
ఎమ్మెల్యే కమలాకర్, జెడ్పీ చైర్‌పర్సన్ విజయ, మేయర్ సునీల్‌కుమార్, వినోద్ కుమార్
కరీంనగర్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 133వ జయంతిని ఆదివారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఆయనకు నివాళి అర్పించారు. అంబేడ్కర్ అన్నివర్గాలకు ఆదర్శమూర్తి అని మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు.
నగరంలోని కోర్టు చౌరస్తా వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ పమేలా సత్పతి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్‌రావు, జెడ్పీ చైర్‌పర్సన్ కనుమల్ల విజయ, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ తులఉమ, కరీంనగర్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్, డీసీసీ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్‌కుమార్ వేర్వేరుగా పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా అంబేడ్కర్ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. ఆయన మార్గంలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో పవన్ కుమార్, ఆర్డీవో కే.మహేశ్వర్, సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ నతానియల్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నాగార్జున, డీఆర్డీవో శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment