సాక్షి, హైదరాబాద్: తమ సమస్యలు పరిష్కారించకపోతే ఈ నెల 5 నుంచి సమ్మెకు దిగుతామని టీఎస్‌ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు స్పష్టం చేశారు. మంగళవారం టీఎస్‌ఆర్టీసీ అద్దె బస్సుల ఓనర్లు సాక్షి మీడియాతో మాట్లాడుతూ, మహాలక్ష్మి పథకంతో ప్రయాణికులు సంఖ్య పెరిగిందని, రద్దీ పెరిగితే బస్సులు పాడవుతున్నాయన్నారు.
ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు ఎక్కడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత అంటూ ప్రశ్నించారు. ప్రమాదానికి ఇన్య్సూరెన్స్ రాకపోతే మాపై కేసులు పెడుతున్నారు. కొత్త బస్సులకు టెండర్లు పిలిస్తే కూడా ఎవరు టెండర్లు వేయలేదు. ఇందులో గిట్టుబాటు కావడం లేదు. టెండర్లు వేయొద్దని కోరుతున్నాం’’ అని అద్దె బస్సుల యజమానులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: నేను ఎక్కడికి పారిపోలేదు: బైరి నరేష్
Comments
Please login to add a commentAdd a comment