు చిత్రం పరమానందయ్య శిష్యుల కథ కోసం పి.సుశీల పాడారు. లింగాష్టకం సాంగ్ లింగాష్టకం మ్యూజిక్ ఇయర్స్ ఆఫ్ శాండల్‌వుడ్ అనే సంగీత ఆల్బమ్‌కు చెందినది. దీనిని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు. ఈ పాట 1976లో విడుదలైంది. -
నీట మునిగి ఏడుగురు మృత్యువాత
పెదపూడి/అడ్డతీగల/వినుకొండ/వెంకటగిరి రూరల్: తూర్పుగోదావరి, గుంటూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో మంగళవారం చోటుచేసుకున్న వేర్వేరు దుర్ఘటనల్లో నీట మునిగి ఏడుగురు మృత్యువాత పడగా.. మరో ఇద్దరు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం సంపరలో శివరాత్రి సందర్భంగా ఇద్దరు యువకులు కాలువలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ నీటమునిగి మృతి చెందారు. కరప గ్రామానికి చెందిన పేపకాయల అజయ్ (19), గొల్లపల్లి యశ్వంత్ (20) శహపురానికి చెందిన కరెడ్ల మణికంఠ స్నేహితులు. ఈ ముగ్గురూ మరికొందరితో కలిసి ముక్తేశ్వరస్వామి ఆలయ సమీపాన గల తుల్యభాగ నదీపాయ కాలువలో మంగళవారం పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రవాహ ఉధృతికి అజయ్, యశ్వంత్ నీట మునగ్గా.. మణికంఠ అదృష్టవశాత్తూ పైకి తేలి ఒడ్డుకు చేరుకున్నాడు. స్థానికులు కాలువలోకి దూకి కొనఊపిరితో ఉన్న యశ్వంత్‌ను బయటకు తీసి పెదపూడి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అప్పటికే యశ్వంత్ మృతి చెందగా.. మరికొంత సేపటికి అజయ్ మృతదేహం బయటపడినట్లు పెదపూడి ఎస్ఐ పి.వాసు తెలిపారు. ఇలా ఉండగా, అడ్డతీగల శివారున మద్దిగెడ్డ జలాశయం ప్రధాన పంట కాలువలో పడి మరో ఇద్దరు మృతి చెందారు. అడ్డతీగల గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న బవురువాక గ్రామానికి చెందిన చెదల కల్యాణ్రామిరెడ్డి, 8వ తరగతి విద్యార్థి జనుమూరి సాయిరామ్ వీరేంద్రరెడ్డి మృతి చెందారు. మరో ఇద్దరు గల్లంతు కాగా, శివరాత్రి సందర్భంగా దైవదర్శనం చేసుకునేందుకు వెళ్లిన మాతంగి ప్రతాప్ (16), సర్వేపల్లి బాలాజీ (12) తెలుగు గంగ కాలువలో పడి గల్లంతయ్యారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం జంగాలపల్లి తెలుగుగంగ కాలువ బ్రిడ్జి వద్ద మంగళవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వెంకటగిరి పట్టణంలోని బంగారుపేట దళితవాడకు చెందిన మాతంగి ప్రతాప్ ఆర్వీఎం ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు, అదే ప్రాంతానికి చెందిన సర్వేపల్లి బాలాజీ ప్రాథమికోన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నారు. శివరాత్రి సందర్భంగా బంగారుపేట సమీపంలో ఉన్న జంగాలపల్లి వీరభద్రయ్యస్వామి ఆలయానికని మంగళవారం ఇద్దరూ ఇంటి నుంచి బయలుదేరారు. ఆలయ సమీపంలోని తెలుగు గంగ కాలువ బ్రిడ్జి వద్ద కాలువలో ఈత కొట్టేందుకు దిగి నీటి ఉధృతికి గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం అగ్నిమాపక శాఖ అధికారులు, పోలీసులు చీకటి పడే వరకు గాలించినా ఫలితం దక్కలేదు. పండుగపూట విషాద ఘటనలు చోటుచేసుకోవడంతో ఆ కుటుంబాల్లో అంతులేని శోకం మిగిలింది. సరదాగా గడిపేందుకు వచ్చి.. గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం ఐనవోలు సమీపంలోని గుండ్లకమ్మ నదిలో స్నానానికి దిగి ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. వినుకొండకు చెందిన డ్రైవర్ మున్నీరు ఇంట్లో శుభకార్యానికి నరసరావుపేటకు చెందిన బంధువులు ఫైజుల్లాఖాన్, విజయవాడకు చెందిన ఆయేషా వచ్చారు. వీరితో కలిసి మున్నీరు కుటుంబం సరదాగా గుండ్లకమ్మ నది వద్దకు వెళ్లింది. అందరూ బ్రిడ్జి కింద కూర్చుని ఉండగా మున్నీరు కుమార్తె హీనా (19)తోపాటు ఎస్కే ఫైజుల్లాఖాన్ (17), ఆయేషా (19) స్నానానికని నదిలోకి దిగారు. లోతు అంచనా వేయలేకపోవడంతో ముగ్గురూ మునిగిపోయి మృత్యువాత పడ్డారు. వినుకొండ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. -
శివరాత్రికి స్పెషల్ బస్సులు
-
శివరాత్రి ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు
ధర్మవరం (శృంగవరపుకోట రూరల్), న్యూస్‌లైన్: విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో గల 85 శి వాలయాల్లో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరిం చుకుని ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ ఎన్వీఎస్ఎన్ మూర్తి వెల్లడించారు. ధర్మవరం శివారు సన్యాసయ్యపాలెంలో గల సన్యాసేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం శివరా త్రి సందర్భంగా చేపడుతున్న పలు ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడారు. మూడు జిల్లాల్లో గల ఎస్.కోటలోని పుణ్యగిరి, ధర్మవరంలోని సన్యాసేశ్వరస్వామి, రామతీర్థం, శ్రీ ముఖలింగం, రావివలస, ఎండల మల్లిఖార్జునుడు, అప్పికొండ, దారపాలెం, బలిఘట్టాం, సోమలింగపాలెం, దేవునిపూతసంగం, లింగాల తిరుగుడు తదితర శివాలయాల్లో రానున్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవాదాయశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందన్నారు. జాతరను విజయవంతంగా నిర్వహిం చేందుకు ఎస్.కోటలోని పుణ్యగిరి, ధర్మవరంలోని సన్యాసేశ్వరస్వామి ఆలయాల వద్ద 220 మంది పోలీ సులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామనీ, ఇందుకు సంబంధించి సర్కిల్ ఇన్స్పెక్టర్, స్థానిక ఎస్ఐలు, తహశీలార్లు, ఆలయాల ఈఓలతో చర్చించినట్లు తెలిపారు. ఉచిత దర్శనం మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పుణ్యగిరిలోని ఉమాకోటిలింగేశ్వరస్వామి, ధర్మవరంలోని సన్యాసేశ్వరస్వామితో పాటు మూడు జిల్లాల్లో గల శివాలయాలకు విచ్చేసే భక్తులకు ఉచిత దర్శన ఏర్పా ట్లు చేస్తున్నామని డిప్యూటీ కమిషనర్ తెలిపారు. అలాగే భక్తులకు ఉచితంగా పటిక బెల్లం (ప్రసాదం) అందించే విధంగా ఇప్పటికే ఆయా ఆలయాల ఈఓలకు ఆదేశించామన్నారు. భక్తుల సౌకర్యార్థం ఆల యాల వద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు, వైద్య సిబ్బందితో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. -
శివరాత్రి జాతరకు పక్కా ఏర్పాట్లు
జలుమూరు,న్యూస్‌లైన్ : శ్రీముఖలింగంలో శివ రాత్రి జాతర సజావుగా జరిగేలా పక్కా ఏర్పా ట్లు చేస్తున్నామని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎన్.వి.ఎస్.ఎన్.మూర్తి చెప్పారు. దీని కోసం దేవాదాయ, పోలీస్, రెవెన్యూ, ఇతర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తాయని వివరించారు. జాతరకు జరుగుతున్న ఏర్పాట్లను సోమవారం ఆయన పరిశీలించారు. ఆలయ అధికారులు, అర్చకులతో చర్చించారు. వృద్ధు లు, వికలాంగుల కోసం ప్రత్యేక క్యూలై న్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భక్తులకు ఎండతాకిడి లేకుండా షామియానాలు, తాటా కు పందిళ్లు వేయాలన్నారు. చక్రతీర్థ ఉత్సవం రోజున అదనపు బలగాలను నియమించాలని పోలీస్ శాఖకు లేఖ రాస్తామని వెల్లడిం చారు. భక్తులకు తాగునీరు అందించేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమిస్తామని చెప్పారు. నీటి ప్యాకెట్ల వల్ల కాలు ష్య సమస్య వస్తుందన్నారు. దేవాదాయ భూములకు కౌలు కట్టనివారికి నోటీసులు జారీచేస్తామన్నారు. తొలుత ఆయన ముఖలింగేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు స్వామివారి ఆశీర్వచనాలు అందజేశారు. ఆయన వెంట ఏసీ వి.శ్యామలాదేవి, పరిశీలకులు ప్రసాద్, పాలకొండ ఈవో జగన్నాథ్, స్థానిక ఆలయ మేనేజర్ సీహెచ్.ప్రభాకరరావు ఉన్నారు. ముమ్మరంగా పనులు శివరాత్రి జాతరకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ మేనేజర్ ప్రభాకరరావు చెప్పారు. సోమవారం నుంచి క్యూలైన్లు,తాటాకు పందిళ్లు, విద్యుత్ దీపాల అలంకరణ పనులు చేపట్టామని వివరించారు. ఇప్పటికే 65 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందన్న అంచనా మేరకు అదనపు క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఆక్రమణలపై కఠిన చర్యలు పాలకొండ రూరల్: దేవాదాయ శాఖ భూముల ఆక్ర మణకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆ శాఖ డిప్యూటీ కమిషనర్ మూర్తి చెప్పారు. సోమవారం కోటదుర్గమ్మ ఆలయా న్ని సందర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని 1,392 దేవస్థానాలకు 53 వేల ఎకరాల భూమి ఉండగా ఇం దులో 6,300 ఎకరాల మెట్టు, 4,400 ఎకరాల పల్లపు భూములు అన్యాక్రాంతమయ్యాయని, వీటిపై కేసులు నడుస్తున్నాయని వివరించారు. ఆలయ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని వివరించారు. దేవాదాయ శాఖ భూముల రిజిస్ట్రేషన్లు చేయవద్దని ఆ శాఖను కోరామని తెలిపారు. రైతులకు 33,950 ఎకరాలు లీజుకు ఇచ్చామని వెల్లడించారు. ఆయన వెంట ఆలయ ఈవో కె.వి.రమణమూర్తి, ధర్మకర్తల మండలి చైర్మన్ శాసపు సర్వారావు, ప్రధాన అర్చకుడు దార్లపూడి లక్ష్మీప్రసాదశర్మ తదితరులున్నారు.