కర్నూలు జిల్లా మహానంది క్షేత్రంలో మహాశివరాత్రి పండుగకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
మహానంది: కర్నూలు జిల్లా మహానంది క్షేత్రంలో మహాశివరాత్రి పండుగకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మహానందీశ్వర స్వామి వార్లకు నిర్వహించే కల్యాణోత్సవంలో ముత్యాల తలంబ్రాలను వినియోగించనున్నట్లు దేవస్థానం పాలకమండలి చైర్మన్ ప్రసాదరావు తెలిపారు.
బుధవారం పాలకమండలి సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పాలక మండలి ఆధ్వర్యంలో ఈ ఏడాది కల్యాణోత్సవం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. గర్భాలయ విమాన గోపుర కలశం పక్కకు ఒరిగి పోవటంపై కలశం మార్పుతో పాటు లఘు సంప్రోక్షణ పూజలను మాఘమాసంలో నిర్వహించనున్నట్లు ప్రసాదరావు తెలిపారు.