TG: వన్యప్రాణుల దాహార్తి.. అటవీ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు | Wild Animals Quenching Their Thirst In Telangana Forests | Sakshi
Sakshi News home page

వన్యప్రాణుల దాహార్తి తీరుస్తున్న తెలంగాణ అటవీ శాఖ

Published Tue, Apr 2 2024 5:51 PM | Last Updated on Tue, Apr 2 2024 6:03 PM

Wild Animals Quenching Their Thirst In Telangana Forests - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: వేసవి మండుతోంది. మనుషులతో పాటు జంతువుల గొంతులు తడారిపోతున్నాయి. ప్రస్తుత కరువు పరిస్థితుల్లో అడవిలో ఉండే వన్య ప్రాణులైతే తాగడానికి గుక్కెడు నీటి కోసం వెతుకుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని అడవులలో అటవీ శాఖ ఏర్పాటు చేసిన కృత్రిమ నీటి గుంటల(సాసర్‌ పిట్‌)లో నీటిని తాగి వణ్యప్రాణులు తమ దాహార్తిని తీర్చుకుంటున్నాయి.

రాష్ట్రంలో ఆదిలాబాద్ నుంచి అమ్రాబాద్‌ దాకా ఉన్న అడవుల్లో పులి, జింకలు, అడవి దున్నలు, హైనాలు, పక్షులు, పాములు  దాహం తీర్చుకుంటున్న పలు దృశ్యాలు కెమెరా కంటికి చిక్కాయి. వీటిని తెలంగాణ అటవీ శాఖతో పాటు పలువురు వన్యప్రాణి ప్రేమికులు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.  ఓ వైపు నిధుల కొరత వేధిస్తున్నా వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు తెలంగాణ అటవీ శాఖ తీసుకుంటున్న చర్యలను నెటిజన్లు కొనియాడుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement