శివరాత్రి ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు
Published Wed, Feb 26 2014 3:17 AM | Last Updated on Sat, Sep 2 2017 4:05 AM
ధర్మవరం (శృంగవరపుకోట రూరల్), న్యూస్‌లైన్: విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో గల 85 శి వాలయాల్లో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరిం చుకుని ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తి వెల్లడించారు. ధర్మవరం శివారు సన్యాసయ్యపాలెంలో గల సన్యాసేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం శివరా త్రి సందర్భంగా చేపడుతున్న పలు ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడారు. మూడు జిల్లాల్లో గల ఎస్.కోటలోని పుణ్యగిరి, ధర్మవరంలోని సన్యాసేశ్వరస్వామి, రామతీర్థం, శ్రీ ముఖలింగం, రావివలస, ఎండల మల్లిఖార్జునుడు, అప్పికొండ, దారపాలెం, బలిఘట్టాం, సోమలింగపాలెం, దేవునిపూతసంగం, లింగాల తిరుగుడు తదితర శివాలయాల్లో రానున్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవాదాయశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందన్నారు. జాతరను విజయవంతంగా నిర్వహిం చేందుకు ఎస్.కోటలోని పుణ్యగిరి, ధర్మవరంలోని సన్యాసేశ్వరస్వామి ఆలయాల వద్ద 220 మంది పోలీ సులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామనీ, ఇందుకు సంబంధించి సర్కిల్ ఇన్‌స్పెక్టర్, స్థానిక ఎస్‌ఐలు, తహశీలార్లు, ఆలయాల ఈఓలతో చర్చించినట్లు తెలిపారు.
ఉచిత దర్శనం
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పుణ్యగిరిలోని ఉమాకోటిలింగేశ్వరస్వామి, ధర్మవరంలోని సన్యాసేశ్వరస్వామితో పాటు మూడు జిల్లాల్లో గల శివాలయాలకు విచ్చేసే భక్తులకు ఉచిత దర్శన ఏర్పా ట్లు చేస్తున్నామని డిప్యూటీ కమిషనర్ తెలిపారు. అలాగే భక్తులకు ఉచితంగా పటిక బెల్లం (ప్రసాదం) అందించే విధంగా ఇప్పటికే ఆయా ఆలయాల ఈఓలకు ఆదేశించామన్నారు. భక్తుల సౌకర్యార్థం ఆల యాల వద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు, వైద్య సిబ్బందితో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.
Advertisement
Advertisement