special arrangements
-
TG: వన్యప్రాణుల దాహార్తి.. అటవీ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు
సాక్షి,హైదరాబాద్: వేసవి మండుతోంది. మనుషులతో పాటు జంతువుల గొంతులు తడారిపోతున్నాయి. ప్రస్తుత కరువు పరిస్థితుల్లో అడవిలో ఉండే వన్య ప్రాణులైతే తాగడానికి గుక్కెడు నీటి కోసం వెతుకుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని అడవులలో అటవీ శాఖ ఏర్పాటు చేసిన కృత్రిమ నీటి గుంటల(సాసర్ పిట్)లో నీటిని తాగి వణ్యప్రాణులు తమ దాహార్తిని తీర్చుకుంటున్నాయి. Interesting camera trap pics from the forests of Telangana Thirsty Animals Find Refuge in Artificial Water Sources in Telangana. As the drought intensifies, thirsty animals are relying on artificial water sources provided by Forest officials. Despite a funding crunch, Forest… pic.twitter.com/JJCf0IK1nq — Sudhakar Udumula (@sudhakarudumula) April 2, 2024 రాష్ట్రంలో ఆదిలాబాద్ నుంచి అమ్రాబాద్ దాకా ఉన్న అడవుల్లో పులి, జింకలు, అడవి దున్నలు, హైనాలు, పక్షులు, పాములు దాహం తీర్చుకుంటున్న పలు దృశ్యాలు కెమెరా కంటికి చిక్కాయి. వీటిని తెలంగాణ అటవీ శాఖతో పాటు పలువురు వన్యప్రాణి ప్రేమికులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఓ వైపు నిధుల కొరత వేధిస్తున్నా వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు తెలంగాణ అటవీ శాఖ తీసుకుంటున్న చర్యలను నెటిజన్లు కొనియాడుతున్నారు. A waterhole being filled with water using solar power borewell in Birsaipet range of Utnoor #Telangana @TbiHindi @thebetterindia @IUCN @WorldBankWater @DoWRRDGR_MoJS @IUCN_Water pic.twitter.com/fHmwWxev1r — Mohan Pargaien IFS🇮🇳 (@pargaien) March 31, 2024 -
తొలి రోజు శ్రీబాలా త్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మ దర్శనం
-
తిరుమల నడకమార్గంలో చిరుత దాడి నేపథ్యంలో టీటీడీ అలర్ట్
-
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ప్రత్యేక ఏర్పాట్లు
-
షిఫ్ట్ పద్ధ్దతిలో పార్లమెంట్
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల మొదటి వారంలో సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశముందని రాజ్యసభ సెక్రటేరి యట్ వర్గాలు తెలిపాయి. కోవిడ్–19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని మొదటిసారిగా పలు ముందు జాగ్రత్త చర్యలు, ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నారు. దీన్లో భాగంగా, ఈసారి ఉభయ సభలు ఒకదాని తర్వాత మరోటి సమావేశం కానున్నాయి. ఉదయం ఒక సభ జరిగితే, మరో సభ సాయంత్రం సమావేశమవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మార్చి 23వ తేదీన అర్ధంతరంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం.. పార్లమెంట్ చివరి సమావేశాలు జరిగిన ఆరు నెలల్లోగా సమావేశాలు జరగాల్సి ఉంది. 1952 తర్వాత ఇదే ప్రథమం..! రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా జూలై 17వ తేదీన సమావేశమై పార్లమెంట్ సమావేశాల నిర్వహణపై వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలించిన అనంతరం ఈ మేరకు నిర్ణయించారు. ఈ నెల 20వ తేదీ వరకు ఏర్పాట్లు పూర్తయితే, ప్రయోగాత్మకంగా పరిశీలించిన అనంతరం తుదిమెరుగులు దిద్దాల్సి ఉంటుందని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సెక్రటేరియట్ అధికారులు రెండు వారాలుగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. భౌతికదూరం పాటిస్తూ ఏర్పాటు చేసిన సీట్ల అమరిక కారణంగా ఉభయ సభల చాంబర్లతోపాటు గ్యాలరీల్లోనూ రాజ్యసభ సభ్యులు కూర్చుంటారు. రాజ్యసభ చాంబర్లో 60 మంది, గ్యాలరీల్లో 51 మంది, మిగతా 132 మంది సభ్యులు లోక్‌సభ చాంబర్లో కూర్చుంటారు. 1952వ సంవత్సరం తర్వాత ఇలాంటి ఏర్పాటు చేయడం పార్లమెంట్ చరిత్రలో ఇదే ప్రథమమని రాజ్యసభ సెక్రటేరియట్ వర్గాలు తెలిపాయి. భారీ డిస్ప్లే స్క్రీన్లు రాజ్యసభ చాంబర్లో 4 భారీ డిస్ప్లే స్క్రీన్లు, నాలుగు గ్యాలరీల్లో కలిపి 6 చిన్న స్క్రీన్లు, గ్యాలరీల్లో ఆడియో కన్సోల్స్, సూక్ష్మక్రిములను చంపే అల్ట్రా వయొలెట్ పరికరాలు, ఆడియో విజువల్ సిగ్నల్స్ కోసం ఉభయ సభలను కలుపుతూ ప్రత్యేక కేబుళ్లు, అధికారుల గ్యాలరీని చాంబర్‌తో వేరు చేస్తూ ప్రత్యేక ప్లాస్టిక్ షీట్ల అమరిక వంటివి ఇందులో ఉన్నాయని రాజ్యసభ సెక్రటేరియట్ అధికారులు తెలిపారు. కోవిడ్–19 వ్యాప్తి దృష్ట్యా భౌతిక దూరం నిబంధనలను దృష్టిలో ఉంచుకుని వీటిని చేపట్టినట్లు పేర్కొన్నారు. లోక్‌సభ సెక్రటేరియట్ కూడా ఇవే రకమైన ఏర్పాట్లను చేపట్టింది. సీట్ల అమరిక ఇలా... వివిధ పార్టీల సభ్యుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని రాజ్యసభలో కొందరికి, మరికొందరికి లోక్‌సభలోని అధికార పక్షం, ఇతరులు కూర్చునే రెండు బ్లాకులను ప్రత్యేకించారు. రాజ్యసభ చాంబర్లో ప్రధానమంత్రి, విపక్ష, అధికార పక్షం నేతలు, ఇతర పార్టీల వారికి సీట్లు కేటాయించారు. మాజీ ప్రధానులు మన్మోహన్సింగ్, దేవెగౌడ, రాజ్యసభ సభ్యులైన కేంద్ర మంత్రులు రాంవిలాస్ పాశ్వాన్, రాందాస్ అథవలేలకు కూడా చాంబర్లోనే చోటు కల్పించారు. మిగతా మంత్రులకు అధికార పక్షం సభ్యుల సీట్లే కేటాయించారు. సభ్యులు తమ సీట్ల నుంచే సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలుగా అన్ని సీట్లకు హెడ్ఫోన్లు, తదితర పరికరాలను అమర్చారు. రాజ్యసభలోని ప్రతి గ్యాలరీలో ఆయా పార్టీలకు కేటాయించిన సీట్ల వద్ద ప్లకార్డులను ఏర్పాటు చేశారు. రాజ్యసభలో బ్యాక్టీరియా, వైరస్‌ను నాశనం చేసేందుకు ‘అల్ట్రా వయొలెట్ జెర్మిసైడల్ ఇర్రేడియేషన్’ వ్యవస్థను ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పరిమితంగానే అధికారులకు అవకాశం రాజ్యసభలోకి సెక్రటేరియట్‌కు చెందిన అధికారులను పరిమితంగా 15 మందినే అనుమతిస్తారు. అదేవిధంగా, విదేశీ ప్రతినిధులకు కేటాయించిన ప్రత్యేక బాక్స్‌లో రిపోర్టర్లకు చోటు కల్పించారు. భౌతిక దూరం పాటిస్తూ, 15 మంది మాత్రమే కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. రాజ్యసభ టీవీ, లోక్‌సభ టీవీలు కూడా ఉభయసభల్లో కార్యక్రమాలను ప్రస్తుతమున్న ఏర్పాట్ల ప్రకారమే ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. దీంతోపాటు, వివిధ అధికార పత్రాలను సభ్యులకు భౌతికంగా అందజేసే అవసరాన్ని సాధ్యమైనంత మేరకు తగ్గించేలా ఏర్పాట్లు చేçపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. -
ఆ జైలు గదిలో సకల సౌకర్యాలు
ముంబై: గోడకు 40 అంగుళాల ఎల్సీడీ టీవీ, వెస్ట్రన్ స్టైల్ టాయిలెట్, 6 ట్యూబ్‌లైట్లు, 3 ఫ్యాన్లు, బట్టలు ఉతుక్కోవడానికి ప్రత్యేక చోటు, గాలి వెలుతురు బాగా వచ్చేలా పెద్ద కిటికీలు, వాకింగ్ కోసం ఆవరణ, సెల్ నుంచి నేరుగా లైబ్రరీకి వెళ్లడానికి దారి. కింగ్‌ఫిషర్ అధినేత విజయ్‌మాల్యా కోసం మహారాష్ట్ర జైలు అధికారులు చేసిన ఏర్పాట్లు ఇవి. బ్యాంకులకు రూ. 9 వేల కోట్లకు పైగా రుణాలను ఎగ్గొట్టి లండన్ పారిపోయిన మాల్యాను వెనక్కి రప్పించిన తరువాత ఆయన్ని ఉంచే జైలును సీబీఐ సిద్ధం చేసి, దాని వీడియోను బ్రిటన్ కోర్టుకు పంపింది. భారత్‌లో జైళ్లు శుభ్రంగా ఉండవని, అందుకే తాను వెళ్లనంటూ మాల్యా ఆరోపించడం తెల్సిందే. దీంతో మాల్యాను ఉంచబోయే జైలు గదిని వీడియో తీసి పంపించాలంటూ లండన్ కోర్టు ఆదేశించింది. మహారాష్ట్ర అధికారులు ముంబై ఆర్థర్ రోడ్ జైలులోని 12వ నంబర్ బ్యారెక్‌ను ముస్తాబు చేశారు. గదిలో ప్రతీది తెలిసేలా 8 నిమిషాల వీడియో తీసి లండన్ కోర్టుకు ఇచ్చారు. మంచంపై మెత్తటి పరుపు, శుభ్రంగా ఉతికిన దుప్పట్లు, దిండ్లు ఉంచారు. టీవీలో ఆంగ్ల, మరాఠీ చానెల్స్ వచ్చే ఏర్పాట్లు చేశారు. మాల్యాను ఉంచబోయే బ్యారెక్ లోపల, బయట రేయింబవళ్లు గార్డులు కాపలా ఉంటారు. సీసీటీవీ కెమెరాల నిఘా ఉంటుంది. ఇక్కడ పేరు ప్రఖ్యాతులున్న ఖైదీలను, ప్రాణహానీ ఉన్న వారిని ఉంచుతారు. -
వైకుంఠ ఏకాదశికి తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు
తిరుమల: వైకుంఠ ఏకాదశికి తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. ఈ నెల 29న ఏకాదశి,30న ద్వాదశి రానుంది. ఏకాదశి శుక్రవారం రావటంతో శ్రీవారి దర్శనం నాలుగు గంటలు ఆలస్యం కానుంది. ఏకాదశి నాడు ఉదయం ఐదున్నర గంటలకు వీఐపీ దర్శనం,8 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుందని జేఈఓ శ్రీనివాసరాజు తెలిపారు. డిసెంబర్ 28 నుంచి జనవరి ఒకటో తేదీ వరకు దివ్య దర్శనం, ఆర్జిత సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు, సిఫార్సు లేఖలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. రాజ్యంగ బద్దంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ఏకాదశినాడు ఆరు వీఐపీ దర్శన టికెట్లు, రాజ్యాంగేతర వీఐపీలకు నాలుగు వీఐపీ దర్శన టికెట్లు కేటాయిస్తామన్నారు. ఏకాదశి దర్శనానికి వచ్చే భక్తులను 28న ఉదయం 10 గంటలకు వైకుంఠం క్యూకాంప్లెక్స్లోకి అనుమతిస్తామని జేఈఓ చెప్పారు. తిరుమలలో అదనంగా ఆరు కిలొమీటర్ల క్యూలైన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ద్వాదశి నాడు వీఐపీ దర్శనాలు రద్దు చేశామని, భక్తులకు నిరంతరం ఆహారం, నీరు అందిస్తామని జేఈఓ అన్నారు. -
సర్వం సిద్ధం
♦ నేడు రాష్ట్రపతి ఎన్నికలు ♦ ఢిల్లీకి ఎంపీలు ♦ చెన్నైకు ఎమ్మెల్యేలు ♦ కరుణ ఓటు వేసేనా ♦ ఎన్నికలకు పీఎంకే దూరం ♦ అన్నాడీఎంకే కార్యాలయం ముట్టడికి యత్నం రాష్ట్రపతి ఎన్నికలకు అసెంబ్లీ ఆవరణలో సర్వం సిద్ధం చేశారు. ఆ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సభ్యుల కోసం ఓటింగ్‌కు తగ్గ అన్ని వివరాలు, సూచనలతో బోర్డుల్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రానికి చెందిన ఎంపీలు అందరూ ఢిల్లీ పయనమయ్యారు. ఎమ్మెల్యేలు అందరూ చెన్నైకు చేరుకుంటున్నారు. సాక్షి, చెన్నై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం ముగియనుండడంతో 14వ కొత్త రాష్ట్రపతి ఎన్నిక నిమిత్తం సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. కేంద్రంలోని ఎన్డీయే అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతి పక్షాల అభ్యర్థిగా మీరా కుమార్ ఆ పదవి కోసం పోటీ పడుతున్నా రు. ఇప్పటికే ఈ ఇద్దరు చెన్నైలో పర్యటించి రాజ కీయ పక్షాల ఎమ్మెల్యేలు, ఎంపీల మద్దతును సేకరించారు. రాష్ట్రంలో 234 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా జయలలిత మరణంతో ఓ స్థానం ఖా ళీగా ఉంది. మిగిలిన సభ్యులు తమ ఓటు హక్కు ను వినియోగించుకోనున్నారు. డీఎంకే, కాంగ్రెస్, ఐయూఎంఎల్‌కు చెందిన ఎమ్మెల్యేలు ఓటింగ్ ని మిత్తం చెన్నైకు ఆదివారమే చేరుకున్నారు. అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ మద్దతు ఎ మ్మెల్యేలు ఒకరిద్దరు మినహా తక్కిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు చెన్నై చేరుకుంటున్నారు. ఇక, అన్నాడీఎంకేలో ఉన్న మనిదనేయ జననాయగ కట్చి ఎమ్మెల్యే తమీమున్ అన్సారి మాత్రం తన ఓటు మీరాకుమార్‌కు అని ప్రకటించడం గమనార్హం. ఎంపీలందరూ ఢిల్లీలో: ఇక, డీఎంకేకు చెందిన ఎంపీ కనిమొళి, తిరుచ్చిశివ, ఆర్ఎస్ భారతి, టీకేఎస్ ఇళంగోవన్, సీపీఎం రంగరాజన్, సీపీఐ డి.రాజా తమ ఓట్లను ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలోని పోలింగ్ కేంద్రంలో వినియోగించుకోనున్నారు. ఇక, అన్నాడీఎంకే చెందిన రాజ్యసభ, పార్లమెంట్ సభ్యులు అందరూ ఢిల్లీలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీళ్లంతా ఆదివారం సాయంత్రం ఢిల్లీ బయలు దేరి వెళ్లారు. ముందుగా ఎంపీలతో సీఎం పళనిస్వామి భేటీ అయ్యారు. మాజీ సీఎం పన్నీరు సెల్వం వెన్నంటి ఉన్న ఎంపీలను తమ వైపునకు తిప్పుకునే రీతిలో ఢిల్లీలో పావులు కదపాలని తమ శిబిరం ఎంపీలకు సూచించినట్టు సమాచారం. ప్రత్యేక ఏర్పాట్లు: ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎమ్మెల్యేలు సిద్ధం కావడంతో సచివాలయం ఆవరణలో అసెంబ్లీ సమావేశ మందిరం, పరిసరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. అసెంబ్లీ లాబీ ఆవరణలోకి మీడియాకు అనుమతి నిరాకరించారు. ఓటు హక్కు వినియోగించుకునే సభ్యులు ప్రవేశ మార్గంలో ఉన్న పుస్తకంలో సంతకంచేసినానంతరం లోనికి వెళ్లే రీతిలో ఏర్పాట్లు చేశారు. వారి వెంట ఎవర్నీ అనుమతించరు. ఎన్నికల అధికార్లుగా వ్యవహరిస్తున్న అసెంబ్లీ కార్యాదర్శి(ఇన్) భూపతి, సంయుక్త కార్యదర్శి సుబ్రమణియన్ సభ్యుల గుర్తింపు కార్డులు, ఇతర కార్డులను పరిశీలిస్తారు. తదుపరి ఓటింగ్ హాల్లోకి ఒక్కొక్కర్ని మాత్రమే అనుమతించనున్నారు. బ్యాలెట్ పేపర్, పెన్ను స్వయంగా ఎన్నికల వర్గాలు అందిస్తాయి. ఆ పెన్ను ద్వారా మాత్రమే ఎవరికి ఓటు అన్నది నమోదు చేయాల్సి ఉంటుంది. బ్యాలెట్ బాక్సులు, పేపర్లు అన్ని సిద్ధం చేయడంతో పాటు, అక్కడక్కడ సభ్యులకు ఓటింగ్ నిబంధనలను సూచించే బోర్డులను ఏర్పాటు చేశారు. ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలో కేంద్ర ఎన్నికల పర్యవేక్షణాధికారి అన్సు ప్రకాష్, రాష్ట్ర ఎన్నికల అధికారి రాజేష్ లఖానీ, ఎన్నికల ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులు, పేపర్లను స్ట్రాంగ్ రూముల నుంచి బయటకు తీస్తారు. పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల దృష్ట్యా, సచివాలయం, అసెంబ్లీ పరిసరాల్లో భద్రత కట్టుదిట్టంచేయడంతోపాటు వాహనాలకు ఆంక్షలు విధించారు. ఇక, కేంద్ర సహాయ మంత్రి, కన్యాకుమారి ఎంపీ పొన్ రాధాకృష్ణన్ బీజేపీ అభ్యర్థికి ఏజెంట్‌గా వ్యవహరించనున్నారు. ఆయన తన ఓటును చెన్నైలో వినియోగించుకోనున్నారు. అలాగే, కేరళకు చెందిన అబ్దుల్ ఎమ్మెల్యే కూడా చెన్నైలో ఓటు వేయనున్నారు. అయితే, డీఎంకే అధినేత కరుణానిధి ఓటు వేయడానికి వచ్చేది అనుమానమే. ఆయన విశ్రాంతిలో ఉండడం ఇందుకు నిదర్శనం. కరుణ ఓటు హక్కువినియోగించుకుంటారా అని మీడియా డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ను ప్రశ్నించగా, వేచి చూడాలని సూచించారు. పీఎంకే దూరం: రాష్ట్రపతి ఎన్నికలను పీఎంకే బహిష్కరించింది. లోక్‌సభ ఎన్నికల్లో ధర్మపురి నుంచి పీఎంకే యువజన నేత అన్భుమణి రాందాసు పార్లమెంట్‌కు ఎన్నికైన విషయం తెలిసిందే. ఆ పార్టీకి ఒకే ఒక సభ్యుడు రాష్ట్రంలో ఉన్నారు. అసెంబ్లీలో ఆ పార్టీ సభ్యులే లేరు. ఉన్న ఒక్క సభ్యుడు ఓటు ఎవరికి వేస్తారోనన్న ప్రశ్న బయలుదేరింది. అయితే, తాము ఎన్నికల్ని బహిష్కరిస్తున్నామని, ఎవ్వరికీ ఓటు వేయబోమని పీఎంకే అధినేత రాందాసు ప్రకటించారు. తమిళ ప్రజల మీద కేంద్రం చూపుతున్న చిన్నచూపునకు నిరసనగా ఎన్నికల్ని బహిష్కరిస్తున్నట్టు తెలిపారు. ఇక, రాష్ట్రం మీద కేంద్రం వైఖరిని నిరసిస్తూ పెరియార్ ద్రవిడ కళగం నేతృత్వంలో అన్నాడీఎంకే కార్యాలయం ముట్టడియత్నం ఆదివారం సాగింది. బీజేపీకి మద్దతు ఇవ్వొద్దని నినదిస్తూ ఆ కళగం వర్గాలు రాయపేటలోని అన్నాడీఎంకే కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. -
సోఫా, రెడ్‌కార్పెట్, ఏసీ వద్దు: సీఎం
లఖ్‌నవూ(ఉత్తరప్రదేశ్): తన పర్యటనల సందర్భంగా ఎటువంటి అదనపు ఏర్పాట్లు చేయొద్దని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల దియోరియా, గోరఖ్పూర్లలోని అమరులైన సైనిక కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో అధికారులు హడావుడి పడుతూ చేసిన ప్రత్యేక ఏర్పాట్లతో ప్రజలు ఇబ్బంది పడ్డారని సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇకపై ముఖ్యమంత్రి పర్యటనల సందర్భంగా ఏసీ, రెడ్ కార్పెట్, సోఫాలు సమకూర్చవద్దని అధికారులను ఆదేశించారు. అధికార దర్పాన్ని ప్రదర్శించుకునే ఇటువంటి చర్యలతో సీఎం చాలా అసహనంగా ఉన్నారని ఆ ప్రకటనలో కార్యాలయ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు జిల్లా ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, పరిపాలన విభాగాల అధిపతులకు ఆదేశాలు అందాయి. జూలై 8వ తేదీన గోరఖ్‌పూర్‌లో సీఎం పర్యటించిన సందర్భంగా అధికారులు.. కిలోమీటర్ మేర ఎర్ర తివాచీ పరిచారు. దారి పొడవునా ప్రజలు, నివాసాలు కనిపించకుండా రెండు వైపులా తెల్లటి కర్టెన్లు ఏర్పాటు చేశారు. అమరడైన సైనికుడి కుటుంబాన్నిపరామర్శిండానికి యోగి వెళ్లిన సమయంలో అధికారులు సైనికుడి ఇంట్లో కాషాయ రంగు కర్టెన్లు, ఎయిర్ కూలర్, ఎగ్జాస్ట్ ఫ్యాన్, ఖరీదైన సోఫా ఏర్పాటు చేశారు. మే 12వ తేదీన డియోరియాలో అమర సైనికుడి నివాసానికి వెళ్లిన సందర్భంలోనూ ఇవే హంగులు, ఆర్భాటాలు ఏర్పాటు చేశారు. ఆయన పర్యటన ముగిసిన కొద్ది నిమిషాల్లోనే వాటన్నింటిని తొలగించారు. అప్పట్లోనే వీటి విషయమై సీఎం ఆదిత్యనాథ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ అదే తీరు కొనసాగటంతో సీఎం కార్యాలయం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది. -
కరెన్సీకి ప్రత్యేకం!
సాక్షి, చెన్నై: ఒకటో తేదీన కరెన్సీ కష్టాలు మరింత జఠిలం కాకుండా ప్రత్యేక ఏర్పాట్ల మీద బ్యాంకులు దృష్టి పెట్టాయి. ప్రధాన ప్రాంతాల్లోని ఏటీఎంలలో రోజుకు రెండు సార్లు నగదును లోడ్ చేయడానికి నిర్ణయించారు. ఇక బుధవారం సాయంత్రం నుంచి ఏటీఎంల వద్ద జనం క్యూ కట్టడంతో గురువారం పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ తప్పలేదు. నల్లధనం కట్టడి వ్యవహారం నోట్ల సమస్యకు దారి తీసిన విషయం తెలిసిందే. కొత్త నోట్ల కోసం జనం మూడు వారాల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో డిసెంబరు ఒకటి వేతన దినం కావడంతో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగ, సిబ్బంది ఒకేసారిగా బ్యాంకులు, ఏటీఎంల ముందు బారులు తీరడం ఖాయం. ఇక, నోట్ల సమస్యతో అద్దె చెల్లింపులు, ఇంటిఖర్చుల నిమిత్తం కష్టాలు ఎక్కడ ముంచుకొస్తాయో అన్న ఆందోళన ఏర్పడింది. నల్లధనం అరికట్టే నిర్ణయం ఉత్తర్వుల తదుపరి వస్తున్న తొలి జీతం కావడంతో రాష్ట్రంలో లక్షలాది మంది బ్యాంకులు, ఏటీఎంల మీద ఆధారపడక తప్పడం లేదు. ఇక, బ్యాంకుల్లో అయితే, తొమ్మిది వేలలోపు, ఏటీఎంలలో అయితే, రూ. 2వేల వరకు నగదు తీసుకునేందుకు పరిమితం ఉండడంతో తిప్పలు తప్పవేమోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.ప్రత్యేకం : జీతం రోజును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. ఒకటి, రెండో తేదీల్లో అన్ని ఏటీఎంలలోనూ నగదు నిల్వ ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. ఐటీ తదితర సంస్థలు అత్యధికంగా ఉండే ప్రాంతాల్లో అక్కడి సిబ్బంది కోసం ప్రత్యేకంగా మొబైల్, మినీ ఏటీఎంలను ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. ప్రైవేటు సంస్థలు అయితే, రోజుకు రెండు సార్లు నగదును ఏటీఎంలలో పొందు పరిచేందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుని ఉండడం ఆహ్వానించదగ్గ విషయమే. అలాగే, రద్దీని బట్టి బ్యాంక్‌ల వద్ద, ఏటీఎంల వద్ద ప్రత్యేక కౌంటర్లను ప్రైవేటు బ్యాంకులు ఏర్పాటు చేయనున్నారుు. రిజర్వు బ్యాంక్ వర్గాలు సైతం నగదు కష్టాలను తీర్చే విధంగా పర్యవేక్షణలో పడ్డారు. అరుుతే, ఏ మేరకు నగదు కష్టాల్ని అధిగమించేందుకు అధికార వర్గాలు చర్యలు తీసుకున్నారో అన్నది గురువారం తేలనుంది. కాగా, కొన్ని ఏటీఎంల వద్ద బుధవారం సాయంత్రం నుంచే జనం బారులు తీరడం గమనార్హం. ఇక, కోయంబత్తూరు రీజియన్‌లో డిపాజిట్ చేసిన పాత నోట్లను బుధవారం నాలుగు కంటైనర్లలో చెన్నైకు తరలించారు. గట్టి భద్రత నడుమ రూ. 2,155 కోట్ల మేరకు పాత నోట్లు చెన్నైకు రానున్నారుు. ఇదిలా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని రవాణా ఉద్యోగ కార్మికులకు నెల జీతంలో అడ్వాన్సగా రూ.మూడు వేలను ప్రభుత్వం చేతికి ఇవ్వడం విశేషం. ఆయా బస్సు డిపోలు, కార్యాలయాల వద్ద సిబ్బందికి రూ.మూడు వేల చొప్పున వంద, కొత్త రెండు వేల నోట్లను అందించారు. జీతంలో మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల్లో జమచేశారు. రవాణా సంస్థ చేపట్టినట్టుగా అన్ని విభాగాల్లోనూ చేతికి కొంత మేరకు నగదు ఇచ్చి ఉంటే బాగుండేదని ప్రభుత్వ ఉద్యోగులు పాలకుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
కడప రైతుబజార్లో SBI ప్రత్యేక ఏర్పాట్లు
-
షిర్డీలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు
ముంబై : పెద్ద నోట్ల రద్దు ప్రభావం కొంత మేరకు తగ్గించేందుకు షిర్డీ సాయిసంస్థాన్ ట్రస్టు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా రెండు రోజులపాటు ఉచిత భోజనాలు అందించాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రూ. 500, 1000 నోట్ల రద్దు నిర్ణయం ప్రభావం షిర్డీతోపాటు అనేక దేవాలయాలపై కూడా పడుతోంది. దీంతో దేశంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన షిర్డీలో కానుకల రూపంగా భక్తులు ఇచ్చే రూ 500, 1000 నోట్లను స్వీకరించేందుకు షిర్డీ సాయిబాబా సంస్థాన్ నిరాకరిస్తోంది. అయితే భక్తులకు ఈ నిర్ణయం ప్రభావం కొంతైన తగ్గించేందుకు బుధవారం, గురువారం రెండు రోజులపాటు భక్తులందరికి ఉచితంగా భోజనాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టు పిఆర్వో మోహన్ జాదవ్ ‘సాక్షి’కి తెలిపారు. ఈ మేరకు భక్తులందరికి ఉచిత భోజనాలు ఏర్పాటు చేసింది. అయినప్పటికీ షిర్డీలో భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. -
అమెరికా పీఠాధిపతికి ఇన్ని రాజభోగాలా!
-
వైభవంగా ముగిసిన కృష్ణా పుష్కరాలు
-
కృష్ణా పుష్కరాలకు వీడ్కోలు
-
ముగిసిన కృష్ణా పుష్కరాలు..
విజయవాడ : విజయవాడలో 12 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన కృష్ణా పుష్కరాల ముగింపు వేడుకలు అట్టహాసంగా ముగిశాయి. ఫెర్రి పవిత్ర సంగమం ఘాట్‌లో నిర్వహించిన మహా హారతి కార్యక్రమంతో కృష్ణమ్మకు ఘనంగా వీడ్కోలు పలికారు. పవిత్ర సంగమం ఘాట్‌లో నిర్వహించిన మహా హారతి కార్యక్రమానికి పీవీ సింధు, కోచ్ గోపీచంద్‌తో పాటు సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, సురేశ్ ప్రభు, మంత్రులు హాజరయ్యారు. కేంద్ర మంత్రుల చేతుల మీదుగా పీవీ సింధు, గోపీచంద్, కిదాంబి శ్రీకాంత్ లకు చంద్రబాబు చెక్కులను, జ్ఞాపికలను అందజేసి సత్కారించారు. సినీ దర్శకుడు బోయపాటి శ్రీను ఆధ్వర్యంలో ముగింపు వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ఆస్ట్రేలియా నుంచి ప్రత్యేక తెప్పించిన బాణాసంచా వెలుగులతో ముగింపు వేడుకలు కనులపండువగా జరిగాయి. హారతి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. -
సమ్మక్మ జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు
ఆదిలాబాద్ : మేడారం జాతర ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరుగుతుందని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం ఆదిలాబాద్‌లో ఇంద్రకరణ్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... సమ్మక్క - సారలమ్మ జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. వచ్చే ఏడాది రూ. 3 కోట్లతో నాగోబా దేవాలయన్ని అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు. అయితే జిల్లాలోని ఏదో ప్రాంతంలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారని ఈ సందర్భంగా ఇంద్రకరణ్ రెడ్డి గుర్తు చేశారు. ఈ అంశంపై రాజకీయం చేయడం తగదని విద్యార్థు సంఘాలకు ఇంద్రకరణ్ సూచించారు. -
మహానందీశ్వరుడికి ముత్యాల తలంబ్రాలు
మహానంది: కర్నూలు జిల్లా మహానంది క్షేత్రంలో మహాశివరాత్రి పండుగకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మహానందీశ్వర స్వామి వార్లకు నిర్వహించే కల్యాణోత్సవంలో ముత్యాల తలంబ్రాలను వినియోగించనున్నట్లు దేవస్థానం పాలకమండలి చైర్మన్ ప్రసాదరావు తెలిపారు. బుధవారం పాలకమండలి సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పాలక మండలి ఆధ్వర్యంలో ఈ ఏడాది కల్యాణోత్సవం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. గర్భాలయ విమాన గోపుర కలశం పక్కకు ఒరిగి పోవటంపై కలశం మార్పుతో పాటు లఘు సంప్రోక్షణ పూజలను మాఘమాసంలో నిర్వహించనున్నట్లు ప్రసాదరావు తెలిపారు. -
ఇంద్రకీలాద్రిపై పండుగ శోభ
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళవారం నుంచి వైభవంగా ప్రారంభం అయ్యాయి. కన్నులపండువగా జరిగే శరన్నవరాత్రి ఉత్సవాలకు ఆలయ ప్రాంగణాన్ని సర్వంగ సుందరంగా తీర్చిదిద్దారు. మొదటి రోజు అమ్మవారు శ్రీ స్వర్ణకవచలాంకృత దేవిగా దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుండి కఠోర దీక్షతో భవాని మాలలు ధరించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. దసరా ఉత్సవాలతో బెజవాడకు పండుగ శోభ సంతరించుకుంది. నగరంలోని ప్రధాన రహదారులన్నీ విద్యుత్ దీపాలతో అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. పది రోజుల పాటు అమ్మవారు పది అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఉత్సవాల సందర్భంగా దేవాలయంలో నిత్యం లక్ష కుంకుమార్చన, చండీయాగాల్లో భక్తులు పాల్గొనే అవకాశం ఉంటుంది. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు సర్వదర్శనంతోపాటు రూ.50, రూ.100 టికెట్లను, వీఐపీలకు రూ.300 టికెట్లను విక్రయిస్తున్నారు. తొలిసారిగా ఈ ఉత్సవాలను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈ పది రోజులు రోజుకు పదివేలమందికి అన్నదానం చేయనున్నారు. భక్తులకు విక్రయించేందుకు 23 లక్షల లడ్డూలను సిద్ధం చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సిటీలో అన్నిప్రాంతాల నుండి అమ్మవారిని దర్శించుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ఉచిత బస్సులను ఏర్పాటుచేశాయి. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని 10 రోజుల పాటు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. చివరి రోజున కృష్ణా నదిలో హంసవాహనంపై ఊరేగడంతో ఉత్సవాలు ముగుస్తాయి. -
యాదాద్రిలో తొలి ఏకాదశి ఏర్పాట్లు
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం (యాదాద్రి)లో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయంలో స్వామి, అమ్మవార్లకు తిరుమంజన స్నపనం, నవకలశ స్నపనం చేయనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఏకాదశి రోజున ఉపవాసం ఉండి స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటే విశేష పుణ్య ఫలితం ఉంటుందని చెప్పారు. భక్తుల కోసం సుమారు 50 వేల లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేయనున్నారు. దర్శనం క్యూలైన్లలో ఎటువంటి తోపులాటలు లేకుండా ఉండేందుకు గాను కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఆలయంలో విశేష పూజలు, తులసీ అర్చనలు, కుంకుమార్చనలు, చేయనున్నట్లు అర్చకులు తెలిపారు. కొండపై పెరిగిన భక్తుల రద్దీ.. ఆదివారం సెలవురోజు కావడంతో యాదాద్రికి భక్తుల రద్దీ పెరిగింది. పుష్కరాలకు వెళ్లిన భక్తులు తిరుగుప్రయాణంలో గుట్టకు వస్తున్నారు. సంగీత భవనం, దర్శనం క్యూలైను,్ల ప్రసాదాల క్యూలైన్లు అన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామివారి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. సుమారు 30 వేల మంది భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారని దేవస్థానం అధికారులు చెప్పారు. -
రాష్ట్రపతి రాకకోసం..
భువనగిరి/యాదగిరిగుట్ట దేశప్రథమ పౌరుడి రాక కోసం యాదాద్రి ముస్తాబైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా రాష్ట్రపతి ఆదివారం గుట్టకు వస్తుండడంతో ప్రభుత్వం రెడ్‌కార్పెట్‌తో స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. గర్భాలయాన్ని పూలమాలలతో అందంగా అలంకరించింది. అలాగే రాష్ట్రపతి బసచేసే ఆం డాళ్ నిలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఉదయం 11.10 నిమిషాలకు భువనగిరి మండలం వడాయిగూడెంలో హెలికాప్టర్ దిగుతారు. అంతకు గంటముందు సీఎం కేసీఆర్ గుట్టకు చేరుకుని రాష్ట్రపతికి స్వాగతం పలుకనున్నారు. అక్కడినుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో గుట్ట ప్రధాన రహదారి మీదుగా కొండపైకి వెళతారు. ఆలయ అర్చకులు రాష్ట్రపతితో పాటు గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతారు. రాష్ట్రపతి 11.50కి ఆలయంలో స్వామిఅమ్మవార్లనుదర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వేదపండితులతో ప్రత్యేక ఆశీర్వచనం పొందుతారు. ఆలయంలోని విశేషాలను, ప్రత్యేకతలను, స్వామివారి చరిత్ర, మహత్యాన్ని సీఎం కేసీఆర్, ఆలయ అధికారులు, అర్చకులు రాష్ట్రపతికి వివరిస్తారు. అక్కడి నుంచి ఆయన ఆండాళ్ అతిథిగృహానికి చేరుకుని అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం ఆయనకు గుట్ట చరిత్ర, ఇటీవల గుట్ట అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను రాష్ట్రపతికి సీఎం వివరిస్తారు. అనంతరం ఆయనను సత్కరించి గుట్ట స్వామి వారి చిత్రపటాలను, జ్ఞాపికలను అందిస్తారు. అనంతరం ఒంటిగంటకు రాష్ట్రపతి హైదరాబాద్‌కు తిరిగి వెళతారు. హెలిప్యాడ్లను పరిశీలించిన ప్రభుత్వ విప్, అధికారులు రాష్ర్టపతి రాక సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వడాయిగూడెం వద్ద మూడు హెలిప్యాడ్లను సిద్ధం చేసింది. సీఎం కేసీఆర్ కోసం హరిత మాలగుట్ట పక్కన మరో హెలిప్యాడ్‌ను అధికారులు సిద్ధం చేశారు. శనివారం సాయంత్రం ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునితారెడ్డి, కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఎస్సీ విక్రమ్‌జీత్ దుగ్గల్, జేసీ సత్యనారాయణ, ఏఎస్పీ గంగారాం, ఆర్డీవో మధుసూదన్ ఇతర అధికారుల బృందం హెలిప్యాడ్లను పరిశీలించారు. రాష్ట్రపతి, గవర్నర్, సీఎం రాక సందర్భంగా వారు హెలిప్యాడ్ వద్ద తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. రాష్ర్టపతి రాక సందర్భంగా రోడ్లకు మరమ్మత్తులు చేశారు. వడాయిగూడెం నుంచి గుట్ట వరకు పలు చోట్ల పాడైన రోడ్డు స్థానంలో కొత్త రోడ్డును వేశారు. పలు చోట్ల మొరం పోసి రోలర్లతో తొక్కించారు. పర్యటన ఇలా.. 11.30 గుట్టపైన అతిథిగృహానికి చేరుకుంటారు. 11.45వరకు అక్కడే ఉంటారు. మధ్యాహ్నం 12.20వరకు అక్కడే ఉంటారు. 12.25 నుంచి 12.40వరకు అతిథిగృహంలో ఉంటారు. 12.50కి హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. ఒంటిగంటకు తిరుగుప్రయాణమవుతారు. -
జప్తు నోటీసులు షురూ
రాజధాని నగరంలోని మాల్స్, వాణిజ్య కేంద్రాల్లోని ఐదు వేలకు పైగా దుకాణాలు కార్పొరేషన్‌కు రూ.66 కోట్ల మేరకు బకాయి పడ్డాయి. దీనిని ముక్కు పిండి వసూలు చేయడానికి కార్పొరేషన్ వర్గాలు సిద్ధమయ్యాయి. ఆయా దుకాణాల జప్తుకు గురువారం నోటీసులు జారీ అయ్యాయి. ఆయా దుకాణాల ముందు అధికారులు దండోరా వేసి మరీ హెచ్చరించారు. సాక్షి, చెన్నై: చెన్నై మహానగర కార్పొరేషన్ పరిధిలోని 15 మండల్లాల్లో ఆస్తి పన్ను వసూళ్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆయా మండల పరిధిలో సొంత ఇళ్లు కలిగిన వాళ్లు ఆస్తి పన్ను చెల్లిస్తున్నారు. అయితే స్టార్ హోటళ్లు, అతి పెద్ద కార్యాలయాలు కొన్ని ఆస్తి పన్ను చెల్లింపులో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించాయి. దీంతో ఆయా మాల్స్, స్టార్ హోటళ్ల ముందు వారి పరువు బజారుకీడ్చే రీతిలో దండోరా వేసి మరీ బకాయి వివరాల్ని ప్రకటించి, చెల్లింపునకు గడువు ఇచ్చారు. దీంతో కొన్ని హోటళ్లు, మాల్స్ యాజమాన్యాలు పన్ను చెల్లింపునకు పరుగులు తీశాయి. అదే పద్ధతిని కాస్త భిన్నంగా అమలు చేసి మాల్స్, వాణిజ్య కేంద్రాల్లోని దుకాణాల భరతం పట్టేందుకు కార్పొరేషన్ యంత్రాంగం నిర్ణయించింది. నగరంలో ఐదు వేలకు పైగా దుకాణాలు ఆస్తి పన్ను బకాయి పడ్డట్టు అధికారులు గుర్తించారు. ఈ బకాయి రూ.66 కోట్ల మేరకు ఉన్నట్టు లెక్కలు తేల్చారు. దీనిని ఆయా దుకాణదారుల నుంచి వసూలు చేయడానికి సిద్ధమయ్యారు. ఇది వరకు దండోరాతో స్టార్ హోటళ్లు, మాల్స్ యజమానుల పరువు బజారు కీడ్చే పనిలో పడ్డ అధికారులు, తాజాగా జప్తు నోటీసుతో ఆయా దుకాణాల ముందు గురువారం వాలారు. తొలి విడతగా ఆయా మండలాల పరిధిలోని ఐదు వేల దుకాణాల ముందు ఉదయాన్నే తిష్ట వేశారు. దుకాణాలు తెరవగానే, జప్తు నోటీసుల్ని అంటించారు. దాన్ని ఫొటో తీశారు. కాసేపటికి ఆ జప్తు నోటీసులోని వివరాల్ని, బకాయిల్ని ఎత్తి చూపుతూ దండోరా వేస్తూ ముందుకు కదిలారు. అధికారుల వినూత్న పోకడకు ఆయా దుకాణాలదారులు బెంబేలెత్తిపోయూరు. ఈ రూపంలోనైనా బకాయి చెల్లిస్తారన్న నమ్మకంతోనే తాము ఈ మార్గాన్ని ఎంచుకున్నామని, ఇచ్చిన గడువులోపు చెల్లించని దుకాణాల్ని జప్తు చేస్తామని ఓ మండలానికి చెందిన కార్పొరేషన్ అధికారి జగన్నాథన్ పేర్కొన్నారు. నగరం నడి బొడ్డున అన్నా సాలైలోని స్పెన్సర్ ప్లాజాలో ఏకంగా 626 దుకాణాలు ఆస్తి పన్ను బకాయి పడటం బట్టి చూస్తే, ఇక ఇతర మాల్స్‌లో ఏ మేరకు దుకాణాలు బకాయి పడి ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. -
వైకుంఠ ఏకాదశి రోజు తిరుమలలో ప్రత్యేక దర్శనాలు రద్దు
వైకుంఠ ఏకాదశి, కొత్త సంవత్సరాలకు తిరుమల తిరుపతి దేవస్థానం భారీ ఏర్పాట్లు చేస్తోంది. వైకుంఠ ఏకాదశి రోజు ప్రత్యేక దర్శనాలను రద్దు చేశారు. వీఐపీలకు తెల్లవారుజామున ఒంటిగంట నుంచి 5గంటల వరకు దర్శనం కల్పిస్తామని టీటీడీ తెలిపింది. ఉదయం 5 గంటల తర్వాత సర్వదర్శనం ప్రారంభం అవుతుంది. సిఫార్సు లేఖలను ఆ రోజుకు పూర్తిగా రద్దు చేశారు. సర్వదర్శనంలో వెళ్లే భక్తులకు ఏటీసీ ప్రాంతంలో ప్రవేశమార్గాన్ని ఏర్పాటుచేశారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో 1.35 లక్షల మంది భక్తుల దర్శనానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. వీఐపీల ఒక్కరి టికెట్టుతో ముగ్గురు దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశికి తిరుమలకు వచ్చే భక్తుల కోసం అదనంగా 2 లక్షల లడ్డూలను సిద్ధం చేయిస్తున్నారు. ద్వాదశి నాటి కోసం 12 వేల ప్రత్యేక ప్రవేశ టికెట్లు ఈనెల 24వ తేదీ నుంచి భక్తులకు అందుబాటులో ఉంచుతామని టీటీడీ తెలిపింది. -
ఎన్నికల నిఘా
ఏలూరు, న్యూస్‌లైన్ :మునిసిపల్ ఎన్నికలు, సాధారణ ఎన్నికల నిర్వహణకు విస్తృతమైన ఏర్పాట్లతో పాటు అభ్యర్థులపై ప్రత్యేక నిఘా పెడుతున్నామని కలెక్టర్ సిద్ధార్థజైన్ తెలిపారు. కలెక్టరేట్లో గురువారం మునిసిపల్ ఎన్నికల ఏర్పాట్లను విలేకరులకు ఆయన వివరించారు. ఈనెల 7న పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటిస్తామన్నారు. మునిసిపల్ ఎన్నికలకు ఈనెల 10న నోటిఫికేషన్ జారీ చేస్తామని, అదే రోజు నుంచి 13వ తేదీ వరకు ఏలూరు నగరపాలక సంస్థకు, మిగిలిన పురపాలక సంఘాలకు 14వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు స్వీకరిస్తారన్నారు. ఈ నెల 15 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల పరిశీలన, మార్చి 18 మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు గడువు ఉంటుందన్నారు. అనంతరం తుది జాబితా ప్రకటిస్తామన్నారు. ఈ నెల 30 ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ సాగుతుందని, వచ్చే నెల 2న ఓట్ల లెక్కింపు జరుగుతుంద న్నారు. వ్యయ పరిమితి.. కార్పొరేషన్లో డివిజన్ మెంబరుగా పోటీ చేసే అభ్యర్థికి రూ.లక్షా 50వేలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలలో కౌన్సిలర్లుగా పోటీ చేసే అభ్యర్థులకు ఎన్నికల వ్యయపరిమితి రూ.లక్ష ఉంటుందన్నారు. వాహనాల వినియోగం, ఊరేగింపులు, లౌడ్ స్పీకర్ల వినియోగానికి ముందస్తు అనుమతి తీసుకోవాలని చెప్పారు. బంధువుల వేడుకలపై కూడా నిఘా పోటీ చేసే అభ్యర్థులు, వారి బంధువులు నిర్వహించే సామూహిక భోజనాలు, భారీ ఎత్తున నిర్వహించే పుట్టినరోజులు, వివాహాలు, సన్మానం, ఉత్సవాలపై కూడా నిఘా ఉంచుతామన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల వ్యయాన్ని నిర్దిష్టమైన పుస్తకంలో నమోదు చేసి, ఎన్నికల అనంతరం నిర్ణీత గడువులోగా సమర్పించాలన్నారు. గోడలపై రాతలు, పోస్టర్లు అంటించటం తదితరాల ప్రచారానికి ఆ భవన యజమానుల అనుమతి పొందాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని, ఎన్నికల ఖర్చు అధికంగా ఉంటుందని భావించే డివిజన్లు, వార్డుల్లో ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు. విద్యార్థుల ప్రశాంతతకు భంగం కలిగించవద్దు ఈ నెలాఖరు నుంచి 10వ తరగతి పరీక్ష లు జరగనన్న దృష్ట్యా విద్యార్థుల చదువుకు భంగం కలిగించని రీతిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించుకోవాలని కలెక్టర్ సూచించారు. లౌడ్ స్పీకర్లతో విద్యార్థులకు ఇబ్బంది కలిగించవద్దన్నారు. ఎన్నికల వ్యయ ప్రభావిత జిల్లాగా పశ్చిమ జిల్లాలోని 15 నియోజకవర్గాలను అధిక ఎన్నికల వ్యయ ప్రభావం ఉండే ప్రాంతాలుగా ఎన్నికల సంఘం గుర్తించిందని కలె క్టర్ తెలిపారు. జిల్లాలో కొన్ని నియోజకవర్గాలకు అధికంగా ఎన్నికల ఖర్చు చేసే ప్రాంతాలుగా ఎన్నికల సంఘం గుర్తించిందని, అయితే జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు అధిక ఎన్నికల వ్యయప్రభావం ఉండే ప్రాంతాలుగా పేర్కొందన్నారు. చట్టవిరుద్ధంగా ఎన్నికల ఖర్చు చేసే అవకాశం ఉన్నందున వ్యయ నియంత్రణకు అన్ని స్థాయిల్లో షాడో నిఘా ఉంచుతామన్నారు. ఎన్నికల వ్యయానికి ప్రత్యేక బ్యాంకు ఖాతా అభ్యర్థులు నామినేషన్ సమర్పించే నాటికి ఎన్నికల వ్యయానికిగాను వేరేగా బ్యాంకు ఖాతాను ప్రారంభించాలని, ఆ ఖాతా ద్వారా ఎన్నికలకు సంబంధించిన చెల్లింపులను చెక్కుల ద్వారా చేయటం ఉత్తమమన్నారు. ఎన్నికల వ్యయ పర్యవేక్షణలో భాగంగా రిటర్నింగ్ అధికారులే కాకుండా, కస్టమ్స్, ఆదాయపు పన్ను, ఆడిట్, వాణిజ్య పన్నుల అధికారులు బృందాలుగా ఏర్పడి బ్యాంకులలో పెద్ద మొత్తంలో జరిగే లావాదేవిలపై దృష్టి పెడతారని చెప్పారు. అటువంటి వాటిపై వివరణను ఆయా వ్యక్తులు వివరించాల్సి ఉంటుందన్నారు. ఒకే రోజున ఎక్కువ మొత్తం నగదు జమ, డ్రా చేయడంపై నిఘా ఉంటుందన్నారు. ఈ విషయంపై బ్యాంకర్లతో ప్రత్యేకంగా చర్చిస్తామన్నారు.. రూ. 50 వేలకు మించి నగదు రవాణా చేసేటప్పుడు సంబంధిత వాణిజ్య, ఇతర లావాదేవీల ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. బృందాలు ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా మర్యాదపూర్వకంగా పరిశీలించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. ఎన్నికల వ్యయాన్ని పరిమితికి, చట్టానికి లోబడి ఖర్చు చేయాలే తప్ప, పరిమితికి మించితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. నగదు, మద్యం, ఇతర తాయిలాల రూపంలో ఓటర్లను ప్రలోభపరిచే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల సందర్భంగా ఆయా అభ్యర్థులు, పార్టీల నుంచి బహుమతులు, నగదు వంటివి పుచ్చుకున్నా నేరమేనన్నారు. సాధారణ ఎన్నికల షెడ్యూల్ .. జిల్లాలో సాధారణ ఎన్నికలకు ఏప్రిల్ 12న నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. 19న నామినేషన్ల స్వీకరణకు తుది గడువని, 21న నామినేషన్ల పరిశీలన, 23న నామినేషన్ల ఉప సంహరణకు తుది గడువన్నారు. మే 7న ఎన్నికల నిర్వహిస్తారని, మే 16న ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. జిల్లాలో 39 లక్షల 77వేల 727 మంది ప్రజలున్నారని, వీరిలో 28వేల 12 లక్షల 472 మంది ఓటర్లుగా నమోదయ్యారన్నారు. వీరిలో మహిళలు 14 లక్షల 24వేల 212 మంది ఉండగా, పురుషులు 13 లక్షల 88వేల 101 మంది ఉన్నారన్నారు. 2014 ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో లక్షా 70వేల 645 మంది ఓటర్లుగా నమోదు కాగా, వారిలో 18-19 సంవత్సరాల మధ్య వయసు కలిగినవారు 44 వేల 470 మంది ఉన్నారన్నారు. ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు జిల్లాలో ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. 08812-230050 ఫోన్ , 08812-230052 ఫ్యాక్స్ ఉన్నాయని చెప్పారు. వ్యయ నియంత్రణ పర్యవేక్షక బృందాలు ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి సహాయ వ్యయ పరిశీలకులు, వీడియో సర్వైలెన్స్ బృందాలు, వీడియో వీక్షణ బృందాలు, ఎన్నికల వ్యయ అక్కౌంటింగ్ బృందాలు ఏర్పాటు చేశామన్నారు. నియోజకవర్గానికి 3 ఫ్లయింగ్ స్వ్కాడ్లు, 5 ఎన్నికల ప్రవర్తనా నియమావళి పరిశీలన బృందాలు, ఒక నోడల్ అధికారి, ప్రతి 10 పోలింగ్ కేంద్రాలకు ఒక సెక్టొరల్ అధికారిని ఏర్పాటు చేశామన్నారు. 9నఓటర్ల నమోదు కార్యక్రమం అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇవ్వాలని గట్టి ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికలకు జిల్లాలో ఈ నెల 9 ఆదివారం ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఓటర్లుగా నమోదుకానివారు, ఇతర కారణాల వలన పేరు నమోదు చేసుకోలేని వారు ఆ రోజు బూత్ స్థాయి అధికారులకు ధరఖాస్తు సమర్పించవచ్చన్నారు. ఓటర్ల జాబితాలో ఓటర్ల డూప్లికేషన్‌ను తొలగించేందుకు రీడూప్లికేట్ సాఫ్ట్వేర్ రానుందని తెలిపారు. -
శివరాత్రి ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు
ధర్మవరం (శృంగవరపుకోట రూరల్), న్యూస్‌లైన్: విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో గల 85 శి వాలయాల్లో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరిం చుకుని ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ ఎన్వీఎస్ఎన్ మూర్తి వెల్లడించారు. ధర్మవరం శివారు సన్యాసయ్యపాలెంలో గల సన్యాసేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం శివరా త్రి సందర్భంగా చేపడుతున్న పలు ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడారు. మూడు జిల్లాల్లో గల ఎస్.కోటలోని పుణ్యగిరి, ధర్మవరంలోని సన్యాసేశ్వరస్వామి, రామతీర్థం, శ్రీ ముఖలింగం, రావివలస, ఎండల మల్లిఖార్జునుడు, అప్పికొండ, దారపాలెం, బలిఘట్టాం, సోమలింగపాలెం, దేవునిపూతసంగం, లింగాల తిరుగుడు తదితర శివాలయాల్లో రానున్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవాదాయశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందన్నారు. జాతరను విజయవంతంగా నిర్వహిం చేందుకు ఎస్.కోటలోని పుణ్యగిరి, ధర్మవరంలోని సన్యాసేశ్వరస్వామి ఆలయాల వద్ద 220 మంది పోలీ సులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామనీ, ఇందుకు సంబంధించి సర్కిల్ ఇన్స్పెక్టర్, స్థానిక ఎస్ఐలు, తహశీలార్లు, ఆలయాల ఈఓలతో చర్చించినట్లు తెలిపారు. ఉచిత దర్శనం మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పుణ్యగిరిలోని ఉమాకోటిలింగేశ్వరస్వామి, ధర్మవరంలోని సన్యాసేశ్వరస్వామితో పాటు మూడు జిల్లాల్లో గల శివాలయాలకు విచ్చేసే భక్తులకు ఉచిత దర్శన ఏర్పా ట్లు చేస్తున్నామని డిప్యూటీ కమిషనర్ తెలిపారు. అలాగే భక్తులకు ఉచితంగా పటిక బెల్లం (ప్రసాదం) అందించే విధంగా ఇప్పటికే ఆయా ఆలయాల ఈఓలకు ఆదేశించామన్నారు. భక్తుల సౌకర్యార్థం ఆల యాల వద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు, వైద్య సిబ్బందితో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.