sammakka sarakka festival
-
27నే మరో 2 గ్యారంటీలు
మేడారం గద్దెలపై సమ్మక్క, సారక్క, పగిడిద్దరాజు, గోవిందరాజులు ఆసీనులు కావడంతో శుక్రవారం పోటెత్తిన భక్తజనం(ఇన్సెట్లో) సమ్మక్క గద్దె వద్ద మొక్కుతున్న సీఎం రేవంత్‌రెడ్డి రూ.500కే గ్యాస్ సిలిండర్, తెల్లరేషన్ కార్డున్న పేదవారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ గ్యారంటీలను 27న ప్రారంభిస్తాం. కార్యక్రమానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ముఖ్యఅతిథిగా హాజరవుతారు. ఇచ్చిన ప్రతి హామీ అమలుచేస్తాం. – ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సాక్షిప్రతినిధి, వరంగల్: ఆరు గ్యారంటీల అమలులో భాగంగా రూ.500లకే గ్యాస్ సిలిండర్, తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతీ పేదవారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను ఈనెల 27వ తేదీన ప్రారంభిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ ప్రధానకార్యదర్శి ప్రియాంకగాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతారని ఆయన వెల్లడించారు. ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క–సారలమ్మలను సీఎం శుక్రవారం దర్శించుకున్నారు. తల్లులకు ఆయన నిలువెత్తు బంగారం (66 కిలోల బెల్లం), పసుపు, కుంకుమ, గాజులు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మేడారం మీడియా పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ప్రజాసమస్యలు పరిష్కరిస్తున్నామని, ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తామని చెప్పారు. రూ.2లక్షల రుణమాఫీపై బ్యాంకులతో చర్చిస్తున్నామని, త్వరలోనే రైతులకు శుభవార్త చెబుతామన్నారు. అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే 25వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, మార్చి 2న మరో 6వేల పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఉద్యోగాలు ఇచ్చినా ఇవ్వలేదంటూ మామాఅల్లుడు, తండ్రీకొడుకు తమ ప్రభుత్వంపై గోబెల్స్‌లా అబద్ధపు, తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబ దోపిడీపై బీజేపీ స్పందించలేదు కాళేశ్వరం ప్రాజెక్టులో దోపిడీ, అక్రమాలు, నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్టు చూపామని, కేసీఆర్ కళ్లు మూసుకొని ఫాంహౌస్‌లో ఉండటంతోనే ఏపీ సీఎం కృష్ణాజలాలు తరలించుకుపోయారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులతో కేసీఆర్ దివాలా తీయించారని ధ్వజమెత్తారు. కేసీఆర్ పదేళ్లుగా దోపిడీకి పాల్పడుతుంటే పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగిన చందంగా ఏనాడూ ప్రధాని నరేంద్రమోదీ అడ్డుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డపై తాము జ్యుడీషియల్ విచారణకు అనుమతి ఇచ్చిన తర్వాత దానిని సీబీఐకి అప్పగించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారని, పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు కేసీఆర్, కేటీఆర్, ఆ కుటుంబంపై కేసు పెట్టారా, సీబీఐ, ఈడీ, ఐటీ అన్నీ కేంద్రం దగ్గరే ఉన్నా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కేసీఆర్ దోపిడీలో వాటా కోసమే తప్ప దానిపై చర్యలు తీసుకోవాలనే ఆలోచన బీజేపీ నేతలకు లేదన్నారు. త్వరలోనే రిటైర్డ్ హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల ఆధ్వర్యంలో సాగే విచారణను బీఆర్ఎస్ నాయకులు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి ఇంజనీరింగ్ నిపుణుల కమిటీ నివేదికలు సిద్ధం చేస్తోందని, ఆ ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తామని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తెలంగాణ సమాజానికి స్వేచ్ఛ ఇచ్చాం గతంలో జర్నలిస్టులను సచివాలయంలోకి రానివ్వలేదని, ఇప్పుడు ప్రతీ చాంబర్‌కు వెళ్లే అవకాశం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తనను, సీతక్కను గతంలో సచివాలయానికి వెళ్లనివ్వలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అందరికీ సచివాలయానికి వెళ్లే స్వేచ్ఛ ఉందని, తెలంగాణ ప్రభుత్వం ఆ స్వేచ్ఛ ఇచ్చిందని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి నిరంతరం చేస్తామని, జాతర వచ్చినప్పుడే కాకుండా నిరంతరం మంత్రులు సీతక్క, కొండా సురేఖ సహాయంతో ఈ ప్రాంత అభివృద్ధిని తాను స్వయంగా పర్యవేక్షిస్తానని తెలిపారు. శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టేందుకు మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోస్టింగుల్లో న్యాయం జరిగిందా లేదా అని ప్రభుత్వ ఉద్యోగులను అడగాలని ఆయన ప్రజలకు సూచించారు. గతంలో నెల చివర వరకు జీతాలు వచ్చేవికావని, మొదటి నెల నాలుగో తేదీన, రెండో నెలలో మొదటి తేదీన ఇవ్వడంతో ప్రభుత్వ ఉద్యోగులు ఆశ్చర్యపోతున్నారని తెలిపారు. మీడియా అకాడమీకి త్వరలో చైర్మన్ త్వరలోనే మీడియా అకాడమీకి చైర్మన్‌ను నియమిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. తాము అధికారంలోకి వచ్చి వంద రోజులు కాలేదని, పదేళ్లు ఓపిక పట్టారని, త్వరలోనే జర్నలిస్టుల అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ప్రభుత్వాన్ని తేవడంతోనే జర్నలిస్టుల పని అయిపోలేదని కుట్రలు, కుతంత్రాలను తిప్పికొట్టడానికి సహకరించాలని కోరారు. వాళ్ల ఇద్దరి (బీజేపీ–బీఆర్ఎస్నుఉద్దేశించి) సమన్వయం మీకు తెలుసని, ఉదయం, సాయంత్రం మాట్లాడుకుంటున్నారన్నారు. పది సీట్లు బీజేపీకి, ఏడు సీట్లు కేసీఆర్‌కు మాట్లాడుకొని ఎన్నికలకు రాబోతున్నారని, ఆ చీకటి ఒప్పందాన్ని మీడియా మిత్రులు తిప్పికొట్టాలని విజ్ఞప్తి చేశారు.చేవెళ్ల సభతో శ్రీకారం..: చేవెళ్లలో భారీ బహిరంగ సభను నిర్వహించి.. ఆ సభలోనే రూ.500కే గ్యా స్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గ్యారంటీలను ప్రియాంకా గాంధీ చేతుల మీదుగా ప్రారంభించను న్నారు. ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లను శుక్రవారం ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, కలె క్టర్ శశాంక, ఇతర అధికారులు పరిశీలించారు. మేడారం సందర్శనకు మోదీ, అమిత్ షా రావాలి దక్షిణ కుంభమేళాలాంటి మేడారం మహాజాతరకు కోటిన్నర మంది భక్తులు వస్తున్నా కేంద్ర ప్రభుత్వం జాతీయ పండగగా గుర్తించడం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తాము ఎన్నిసార్లు కోరినా అలా కుదరదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అంటున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఉత్తర భారతం, దక్షిణ భారతం అనే వివక్ష చూపడం సరికాదని హితవు పలికారు. దక్షిణ భారతమనే కాదు ప్రపంచంలోనే సమ్మక్క–సారలమ్మ జాతరకు ఒక గుర్తింపు ఉందని, వారి వీరోచిత పోరాటానికి చరిత్ర పుటల్లో స్థానం ఉన్నందున కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయొద్దని, ప్రధానమంత్రి వచ్చి దర్శించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, ధనసరి సీతక్క, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మామిడాల యశస్వినిరెడ్డి, గండ్ర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
మేడారంకు సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం ప్రకటించిన కిషన్ రెడ్డి
-
మేడారం జాతరపై ప్రధాని మోదీ తెలుగు ట్వీట్
-
Medaram: నేటి నుంచి సమక్క-సారలమ్మ మహా జాతర
ములుగు,సాక్షి: ఆసియాలో అతిపెద్ద గిరిజన కుంభమేళా.. తెలంగాణలో జరిగే చారిత్రాత్మక క్రతువు మేడారం మహా జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. సమ్మక్క, సారలమ్మలు వనం వీడి జనారణ్యంలోకి వచ్చి గద్దెలపై కొలువుదీరనున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మేడారంలో మహా జాతర ఉత్సవాలు బుధవారం నుంచి ఆరంభం కానున్నాయి. ఈ మహాజాతర ప్రారంభం కానుండడంతో మొక్కులు, దర్శనం కోసం వచ్చే వారి సంఖ్యతో మేడారం పరిసరాలు పూర్తిగా జనసంద్రంగా మారనున్నాయి. భక్తుల కొంగు బంగారం సమ్మక్క-సారలమ్మ జాతర మాఘశుద్ధ పౌర్ణమి (సమ్మక్కల పున్నం) రోజున రెండేళ్లకోసారి జరుగుతుందని చెప్పనక్కర్లేదు. మేడారం మహాజాతర పూజల తొలిఘట్టం గత బుధవారమే అత్యంత వైభవంగా ప్రారంభమయింది. జాతరకు సరిగ్గా వారం ముందు నిర్వహించే మండమెలిగే పండగను మేడారంలోని సమ్మక్క దేవత, కన్నెపల్లిలోని సారలమ్మ తల్లి పూజారులు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. ఇక.. ఈసారి ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు. నిన్న(మంగళవారం) మేడారం మహాజాతర జంపన్న గద్దెకు చేరే క్రతువుతో ఆరంభమైంది. పూజారి పోలెబోయిన సత్యం, వడ్డె అయిన గొంది సాంబశివరావు ఆధ్వర్యంలో మంగళవారం కన్నెపల్లి నుంచి జంపన్న ఆదివాసీ సంప్రదాయాలతో రాత్రి 7:09 గంటలకు బయల్దేరారు. సరిగ్గా 8:31 గంటలకు జంపన్నను గద్దెకు చేర్చారు. జంపన్న గద్దెకు వచ్చే క్రమంలో గ్రామస్థులు, ఆడపడుచులు మంగళ హారతులు ఇస్తూ, నీళ్లు ఆరగిస్తూ స్వాగతం పలికారు. ఆదివాసీ పెద్ద మనుషులు, యువత రక్షణ కవచంలా ఉంటూ గద్దెల వరకు చేర్చారు. భక్తులు రహదారులకు ఇరువైపులా కన్నెపల్లి నుంచి జంపన్నవాగు వరకు 2 కిలోమీటర్ల మేర శరణు వేడుతూ జంపన్నకు స్వాగతం పలికారు. గద్దెకు చేరిన తర్వాత భక్తులు జంపన్నను దర్శించుకున్నారు. ఇవాళ సమ్మక్క కూతురైన సారలమ్మ సాయంత్రం నాలుగు గంటలకు కొలువుదీరనుంది. సారలమ్మతో పాటు, పగిడిద్దరాజు, గోవిందరాజును గద్దెపైకి చేరుకుంటారు. సంప్రదాయబద్దంగా ఆదివాసి, గిరిజన పూజారులు ఈ అమ్మవారిని తీసుకొస్తారు. గురువారం చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి గద్దెపైకి రానుంది. శుక్రవారం ఇద్దరు తల్లులు భక్తులకు దర్శనమిస్తారు. భక్తులు పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం సాయంత్రం దేవతలు వన ప్రవేశం చేయడంతో జాతర ఉత్సవాలు ముగుస్తాయి. సారలమ్మ రాక: మొదటి రోజు (ఫిబ్రవరి 21) కన్నెపల్లి నుంచి సారలమ్మ దేవి గంభీరమైన ఆగమనాన్ని సూచిస్తుంది. ఆధ్యాత్మిక ఉత్సవాలకు నాంది పలికే రోజు ఇది. గాలి దేవత సన్నిధికి స్వాగతం పలుకుతూ కీర్తనలు, సంగీతంతో అలరిస్తుంది. సమ్మక్క ప్రవేశం: రెండోరోజు (ఫిబ్రవరి 22) చిలుకలగుట్ట నుంచి సమ్మక్క అమ్మవారి జాతరతో దివ్యగాథ కొనసాగుతుంది. దేవత రాకను సూచిస్తూ డప్పులు, శంఖం ధ్వనులతో అడవి ప్రతిధ్వనిస్తుంది. ఆధ్యాత్మిక ఉత్సవాన్ని బలపరిచే రోజు ఇది. ఉత్సవాల కొనసాగింపు: మూడోరోజు (ఫిబ్రవరి 23) ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. దేవతలకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. సాంస్కృతిక ప్రదర్శనలు, సంప్రదాయ నృత్యాలు, సంగీతంతో గిరిజన వారసత్వం శక్తిమంతంగా కళ్లకు కడుతుంది. అడవికి తిరుగు ప్రయాణం: నాలుగోరోజు (ఫిబ్రవరి 24) గంభీరమైన వన ప్రవేశం వేడుక పాటిస్తారు. ఇక్కడ దేవతలు తిరిగి అడవికి ప్రయాణం చేస్తారు. ఇది జాతర ముగింపును సూచిస్తుంది. జీవిత ప్రక్రియ స్వభావం, దైవ, సహజ ప్రపంచం మధ్య ఉండే లోతైన సంబంధాన్ని గుర్తు చేస్తుంది. తెలంగాణ నుంచే కాకుండా, ఏపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్..ఇలా ఎనిమిది రాష్ట్రాల నుంచి కూడా ఈ జాతరకు భారీగా భక్తులు వస్తారు. ఈసారి మేడారం జాతరకు కోటి మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేశారు. 2014లో అప్పటి తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది. -
‘మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించకపోవడం బాధాకరం’
సాక్షి, ములుగు జిల్లా: సమ్మక్క సారలమ్మ జాతరలో రేపటి నుంచి మహాఘట్టం మొదలవుతుందని మంత్రి మంత్రి సీతక్క అన్నారు. మేడారం జాతర ఏర్పాట్లపై ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. గురువారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు అందరు దేవుళ్లు గద్దెలపై ఉంటారన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా మంచినీళ్ల సౌకర్యం పెంచామని, భక్తులకు బంగారం(బెల్లం) చేరడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. మేడారం జాతరను జాతీయ పండుగగా కేంద్రం గుర్తించకపోవడం బాధాకరమన్నారు. ‘‘60 లక్షల మంది భక్తులు ఇప్పటికే అమ్మవార్లను దర్శించుకున్నారు. కోటి 50 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జాతర సందర్భంగా సెలవులు ప్రకటించాము. సీఎం, గవర్నర్, స్పీకర్ అమ్మవార్ల దర్శనానికి వస్తారు. వీఐపీలు సాధారణ భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనం పూర్తి చేసుకోవాలి. భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు చూడాలి. సమ్మక్క చరిత్రను శిలాశాసనం ద్వారా లిఖిస్తాం’’ అని మంత్రి సీతక్క వెల్లడించారు. ఇదీ చదవండి: కుమారి ఆంటీని ఫాలో అవుతున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు -
సమ్మక్క– సారలమ్మకు జాతరకు వెళ్తూ కోడిపుంజు ఇలా..
ప్రస్తుతం సమ్మక్క– సారలమ్మ జాతర సీజన్ సందర్భంగా వరంగల్ నుంచి వేములవాడ రాజన్న దర్శనానికి వేలాది మంది భక్తులు తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో బస్సులు కూడా కిక్కిరిసి పోతున్నాయి. వరంగల్ నుంచి వేములవాడ వెళ్లిన ఓ బస్సు అక్కడ ప్రయాణికులను దింపి కరీంనగర్ బస్టాండుకు వచ్చింది. అందులో ఓ కోడిపుంజును డ్రైవర్ గుర్తించాడు. బస్సులో నుంచి ప్రయాణికులందరూ దిగిపోగా.. ఒక సంచిలో ఈ కోడి పుంజు కనిపించింది. దీంతో తప్పిపోయిన ఆ కోడిని డ్రైవర్ కంట్రోలర్‌కు అప్పగించాడు. ఆయన ఇలా ఓ జాలీలో బంధించాడు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్ -
మేడారం జాతరకు జాతీయ హోదా కోసం కృషి
సాక్షి, హైదరాబాద్: మేడారం సమ్మక్క–సారక్క జాతరకు జాతీయ పండుగ హోదా దక్కేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి మరోసారి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆమె ఆదేశించారు. జాతీయ పండుగ హోదాతో రాష్ట్ర ప్రభుత్వమిచ్చే నిధులకు కేంద్ర నిధులు తోడైతే జాతరను మరింత ఘనంగా నిర్వహించుకునే అవకాశం ఉంటుందన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించే జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సమ్మక్క–సారక్క జాతర ఏర్పాట్లపై సోమవారం డీఎస్ఎస్ భవన్లో గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. కోయ గిరిజన ఇలవేల్పుల సమ్మేళనం ఈసారి జాతర సమయంలో జరిగేటట్లు చూడాలని, తద్వారా భక్తులకు గిరిజన సాంస్కృతిక వైభవం గురించి బాగా తెలుస్తుందని మంత్రి సూచించారు. జాతర ఏర్పాట్లపై వచ్చే వారం ఏటూరునాగారంలోని ఐటీడీఏలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పల్లె ప్రజలకు మరింత చేరువ కావాలి పంచాయతీ రాజ్ శాఖ ద్వారా జరిగే కార్యక్రమాలు గ్రామీణ ప్రాంత ప్రజలకు నిత్యం ఎంతో ఉపయోగ పడేవనీ, వాటిని మరింత సమర్ధవంతంగా ప్రజలకు చేరువయ్యేలాగా అధికారులు పనిచేయాలని ఆశాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క సూచించారు. సోమవారం రాజేంద్రనగర్ టి.ఎస్.ఐ.ఆర్.డి.లో శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన మంత్రి శాఖ పని తీరును సమీక్షించారు. పీఆర్ ఆర్డీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, స్పెషల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ శెట్టి, ఇంజనీర్ ఇన్ చీఫ్ సంజీవ రావు, స్త్రీనిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డి ఆయా విభాగాల వారీగా చేపడతున్న కార్యక్రమాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. -
మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రత్యేకత
-
Chinna Medaram Photos: మేడారంలో ఘనంగా సమ్మక్క సారలమ్మ చిన్న జాతర (ఫొటోలు)
-
మేడారానికి కేసీఆర్!
సాక్షిప్రతినిధి, వరంగల్: సీఎం కేసీఆర్ శుక్రవారం మేడారం మహాజాతరలో పాల్గొని సమ్మక్క–సారక్కలకు మొక్కులు చెల్లించుకోనున్నారు. ఆయన హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మేడారానికి వస్తారని అధికారులు గురువారం సాయం త్రం తెలిపారు. కేసీఆర్ మేడారంలో సుమారు మూడు గంటలకుపైగా గడుపుతారని, నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారని వెల్లడించారు. సీఎం వెంట ప్రభుత్వ సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి కూడా రానున్నారు. ఈ మేరకు ఏర్పాట్లపై మంత్రు లు ఎర్రబెల్లి దయాకర్‌రావు, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు సమీక్షించారు. ట్రాఫిక్ నియంత్రణ, భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలపై వివిధ శాఖల అధికారులకు సూచనలు చేశారు. మొక్కలు తీర్చుకోనున్న ప్రముఖులు కేంద్ర మంత్రులు రేణుకాసింగ్, జి.కిషన్‌రెడ్డి శుక్రవారం వేర్వేరుగా మేడారం చేరుకుని వన దేవతలను దర్శించుకోనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ కూడా వస్తారని ఆయా పార్టీల వర్గాలు ప్రకటించాయి. -
పులిపై సమ్మక్క, జింకపై సారలమ్మ... ఈ రూపాలు ఎలా వచ్చాయో తెలుసా ?
-
మంత్రుల ఆదేశాలు బేఖాతర్.. కోళ్లను, మేకలను ఎక్కడపడితే అక్కడే
ఎస్‌ఎస్‌తాడ్వాయి (ములుగు జిల్లా): మేడారం జాతరలో పారిశుద్ధ్య నిర్వహణ అధికారులకు పెద్ద సవాల్‌గా మారుతోంది. భక్తులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు నెల రోజుల ముందు నుంచే అధికారులు పారిశుద్ధ్య నిర్వహణపై కుస్తీ పడుతున్నారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ జాతరకు వచ్చిన భక్తులు ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా కోళ్లు, మేకలు, గొర్లను వధించి వ్యర్థాలను పడేయడంతో పరిసరాలు కంపు కొడుతున్నాయి. వ్యర్థాల ద్వారా ఈగలు, దోమలు సైతం వ్యాపి చెందుతున్నాయి. మంత్రులు చెప్పినా.. జాతరలో పారిశుద్ధ్య నిర్వహణ ప్రధానమని, కోవిడ్ నేపద్యంలో భక్తులు ఇబ్బందులు పడకుండా పారిశుద్ధ్యానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని ఇటీవల మేడారంలో నిర్వహించిన సమీక్ష సందర్భంగా మంత్రులు సంబంధిత అధికారులను ఆదేశించారు. అయినా వారి ఆదేశాలను అధికారులు పట్టించుకోవడం లేదు. ఇదిలాఉండగా తల్లులను దర్శించుకునేందుకు గత నెల రోజుల నుంచి బుధ, గురు, శుక్ర, ఆదివారాల్లో భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తున్నారు. వారంతా చిలకలగుట్ట, శివరాంసాగర్, ఆర్టీసీ బస్టాండ్ వై జంక్షన్ ప్రాంతాల్లో విడిది చేస్తున్నారు. వనదేవతలకు మొక్కులు చెల్లించేందుకు తెచ్చిన మేకలు, కోళ్లను ఎక్కపడితే అక్కడ వధిస్తున్నారు. దీంతో వ్యర్థాలు పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కోళ్లను, మేకలను ఎక్కడపడితే అక్కడ వధించకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. నిరుపయోగంగా మరుగుదొడ్లు మరుగుదొడ్లు నిరుపయోగం.. మేడారంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉన్నాయి. భక్తుల సౌకర్యర్థం ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో తాత్కాలిక జీఐ షీట్స్ మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. నీళ్ల కోసం కుండీలను కట్టారు. అంతాబాగానే ఉన్న కుండీల్లో మాత్రం నీరు పోయడం లేదు. దీంతో జాతరకు వస్తున్న భక్తులు మల, మూత్ర విసర్జన సందర్భంగా ఇబ్బందులు పడుతున్నారు. తప్పని పరిస్థితుల్లో వాటర్ బాటిళ్లలో నీరు తీసుకుని మరుగుదొడ్లను వినియోగించుకోవడంతో కంపు కొడుతున్నాయి. కాగా, జాతర నాలుగు రోజులు మాత్రమే మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకురావాలనే అధికారుల ఆలోచనను భక్తులు తప్పుపడుతున్నారు. ముందస్తుగా జాతరకు వచ్చే వారికోసం సైతం అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. -
మేడారం జాతర సందడి.. ఘనంగా ‘గుడిమెలిగె’ (ఫోటోలు)
-
సిటీజనులకు గుడ్‌న్యూస్.. మేడారం జాతరకు ఆర్టీసీ బస్సులు.. ఇలా బుక్ చేసుకోండి
సాక్షి, సిటీబ్యూరో: సిటీ ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇవ్వనున్నారు. ప్రయాణికులు నేరుగా తమ ఇంటి వద్ద నుంచే బయలుదేరేందుకు వీలుగా ఇవి అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, జాతరల కోసం అద్దె ప్రాతిపదికన బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులు కనీసం 30 మంది ఉంటే చాలు. బస్సు అద్దెకు తీసుకొని వెళ్లవచ్చు. ఆర్టీసీ బస్సులు నేరుగా సమ్మక్క గద్దె వరకు వెళ్తాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంధువులను తీసుకెళ్లేందుకు బస్సులను అద్దెకు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. సమీపంలోని డిపో మేనేజర్‌ను సంప్రదించి బస్సును బుక్ చేసుకోవచ్చు. ఆర్టీసీ వెబ్సైట్ www. tsrtconline.in ద్వారా సంప్రదించి బస్సులను అద్దెకు తీసుకోవచ్చు. (చదవండి: బీజేపీ Vs టీఆర్ఎస్.. చిచ్చురేపిన వాట్సాప్ మెసేజ్) -
మహాజాతరకు వేళాయె
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఆదివాసీల అతిపెద్ద ఉత్స వం.. మేడారం జాతరకు వేళయ్యింది. బుధవారం సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజు గద్దెలపైకి రావడంతో మహా జాతర ప్రారంభమవుతోంది. ఈనెల 5 నుంచి 8వ తేదీ వరకు సమ్మక్క– సారలమ్మ మహా జాతర నిర్వహణకు మేడారం సిద్ధమైంది. వనదేవతల వారంగా భావించే బుధవా రం రోజున.. మేడారం, కన్నెపల్లి, కొండాయి, పూనుగొండ్లలో జాతరకు శ్రీకారం చుడతారు. 4 ప్రాంతాల్లోనూ వనదేవతల పూజ కార్యక్రమాలు నిర్వహించడంతో జాతర లాంఛనంగా మొదలవుతోంది. ఈసారి 1.40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేసి ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. నేటి నుంచే కీలక ఘట్టం మొదలు కోట్లాది మంది భక్తులు ఎదురు చూసే ఈ మహజాతరలో తొలి ఘట్టం మంగళవారం మొదలు కానుంది. సమ్మక్క భర్త పగిడిద్దరాజును పెళ్లి కుమారుడిగా తయారు చేయడంతో ప్రారంభమవుతోంది. పెనక వంశానికి చెందిన పూజారులతో పాటు పూను గొండ్ల గ్రామస్తులు నిష్ఠతో ఈ పూజలు నిర్వహిస్తారు. ముందుగా తలపతి (పూజారుల పెద్ద) ఇంట్లో అమ్మవారికి తీసుకుని వెళ్లేపానుపు (పసుపు, కుంకుమ, కొత్త వస్త్రాలు) సిద్ధం చేస్తారు. ఉదయం పానుపును డోలి వాయిద్యాల నడుమ ఆలయానికి తరలించి పూజలు చేస్తారు. దేవుని గుట్ట నుంచి తీసుకువచి్చన వెదురు కర్రతో పగిడిద్దరాజు పడిగెను సిద్ధం చేస్తారు. శివసత్తుల పూనకాలు, దేవుని మహిమతో తన్మయత్వం పొందిన పూజారులు పడిగెను ఆలయ ప్రాంగణంలోని గద్దెపై ప్రతిíÙ్ఠస్తారు. సుమారు 2 గంటలు పెళ్లి కుమారుడిగా భక్తులకు దర్శనం ఇచ్చే పగిడిద్దరాజును దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. అనంతరం పూజారులు తలపతి ఇంట్లో సిద్ధం చేసిన పానుపుతో పాటు పడిగెను తీసుకుని కాలినడకన అటవీ మార్గాన బయలు దేరుతారు. పస్రా చేరుకున్నాక పగిడిద్దరాజుకు నేరుగా సమ్మక్క కొలువుదీరిన చిలుకల గుట్టపైకి చేరుకుంటారు. ఇక్కడ వారి ఇరువురికి ఆదివాసీ సంప్రదాయంలో ఇరు పూజారులు ఎదుర్కోళ్లు, వివాహం జరిపిస్తారు. 5న సారలమ్మ, 6న సమ్మక్క సమ్మక్క కూతురైన సారలమ్మ నివాసం కన్నెపల్లి. మేడారం గద్దెలకు 3 కిలోమీటర్ల దూరం లోని ఈ కుగ్రామంలో చిన్న ఆలయంలో ప్రతిíÙ్ఠంచబడిన సారలమ్మ 5న బుధవారం సాయంత్రం మేడారం లోని గద్దె వద్దకు చేరుతుంది. కడుపు పండాలని కోరుకునేవారు.. దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడుతున్న వందలాది మంది తడి బట్టలతో గుడి ఎదుట సాష్టాంగ నమస్కారాలతో వరం పడతారు. సారలమ్మను మోస్తున్న పూజారిని దేవదూతగా భావిస్తారు. సారలమ్మ జంపన్నవాగు గుండా నేరుగా మేడారంలోని తల్లి సమ్మక్క దేవాలయానికి చేరుకుంటుంది. సారలమ్మ కొలువుదీరిన మరుసటి రోజున అంటే 6న గురువారం సాయంత్రం వేళ సమ్మక్క గద్దెపైకి వస్తుంది. ఆ రోజు ఉదయమే పూజారులు చిలకలగుట్టకు వెళ్లి వనం (వెదురు కర్రలు) తెచ్చి గద్దెలపై పూజలు చేస్తారు. అనంతరం సమ్మక్క పూజామందిరం నుంచి వడరాలు, పసిడి కుండలను తెచ్చి గద్దెలపై నెలకొల్పుతారు. సాయంత్రం వేళలో చిలకలగుట్టపై కుంకుమభరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపైకి తెచ్చేందుకు పూజారులు బయలుదేరుతారు. జాతర మొత్తానికి ప్రధానమైన సమ్మక్క ఆగమనం కోసం భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తారు. తల్లికి ఆహ్వానం పలు కుతూ చిలకలగుట్ట వద్దకు వెళ్తారు. సమ్మక్క కొలువైన ప్రదేశానికి చేరుకున్న పూజారులు అక్కడ పూజలు చేస్తారు. తల్లి రూపాన్ని చేతపట్టుకున్న మరుక్షణమే ప్రధాన పూజారి మైకంతో పరుగున గుట్ట దిగుతాడు. అక్కడ పోలీసులు రక్షణ ఏర్పాట్లు చేస్తారు. జిల్లా ఎస్పీ తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపి అధికార వందనంతో స్వాగతం పలుకుతారు. మూడో రోజు మొక్కులు.. గద్దెలపై ఆశీనులైన సమ్మక్క–సారలమ్మ జాతరలో మూడో రోజు (7వ తేదీ) భక్తులకు దర్శనమిస్తారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారు. కోర్కెలు తీర్చమని వేడుకుంటారు. కోర్కెలు తీరినవారు కానుకలు చెల్లిస్తారు. ఆడపడుచులుగా భావిస్తూ పసుపుకుంకుమలు, చీరె, సారెలు పెడతారు. ఒడి బియ్యం పోస్తారు. తలనీలాలు సమర్పించుకుంటారు. ఎత్తు బంగారం (బెల్లం) నైవేద్యంగా పెడతారు. ఆ రోజంతా లక్షలాది మంది గద్దెల వద్ద అమ్మవార్లను దర్శించుకుంటారు. కనులారా వీక్షించి మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన అశేష భక్తజనానికి దర్శనం ఇచి్చన సమ్మక్క–సారలమ్మ నాలుగో రోజున (8 శనివారం) సాయంత్రం తిరిగివన ప్రవేశం చేస్తారు. దీంతో జాతర ముగిసిపోతుంది. మేడారం బయలుదేరిన పగిడిద్దరాజు గుండాల: అర్రెం వంశీయుల ఆరాధ్య దైవం, సమక్క భర్త అయిన పగిడిద్దరాజు సోమవారం మేడారం పయనమయ్యాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం యాపలగడ్డ గ్రామం నుంచి అర్రెం వంశీయులు పగిడిద్దరాజును తీసుకుని కాలినడకన బయలుదేరారు. -
బంగారం బెంగ తీరింది..!
మంచిర్యాల అర్బన్: ఈ నెల 31న ప్రారంభమయ్యే మేడారం మహాజాతరలో సమ్మక్క–సారలమ్మలకు మొక్కులుగా సమర్పించే బంగారం (బెల్లం)పై ప్రభుత్వం ఆంక్షలు సడలించింది. మేడారం జాతర పూర్తయ్యే వరకు బెల్లం విక్రయాలు జరుపుకోవడానికి అనుమతిచ్చింది. అయితే విక్రయించే బెల్లానికి సంబంధించి పక్కాగా లెక్క ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు గాను ఆధార్ కార్డును తప్పనిసరి చేసింది. ఇదివరకు గుడుంబా నియంత్రణ పేరిట ఆంక్షలు విధించడం, మరోవైపు పోలీస్, ఎక్సైజ్ అధికారులు కేసులు నమోదు చేయటంతో బెల్లం విక్రయాలను వ్యాపారులు నిలిపివేశారు. దీంతో జిల్లావ్యాప్తంగా బెల్లం కొరత ఏర్పడింది. మేడారం జాతర సమీపిస్తుండటంతో వనదేవతలకు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తుల్లో అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలో జాతర వరకు బెల్లంపై నిబంధనలు సడలించడంతో భక్తులకు ఊరట కలిగింది. కొనుగోలుదారులతో సందడి.. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బుధవారం బెల్లం కొనుగోలుకు జనం తరలిరావడంతో హోల్‌సేల్ దుకాణాల వద్ద సందడి నెలకొంది. మహిళలు మంగళహారతులు చేబూని బెల్లం కొనుగోలుకు వచ్చారు. తల్లుల మొక్కులు తీర్చుకునేందుకు బంగారం (బెల్లం)ను తూకం వేసే దృశ్యాలు కనిపించాయి. పిల్లల నుంచి వృద్ధుల వరకు మొక్కులు అప్పగించే భక్తులు నిలువెత్తు (వ్యక్తి బరువుకు సమానం) బెల్లం కొనుగోలు చేసి తీసుకెళ్లారు. ఆధార్‌కార్డు చూపిస్తేనే... బెల్లం పక్కదారి పట్టకుండా వ్యాపారులకు కొన్ని షరతులను విధించారు. బెల్లం కొనుగోలు చేసే వారి నుంచి తప్పనిసరిగా ఆధార్‌కార్డు నెంబర్, ఫోన్ నెంబర్లను వ్యాపారులు సేకరిస్తున్నారు. గృహ అవసరాల కోసం వాడుకుంటామని, ఇతర అవసరాల వినియోగించబోమని హామీపత్రం (రశీదు)పై సంతకం తీసుకుని బెల్లం విక్రయాలు జరపుతున్నారు. రిటైల్ వ్యాపారులకు విక్రయించే సమయంలో పక్కాగా బిల్లులు ఇస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎక్సైజ్ అధికారులు లెక్కలు అడిగితే చూపేందుకు జాగ్రత్తలు పడుతున్నారు. లారీ వచ్చిన మూడు గంటల్లోపే ఖతం బుధవారం నుంచి బెల్లంపై నిబంధనలు సడలించటంతో మంచిర్యాలలోని హోల్‌సేల్ వ్యాపారులు మహారాష్ట్ర నుంచి బెల్లం దిగుమతి చేసుకున్నారు. ముగ్గురు హోల్‌సేల్ వ్యాపారులు మూడు లారీల్లో బెల్లం తెప్పించారు. ఒక్కో లారీలో ఒక్కో ముద్ద పది కిలోల చొప్పున ఉండే 1600 ముద్దలు (16 టన్నులు) తెచ్చారు. మూడు గంటల్లోపే మొత్తం విక్రయాలు పూర్తి చేశారు. హోల్‌సేల్ వ్యాపారులు కిలోకు రూ.32 చొప్పున అమ్ముతున్నారు. జాతరకు వెళ్లే భక్తులు మంచిర్యాల జిల్లా నుంచే ఎక్కువ మంది ఉండటం వల్ల బెల్లం విక్రయాలు అధికంగానే ఉంటాయని వ్యాపారులు అంటున్నారు. ఇక్కడినుంచి మంథని, కాటారం, సిరోంచ, మందమమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ తదితర ప్రాంతాలకు బెల్లం సరఫరా చేస్తుంటారు. దాదాపుగా జాతర పూర్తయ్యేవరకు 30 నుంచి 40 లారీల మేర బెల్లం అమ్మకాలు ఉంటాయని అంచనా వేస్తున్నట్లు ఓ వ్యాపారి ‘సాక్షి’కి తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి బెల్లం దిగుమతి అవుతోందని చెప్పారు. హోల్‌సేల్ దుకాణాలు.. మంచిర్యాలలోని శ్రీనివాస టాకీస్ రోడ్లో హోల్‌సేల్ బెల్లం దుకాణాలు ఉన్నాయి. ఓం ట్రేడింగ్ కంపెనీ, దయాల్ ట్రేడింగ్, రాందయాల్, సంతోష్ ఎంటర్‌ప్రైజెస్‌తో పాటు మరో రెండు హోల్‌సేల్ దుకాణాల్లో బెల్లం లభిస్తోంది. -
సమ్మక్మ జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు
ఆదిలాబాద్ : మేడారం జాతర ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరుగుతుందని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం ఆదిలాబాద్‌లో ఇంద్రకరణ్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... సమ్మక్క - సారలమ్మ జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. వచ్చే ఏడాది రూ. 3 కోట్లతో నాగోబా దేవాలయన్ని అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు. అయితే జిల్లాలోని ఏదో ప్రాంతంలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారని ఈ సందర్భంగా ఇంద్రకరణ్ రెడ్డి గుర్తు చేశారు. ఈ అంశంపై రాజకీయం చేయడం తగదని విద్యార్థు సంఘాలకు ఇంద్రకరణ్ సూచించారు.