సాక్షి, ములుగు జిల్లా: సమ్మక్క సారలమ్మ జాతరలో రేపటి నుంచి మహాఘట్టం మొదలవుతుందని మంత్రి మంత్రి సీతక్క అన్నారు. మేడారం జాతర ఏర్పాట్లపై ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. గురువారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు అందరు దేవుళ్లు గద్దెలపై ఉంటారన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా మంచినీళ్ల సౌకర్యం పెంచామని, భక్తులకు బంగారం(బెల్లం) చేరడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. మేడారం జాతరను జాతీయ పండుగగా కేంద్రం గుర్తించకపోవడం బాధాకరమన్నారు.
‘‘60 లక్షల మంది భక్తులు ఇప్పటికే అమ్మవార్లను దర్శించుకున్నారు. కోటి 50 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జాతర సందర్భంగా సెలవులు ప్రకటించాము. సీఎం, గవర్నర్, స్పీకర్ అమ్మవార్ల దర్శనానికి వస్తారు. వీఐపీలు సాధారణ భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనం పూర్తి చేసుకోవాలి. భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు చూడాలి. సమ్మక్క చరిత్రను శిలాశాసనం ద్వారా లిఖిస్తాం’’ అని మంత్రి సీతక్క వెల్లడించారు.
ఇదీ చదవండి: కుమారి ఆంటీని ఫాలో అవుతున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment