సమ్మక్మ జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు | special arrangements for sammakka sarakka festival, says indrakaran reddy | Sakshi
Sakshi News home page

సమ్మక్మ జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు

Published Wed, Feb 10 2016 2:50 PM | Last Updated on Sun, Sep 3 2017 5:22 PM

సమ్మక్మ జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు

సమ్మక్మ జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు

ఆదిలాబాద్ : మేడారం జాతర ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరుగుతుందని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్రెడ్డి వెల్లడించారు. బుధవారం ఆదిలాబాద్లో ఇంద్రకరణ్రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... సమ్మక్క - సారలమ్మ జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. వచ్చే ఏడాది రూ. 3 కోట్లతో నాగోబా దేవాలయన్ని అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు. అయితే జిల్లాలోని ఏదో  ప్రాంతంలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారని ఈ సందర్భంగా ఇంద్రకరణ్ రెడ్డి గుర్తు చేశారు. ఈ అంశంపై రాజకీయం చేయడం తగదని విద్యార్థు సంఘాలకు ఇంద్రకరణ్ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement