shirdi sai sansthan trust
-
Shirdi Sai Baba: షిర్డీ సాయిబాబా భక్తులకు శుభవార్త
సాక్షి, ముంబై: షిర్డీ సాయిబాబా భక్తులకు శుభవార్త. బాబా ఆలయంలో సమాధిని చేతితో తాకి దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదివరకు బాబా విగ్రహాన్ని దూరం నుంచి దర్శించుకుని బయటకు వెళ్లేవారు. విగ్రహం ఎదురుగా ఉన్న సమాధి చుట్టూ అమర్చిన అద్దాల ఫ్రేమ్ వల్ల తాకేందుకు వీలు లేకుండా పోయేది. దీంతో సమాధి చుట్టూ అమర్చిన అద్దాల ఫ్రేమ్‌ను తొలగించాలని బాబా సంస్థాన్ యాజమాన్యం, షిర్డీ గ్రామస్తుల మధ్య జరిగిన సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో సాయి భక్తులకు గతంలో మాదిరిగా సమాధిని చేతులతో తాకి దర్శించుకునేందుకు వీలు లభించనుంది. సంస్థాన్ తీసుకున్న నిర్ణయంతో సాయి భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ దేవస్థానాలలో ఒకటైన షిర్డీ పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య రోజరోజుకూ పెరిగిపోతుంది. దీంతో సాయి సంస్థాన్ భక్తులకు మెరుగైన మౌలికసదుపాయాల రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. అందులోభాగంగా సాధ్యమైనంత త్వరగా బాబా దర్శనం చేసుకుని బయటకు వచ్చే విధంగా రద్దీని తగ్గించడం, ద్వారకామాయి ఆలయంలోకి రెండు దిశల నుంచి భక్తులను అనుమతిడం వంటి చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా షిర్డీ గ్రామస్తులు ఆలయ పరిసరాల్లో ఉన్న ప్రవేశ ద్వారం నుంచి సులభంగా రాకపోకలు సాగించే విధంగా ఏర్పాట్లు చేయడంతోపాటుగా సాయి సచ్చరిత పారాయణం ఇతర భాషల్లోకి అనువదిస్తున్నారు. చదవండి: (అమ్మనా జర్మనీ కోడలా?.. వైరల్) తెల్లవారు జామున బాబాకు కాకడ్ హారతీ ఇస్తున్న సమయంలో గురుస్థాన్ మందిరంలోకి భక్తులను అనుమతించడం, ఆలయ పరిసరాల్లో ఏర్పాటుచేసిన బారికేడ్లను తొలగించడం లాంటి అనేక పనులు చేపట్టనున్నారు. కానీ బాబా సమాధి చుట్టూ అమర్చిన అద్దాల ఫ్రేమ్ వల్ల భక్తులు సమాధిని తాకలేకపోతున్నారు. దీంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో అద్దాల ఫ్రేమ్ లేకపోవడంతో భక్తులు నేరుగా సమాధిని చేతులతో తాకి పావనమయ్యే వారు. ఇప్పుడు ఆ అవకాశం లేకపోవడంతో కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. షిర్డీ గ్రామస్తులు కూడా ఈ విషయాన్ని తరుచూ తెరమీదకు తెచ్చేవారు. ఎట్టకేలకు ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్న సంస్థాన్ పదాధికారులు సానుకూలంగా స్పందించారు. దీంతో సమాధి చుట్టూ ఉన్న అద్దాల ఫ్రేమ్‌ను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు సాయి సంస్థాన్ ప్రధాన కార్యనిర్వాహక అధికారి భాగ్యశ్రీ బానాయత్ తెలిపారు. -
జయంత్ ససానే కన్నుమూత
సాక్షి, ముంబై : షిర్డీలోని సాయిబాబా సంస్థాన్ మాజీ అధ్యక్షుడు జయంత్ ససానే (60) సోమవారం ఉదయం కన్నుమూశారు. అదే రోజు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. అనారోగ్యం కారణంగా ఆయన గత కొంతకాలంగా బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన అహ్మద్‌నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. 1985లో మొదటిసారి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 1999–2009 వరకు శ్రీరాంపూర్ నియోజక వర్గం ఎమ్మెల్యేగా పనిచేశారు. 15 ఏళ్లు నగరాద్యక్షుడిగా కొనసాగారు. 2004లో అప్పటి ప్రభుత్వం ససాణే అ«ధ్యక్షతన సాయి సంస్థాన్ ధర్మకర్తల మండలి స్థాపించింది. తన ఎనిమిదేళ్ల పదవీ కాలంలో ఆయన సాయి సంస్థాన్ రూపురేఖలు మార్చివేశారు. ఆసియా ఖండంలోని వివిధ పుణ్యక్షేత్రాలతో పోలిస్తే ఎక్కడా లేని రీతిలో షిర్డీలో అతి పెద్ద ప్రసాదాలయం, సోలార్ ప్రాజెక్టు నిర్మించారు. భక్తుల హుండీలో వేసిన కానుకలతో 2007లో 23న బాబాకు బంగారు సింహాసనం తయారు చేయించారు. సాయిబాబా ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలతోపాటు అందులో గుండె శస్త్రచికిత్స సేవలను కూడా ససాణే అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ప్రారంభించారు. -
షిర్డీలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు
ముంబై : పెద్ద నోట్ల రద్దు ప్రభావం కొంత మేరకు తగ్గించేందుకు షిర్డీ సాయిసంస్థాన్ ట్రస్టు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా రెండు రోజులపాటు ఉచిత భోజనాలు అందించాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రూ. 500, 1000 నోట్ల రద్దు నిర్ణయం ప్రభావం షిర్డీతోపాటు అనేక దేవాలయాలపై కూడా పడుతోంది. దీంతో దేశంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన షిర్డీలో కానుకల రూపంగా భక్తులు ఇచ్చే రూ 500, 1000 నోట్లను స్వీకరించేందుకు షిర్డీ సాయిబాబా సంస్థాన్ నిరాకరిస్తోంది. అయితే భక్తులకు ఈ నిర్ణయం ప్రభావం కొంతైన తగ్గించేందుకు బుధవారం, గురువారం రెండు రోజులపాటు భక్తులందరికి ఉచితంగా భోజనాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టు పిఆర్వో మోహన్ జాదవ్ ‘సాక్షి’కి తెలిపారు. ఈ మేరకు భక్తులందరికి ఉచిత భోజనాలు ఏర్పాటు చేసింది. అయినప్పటికీ షిర్డీలో భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.