ప్రస్తుతం సమ్మక్క– సారలమ్మ జాతర సీజన్ సందర్భంగా వరంగల్ నుంచి వేములవాడ రాజన్న దర్శనానికి వేలాది మంది భక్తులు తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో బస్సులు కూడా కిక్కిరిసి పోతున్నాయి. వరంగల్ నుంచి వేములవాడ వెళ్లిన ఓ బస్సు అక్కడ ప్రయాణికులను దింపి కరీంనగర్ బస్టాండుకు వచ్చింది. అందులో ఓ కోడిపుంజును డ్రైవర్ గుర్తించాడు. బస్సులో నుంచి ప్రయాణికులందరూ దిగిపోగా.. ఒక సంచిలో ఈ కోడి పుంజు కనిపించింది. దీంతో తప్పిపోయిన ఆ కోడిని డ్రైవర్ కంట్రోలర్‌కు అప్పగించాడు. ఆయన ఇలా ఓ జాలీలో బంధించాడు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్
Comments
Please login to add a commentAdd a comment