షిర్డీలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు | shirdi sai sansthan trust special arrangements for devotees over Demonetisation of currency | Sakshi
Sakshi News home page

షిర్డీలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు

Published Wed, Nov 9 2016 5:12 PM | Last Updated on Thu, Sep 27 2018 9:07 PM

షిర్డీలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు - Sakshi

షిర్డీలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు

ముంబై : పెద్ద నోట్ల రద్దు ప్రభావం కొంత మేరకు తగ్గించేందుకు షిర్డీ సాయిసంస్థాన్ ట్రస్టు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా రెండు రోజులపాటు ఉచిత భోజనాలు అందించాలని నిర్ణయించింది.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రూ. 500, 1000 నోట్ల రద్దు నిర్ణయం ప్రభావం షిర్డీతోపాటు అనేక దేవాలయాలపై కూడా పడుతోంది. దీంతో దేశంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన షిర్డీలో కానుకల రూపంగా భక్తులు ఇచ్చే రూ 500, 1000 నోట్లను స్వీకరించేందుకు షిర్డీ సాయిబాబా సంస్థాన్ నిరాకరిస్తోంది. అయితే భక్తులకు ఈ నిర్ణయం ప్రభావం కొంతైన తగ్గించేందుకు బుధవారం, గురువారం రెండు రోజులపాటు భక్తులందరికి ఉచితంగా భోజనాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టు పిఆర్వో మోహన్ జాదవ్ ‘సాక్షి’కి తెలిపారు. ఈ మేరకు భక్తులందరికి ఉచిత భోజనాలు ఏర్పాటు చేసింది. అయినప్పటికీ షిర్డీలో భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement