
సాక్షి, సిటీబ్యూరో: సిటీ ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇవ్వనున్నారు. ప్రయాణికులు నేరుగా తమ ఇంటి వద్ద నుంచే బయలుదేరేందుకు వీలుగా ఇవి అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, జాతరల కోసం అద్దె ప్రాతిపదికన బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులు కనీసం 30 మంది ఉంటే చాలు.
బస్సు అద్దెకు తీసుకొని వెళ్లవచ్చు. ఆర్టీసీ బస్సులు నేరుగా సమ్మక్క గద్దె వరకు వెళ్తాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంధువులను తీసుకెళ్లేందుకు బస్సులను అద్దెకు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. సమీపంలోని డిపో మేనేజర్‌ను సంప్రదించి బస్సును బుక్ చేసుకోవచ్చు. ఆర్టీసీ వెబ్‌సైట్ www. tsrtconline.in ద్వారా సంప్రదించి బస్సులను అద్దెకు తీసుకోవచ్చు.
(చదవండి: బీజేపీ Vs టీఆర్‌ఎస్.. చిచ్చురేపిన వాట్సాప్ మెసేజ్)
Comments
Please login to add a commentAdd a comment